Just In
- 10 hrs ago
ల్యాండ్ రోవర్‌పై ప్రేమ; అంతిమ యాత్రకు కూడా అదే.. ఇది ఒక రాజు కోరిక
- 11 hrs ago
భారత్‌లో విడుదలైన ఫోక్స్‌వ్యాగన్ కొత్త వేరియంట్; ధర & వివరాలు
- 14 hrs ago
బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160పై చేతులు వదిలేసి వీలీ, వరల్డ్ రికార్డ్ బ్రేక్!
- 14 hrs ago
ఇదే అత్యంత చవకైన హీరో బైక్; ధర కేవలం రూ.49,400 మాత్రమే..!
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : మిధున రాశి వారికి పనిభారం ఎక్కువగా ఉంటుంది...!
- News
కేసీఆర్ మనవడికీ పదవచ్చేదే, కానీ: రవినాయక్ మంచోడంటూ బండి సంజయ్, విజయశాంతి ఫైర్
- Sports
RR vs DC: సిక్స్‌లతో చెలరేగిన రూ.16.25 కోట్ల ఆటగాడు.. రాజస్థాన్ అద్భుత విజయం!
- Finance
భారీగా షాకిచ్చిన పసిడి, రూ.630 పెరిగి రూ.47,000 క్రాస్: వెండి రూ.1100 జంప్
- Movies
కొరటాల శివ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఇదే.. మళ్ళీ అదే తరహాలో..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహీంద్రా వింటర్ చెకప్ క్యాంప్ ప్రారంభం; వివిధ రకాల సేవలపై తగ్గింపులు
ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త సర్వీస్ మెయింటినెన్స్ క్యాంపైన్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. మహీంద్రా 'వింటర్ చెక్-అప్ క్యాంప్' పేరుతో పిలువబడే ఈ సర్వీస్ క్యాంపైన్‌లో మహీంద్రా కస్టమర్ల కోసం కంపెనీ ప్రత్యేకమైన సేవలను అందుబాటులోకి తెచ్చింది.

భారతదేశంలో కొనసాగుతున్న శీతాకాలానికి అనుగుణంగా, కస్టమర్లు తమ కార్లను సిద్ధం చేసుకోవటానికి ఈ మహీంద్రా వింటర్ చెకప్ క్యాంప్ సహాయపడుతుంది. ఈ క్యాంపైన్‌ను వచ్చే మహీంద్రా వాహనాల యజమానులకు కంపెనీ వివిధ రకాల సేవలపై ప్రత్యేక తగ్గింపులను కూడా అందిస్తోంది.

మహీంద్రా వింటర్ చెకప్ క్యాంప్‌కు వచ్చే వాహనాలను కంపెనీ సర్వీస్ నిపుణులు క్షుణ్ణంగా తనిఖీ చేసి, ఏవైనా మరమ్మత్తులు అవసరం అయితే వాటి గురించి సదరు వాహన యజమానులకు వివరిస్తారు. ఇందుకు సంబంధించిన లేబర్ ఛార్జీలు మరియు విడిభాగాలపై తగ్గింపులను కూడా కంపెనీ ఆఫర్ చేస్తుంది.
MOST READ:ఈ-రిక్షాలు ఇవ్వనున్న సోనూసూద్.. కానీ ఇవి వారికి మాత్రమే

మహీంద్రా ‘వింటర్ చెక్-అప్ క్యాంప్' దేశవ్యాప్తంగా ఉన్న మహీంద్రా డీలర్‌షిప్ కేంద్రాలు మరియు సర్వీస్ సెంటర్ల ద్వారా అందుబాటులో ఉంటుంది. ఇది డిసెంబర్ 14 నుండి 19వ తేదీ వరకూ చెల్లుబాటులో ఉంటుంది.

ఈ సర్వీస్ క్యాంపైన్‌లో భాగంగా కంపెనీ మహీంద్రా వాహనాలకు 75 మల్టీ పాయింట్ చెకప్ చేస్తుంది. అంటే కారులోని 75 అంశాలు/భాగాలను కంపెనీ తనిఖీ చేస్తుంది. ఈ చెక్‌లిస్ట్‌లో ఇంజన్ ఆయిల్ మరియు వాహనంలోని ఇతర ఆపరేటింగ్ లిక్విడ్స్, ఏసి అండ్ హీటర్, టైర్లు, బ్రేకులు, అన్ని ల్యాంప్స్ వంటి ఎన్నో అంశాలు ఉంటాయి.

ఈ చెకప్ సమయంలో సరిగ్గా పనిచేయని ఏ భాగాన్నైనా సర్వీస్ సెంటర్‌లో శిక్షణ పొందిన సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో కస్టమర్ నుండి అంగీకారం పొందిన తర్వాతనే రీప్లేస్ చేస్తారు. ఈ వింటర్ చెకప్ క్యాంప్‌లో కస్టమర్లకు లబ్ధి చేకూర్చేందుకు కంపెనీ వివిధ రకాల డిస్కౌంట్లను కూడా అందిస్తోంది.

మహీంద్రా వాహనంపై చేసే ఏదైనా సర్వీస్ మరియు మెయింటినెన్స్ పనులకు గానూ లేబర్ చార్జీలపై 10 శాతం తగ్గింపును అందిస్తున్నారు. అంతేకాకుండా, ఈ సర్వీస్ సమయంలో రీప్లేస్ చేయబడే ఏదైనా విడిభాగాలపై 5 శాతం వరకూ తగ్గింపును కూడా కంపెనీ అందిస్తోంది.
ఇంకా ఈ క్యాంపైన్‌లో భాగంగా, విండ్‌షీల్డ్ రక్షణ మరియు వాహనం యొక్క హెడ్‌ల్యాంప్ పునరుద్ధరణ కోసం ప్రత్యేకమైన మాక్సికేర్ ట్రీట్‌మెంట్‌లపై కంపెనీ 25 శాతం తగ్గింపును కూడా అందిస్తోంది.

శీతాకాలంలో వాహనాల విషయంలో సరైన మెయింటినెన్స్ ఎంతో అవసరం. ప్రత్యేకించి పొగమంచు పరిస్థితుల్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు విండ్‌షీల్డ్, ఫాగ్ ల్యాంప్స్, హెడ్‌ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్ మరియు ఇండికేటర్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో నిర్ధారించుకోవాలి. ఇవి మసకబారి ఉంటే, డ్రైవర్ దృష్టి తగ్గి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

వీటిని పాలిష్ చేసుకోవటం లేదా రీప్లేస్ చేసుకోవటం వలన ఈ సమస్యను అధిగమించవచ్చు. అలాగే, శీతాకాలంలో ద్రవాలు (ఫ్లూయిడ్స్) ఫ్రీజ్ కాకుండా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం శీతాకాలానికి తగిన ద్రవాలు కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే, ఏసి మరియు హీటర్ చక్కగా పనిచేసేలా చూసుకోవాలని, ఇది డీఫాగ్గింగ్‌లో సహకరిస్తుంది.
MOST READ:కుక్క వల్ల అరెస్ట్ అయిన కార్ డ్రైవర్.. ఎందుకు, ఎలాగో మీరే చూడండి ?