మహీంద్రా ఎక్స్‌యూవీ300 బిఎస్6 డీజిల్ వెర్షన్ మైలేజ్ ఎంతో తెలుసా?

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అందిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ300 (Mahindra XUV300)లో కంపెనీ లాక్‌డౌన్‌కి కొద్ది రోజుల ముందే బిఎస్6 వెర్షన్ డీజిల్ ఇంజన్ వేరియంట్లను విడుదల చేసింది. ఇప్పుడు తాజాగా ఈ బిఎస్6 డీజిల్ ఇంజన్‌కి సంబంధించిన మైలేజ్ వివరాలు వెల్లడయ్యాయి. భారత మార్కెట్లో ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.8.69 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 బిఎస్6 డీజిల్ వెర్షన్ మైలేజ్ ఎంతో తెలుసా?

మహీంద్రా ఎక్స్‌యూవీ300 బిఎస్6 డీజిల్ వెర్షన్‌లో ఇదివరకటి 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌నే ఉపయోగించారు. అయితే, ఈ ఇంజన్‌ను ప్రస్తుత కాలుష్య నిబంధనలకు అనుగుణంగా మోడిఫై చేశారు. ఎక్స్‌యూవీ300 లోని 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ గరిష్టంగా 117 బిహెచ్‌పిల శక్తిని మరియు 300 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లేదా ఆప్షనల్ ఏఎమ్‌టి ట్రాన్సిమిషన్ ఫీచర్లతో లభిస్తుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 బిఎస్6 డీజిల్ వెర్షన్ మైలేజ్ ఎంతో తెలుసా?

ఏఆర్ఏఐ (ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) సర్టిఫై చేసిన దాని ప్రకారం, నిర్ధిష్ట డ్రైవింగ్ పరిస్థితుల్లో మహీంద్రా ఎక్స్‌యూవీ300 బిఎస్6 డీజిల్ వేరియంట్ లీటరుకు 20 కిలోమీటర్ల మైలేజీ వస్తుందని నిర్ధారణ అయ్యింది. వాస్తవానికి బిఎస్4 మోడల్ కూడా ఇదే రేంజ్‌లో మైలేజీనిచ్చేది. పవర్, టార్క్, మైలేజ్ విషయాల్లో రాజీపడకుండా మహీంద్రా తమ డీజిల్ ఇంజన్‌ను బిఎస్6కు అప్‌గ్రేడ్ చేసింది. కాగా.. ఏఎమ్‌టి వెర్షన్ మైలేజ్ వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కావల్సి ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 బిఎస్6 డీజిల్ వెర్షన్ మైలేజ్ ఎంతో తెలుసా?

మహీంద్రా ఎక్స్‌యూవీ300 కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, ఫోర్డ్ ఈకోస్పోర్ట్, మారుతి సుజుకి విటారా బ్రీజ్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుంది. ఈ సెగ్మెంట్లో ఒక్క విటారా బ్రీజ్ మినహా మిగిలిన అన్ని ఇతర మోడళ్లు కూడా డీజిల్ ఇంజన్ ఆప్షన్లో లభ్యమవుతున్నాయి. మరి ఈ మోడళ్లతో ఎక్స్‌యూవీ300 ఏ విధంగా పోటీ పడుతుందో తెలుసుకుందాం రండి.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 బిఎస్6 డీజిల్ వెర్షన్ మైలేజ్ ఎంతో తెలుసా?

ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోని దాదాపు అన్ని మోడళ్లు కూడా 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌ను కలిగి ఉంటాయి. వాటన్నింటితో పోల్చుకుంటే మహీంద్రా ఎక్స్‌యూవీ300 లోని డీజిల్ ఇంజన్ మాత్రం కాస్తంత ఎక్కువ పవర్ మరియు టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. పవర్ విషయంలో ఎక్స్‌యూవీ300 తర్వాత స్థానాల్లో టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూలు ఉండగా చివరి స్థానంలో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ (100 బిహెచ్‌పి పవర్, 215 ఎన్ఎమ్ టార్క్) ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 బిఎస్6 డీజిల్ వెర్షన్ మైలేజ్ ఎంతో తెలుసా?

ఇక మైలేజ్ విషయానికి వస్తే.. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో అన్నింటికన్నా బెస్ట్ మైలేజీనిచ్చేది హ్యుందాయ్ వెన్యూ, ఇది గరిష్టంగా లీటరుకు 23.3 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. ఇక రెండవ స్థానంలో ఉన్నది టాటా నెక్సాన్, ఇది లీటరుకు గరిష్టంగా 22.4 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. ఆ తర్వాతి స్థానంలో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ (21.47 కెఎంపిఎల్) మరియు చివరి స్థానంలో మహీంద్రా ఎక్స్‌యూవీ300 (20 కెఎంపిఎల్)లు నిలుస్తాయి. ఇవన్నీ డీజిల్ వేరియంట్ల మైలేజీ వివరాలు. మైలేజ్ పరంగా ఎక్స్‌యూవీ చివరి స్థానంలో ఉన్నప్పటికీ, పవర్‌లో మాత్రం అగ్రస్థానంలో నిలుస్తుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 బిఎస్6 డీజిల్ వెర్షన్ మైలేజ్ ఎంతో తెలుసా?

ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో డీజిల్ ఇంజన్ ఆప్షన్ ప్లస్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో లభించేవి రెండే మోడళ్లు, అవి - టాటా నెక్సాన్ మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ300. ప్రస్తుతానికి ఎక్స్‌యూవీ300 డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ మైలేజ్ వివరాలు అధికారికంగా తెలియకపోయినప్పటికీ, ఇది మ్యాన్యువల్ వేరియంట్ కన్నా కాస్తంత ఎక్కువే ఉంటుందని అంచనా.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 బిఎస్6 డీజిల్ వెర్షన్ మైలేజ్ ఎంతో తెలుసా?

కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో డీజిల్ ఇంజన్ ప్లస్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభించే కార్ల ధరల విషయానికి వస్తే.. హ్యుందాయ్ వెన్యూ రూ.8.10 లక్షల ధరతో వాల్యూ ఫర్ మనీగా ఉంటే, మహీంద్రా ఎక్స్‌యూవీ బిఎస్6 డీజిల్ వేరియంట్ ధర మాత్రం రూ.8.69 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 బిఎస్6 డీజిల్ వెర్షన్ మైలేజ్ ఎంతో తెలుసా?

మహీంద్రా ఎక్స్‌యూవీ300 బిఎస్6 డీజిల్ వెర్షన్ మైలేజ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 బిఎస్6 డీజిల్ వెర్షన్ కంపెనీ నుంచి వచ్చిన లేటెస్ట్ మోడల్. పెర్ఫార్మెన్ పరంగా ఇది నెంబర్ వన్‌గా ఉన్నప్పటికీ ధర మరియు మైలేజీ విషయంలో హ్యుందాయ్ వెన్యూనే టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ మోడల్ పవర్, టార్క్, మైలేజ్ విషయాల్లో రాజీపడకుండా మహీంద్రా తమ 1.5 డీజిల్ ఇంజన్‌ను బిఎస్6 నిబంధనలకు అనుకూలంగా అప్‌గ్రేడ్ చేసింది.

Source: Autocar India

More from DriveSpark

Article Published On: Saturday, June 6, 2020, 13:02 [IST]
English summary
The Mahindra XUV300 BS6 diesel mileage figures have been revealed. The company launched the XUV300 diesel variant just before the nation-wide lockdown was announced in the country. The compact-SUV retails at a starting price of Rs 8.69 lakh, ex-showroom (India). Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+