'ది మహీంద్రా క్లాసిక్' క్యాంపైన్ - అసలేంటిది?

మహీంద్రా గ్రూప్‌లో భాగమైన మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ కొత్త బ్రాండ్ కమ్యూనికేషన్ క్యాంపెయిన్ మరియు లోగో - 'ది మహీంద్రా క్లాసిక్స్' ను ఆవిష్కరించింది. మహీంద్రా గ్రూప్ యొక్క గొప్ప ఆటోమోటివ్ వారసత్వాన్ని మరియు భారతదేశ ఆటోమోటివ్ చరిత్రలో ఏడు దశాబ్ధాలను పూర్తి చేసుకున్న సందర్భంగా కంపెనీ ఈ క్యంపైన్‌ను ప్రారంభించింది.

'ది మహీంద్రా క్లాసిక్' క్యాంపైన్ - అసలేంటిది?

ఈ సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, ఆటోమోటివ్ విభాగం సిఈఓ వీజయ్ నక్రామాట్లాడుతూ.. "మహీంద్రా క్లాసిక్ క్యాంపైన్ మహీంద్రా యొక్క గొప్ప ఆటోమోటివ్ వారసత్వానికి మేము సమర్పిస్తున్న నివాళి. ఈ క్యాంపైన్‌లో భాగంగా ప్రజలు తమ అభిమాన జ్ఞాపకాలను బ్రాండ్ మహీంద్రాతో పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. దేశంలో మహీంద్రా ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ జరిగిన అనేక జ్ఞాపకాలను మహీంద్రా బ్రాండ్ కూడా తమ ప్రజలతో పంచుకుంటుంది. మహీంద్రా ఎస్‌యూవీలను కలిగి ఉన్న వ్యక్తులు తమ వాహనాలతో ఎటుంవంటి అనుభవాలను పొంది ఉన్నారో, ఇంతకు ముందు ఎవరూ చేయని విధంగా కథలను వివరించాలనుకుంటున్నామ"ని అన్నారు.

'ది మహీంద్రా క్లాసిక్' క్యాంపైన్ - అసలేంటిది?

"మహీంద్రా క్లాసిక్స్ మన వారసత్వ స్వరూపం మరియు ఇంతకు మునుపు ఎవ్వరూ లేని కాలిబాటను వెలిగించే మన స్ఫూర్తి. భారతదేశంలో చాలా వాహనాలు మన వాహనాల మాదిరిగానే ఎమోషనల్ కనెక్ట్ కావు మరియు ఐకానిక్ హోదాను పంచుకోవు" అని ఆయన అన్నారు.

MOST READ: ఎలక్ట్రిక్ ఆటో రిక్షా బ్లాస్ట్ : రిక్షా డ్రైవర్ మృతి, ఎక్కడో తెలుసా ?

'ది మహీంద్రా క్లాసిక్' క్యాంపైన్ - అసలేంటిది?

మహీంద్రా 1969 నుండి భారతదేశంలో తయారు చేసిన వాహనాలను ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. ఈ వాహనాలు సాహసోపేతమైన స్ఫూర్తికి ప్రామాణిక చిహ్నాలుగా కొత్త రహదారులను సృష్టించాయి. యువ, సాహసోపేత భారతదేశం నేడు మహీంద్రా క్లాసిక్స్ యొక్క స్పిరిట్‌కు నిజమైన ప్రతిబింబం.

'ది మహీంద్రా క్లాసిక్' క్యాంపైన్ - అసలేంటిది?

కాగా, ఈ క్యాంపైన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే మహీంద్రా ఎస్‌యూవీలను కలిగి ఉన్న వ్యక్తులు, కొంతమంది ఇంతకు ముందు జీవించడానికి ప్రయత్నించిన జీవితాన్ని ఎలా అన్వేషించారు అనే కథలను వివరించడం, ప్రచారం చేయడం. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ మొదలైన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఈ ప్రచారం కొనసాగించబడుతుంది.

MOST READ: క్రాష్ టెస్ట్‌లో పాత కార్లు నుజ్జు నుజ్జు అయిపోయాయ్, ఇప్పటి కార్లే బెస్ట్!

'ది మహీంద్రా క్లాసిక్' క్యాంపైన్ - అసలేంటిది?

మహీంద్రాకు సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, డ్రైవ్‌స్పార్క్ బృందం ఇటీవలే బెంగుళూరు శివార్లలో టెస్టింగ్ చేస్తున్న ఎక్స్‌యూవీ300 టి-జిడిఐ మోడల్‌ను కెమెరాలో స్నాప్ చేసింది. ఈ కొత్త ఎక్స్‌యూవీ300 ఎస్‌యూవీలో 1.2-లీటర్ ఎమ్‌స్టాలియన్ ఇంజన్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 128 బిహెచ్‌పిల శక్తిని మరియు 230 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎక్స్‌యూవీ300 బిఎస్6 పెట్రోల్ ఇంజన్ కన్నా శక్తివంతమైనది. ఈ ఇంజన్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

'ది మహీంద్రా క్లాసిక్' క్యాంపైన్ - అసలేంటిది?

మహీంద్రా క్లాసిక్ క్యాంపైన్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఈ క్యాంపైన్ ద్వారా, మహీంద్రా తమ గ్రూప్ యొక్క గొప్ప ఆటోమోటివ్ వారసత్వాన్ని మరియు ఏడు దశాబ్దాల భారత ఆటోమోటివ్ చరిత్రతో ఆ బ్రాండ్‌కు ఉన్న లోతైన సంబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ప్రజల ద్వారా తమ అభిప్రాయాలను తెలుసుకోనుంది.

Most Read Articles

English summary
Mahindra & Mahindra Ltd., which is a part of the Mahindra Group, has unveiled a new brand communication campaign and logo - 'The Mahindra Classics'. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X