గ్లోబల్ సేఫర్ ఛాయిస్ ఆవార్డ్ పొందిన తొలి ఇండియన్ కారు: మహీంద్రా ఎక్స్‌యూవీ300

మహీంద్రా ఎక్స్‌‌యూవీ300 ఎస్‌యూవీ అంతర్జాతీయ సేఫర్ ఛాయిస్ అవార్డు గెలుపొందింది, కార్ల సేఫ్టీ పరంగా ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన ఈ అవార్డును పొందిన ఏకైక ఇండియన్ కారు మహీంద్రా ఎక్స్‌యూవీ300.

గ్లోబల్ సేఫర్ ఛాయిస్ ఆవార్డ్ పొందిన తొలి ఇండియన్ కారు: మహీంద్రా ఎక్స్‌యూవీ300

గ్లోబల్ ఎన్సీఏపీ అందించే ఈ అవార్డుకు ఎంపిక కావాలంటే కొన్ని తప్పనిసరి అంశాలకు అర్హత సాధించాల్సిందే. పెద్దల భద్రత పరంగా 5-స్టార్ రేటింగ్ మరియు చిన్న పిల్లల భద్రత విషయంలో కనీసం 4-స్టార్ రేటింగ్ సాధించాలి.

గ్లోబల్ సేఫర్ ఛాయిస్ ఆవార్డ్ పొందిన తొలి ఇండియన్ కారు: మహీంద్రా ఎక్స్‌యూవీ300

ఈ అవార్డుకు వచ్చే మోడల్ అన్ని వేరియంట్లలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ టెక్నాలజీ తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ ఈ ఫీచర్‌ను హై ఎండ్ వేరియంట్లలో అందించి, బేసిక్ వేరియంట్లలో అందివ్వకపోతే.. అన్ని వేరియంట్ల విక్రయాల్లో ఈ టెక్నాలజీతో అమ్ముడైన వేరియంట్ల సేల్స్ మొత్తం సేల్స్‌లో కనీసం 20శాతం ఉండాలి.

గ్లోబల్ సేఫర్ ఛాయిస్ ఆవార్డ్ పొందిన తొలి ఇండియన్ కారు: మహీంద్రా ఎక్స్‌యూవీ300

గ్లోబల్ ఎన్సీఏపీ సేఫర్ ఛాయిస్ అవార్డు రేసులో నిలబడాలంటే యూనైటెడ్ నేషన్స్ రెగ్యులేషన్స్ UN 127 లేదా GTR9 ప్రమాణాలను పాటించే పెడస్ట్రేన్ ప్రొటెక్షన్ (పాదచారుల భద్రత) సేఫ్టీ ఫీచర్ తప్పనిసరిగా ఉండాలి. మరియు ఈ ఫీచర్‌నను గ్లోబల్ ఎన్సీఏపీ నిర్దారించాల్సి ఉంటుంది.

గ్లోబల్ సేఫర్ ఛాయిస్ ఆవార్డ్ పొందిన తొలి ఇండియన్ కారు: మహీంద్రా ఎక్స్‌యూవీ300

పైన పేర్కొన్న అంశాలను మహీంద్రా ఎక్స్‌యూవీ300 తూ.చ తప్పకుండా పాటించింది. ఇందులోని టాప్ ఎండ్ వేరియంట్ W8(O)లో 7-ఎయిర్ బ్యాగులు, కార్నర్ బ్రేకింగ్ టెక్నాలజీ గల యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ప్రయాణికులందరికీ త్రీ-పాయింట్ సీట్ బెల్ట్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు మరియు రెండో వరుస సీట్లలో సీట్ బెల్ట్ రిమైండర్ వంటి సేఫ్టీ ఫీచర్లు తప్పనిసరిగా వచ్చాయి.

గ్లోబల్ సేఫర్ ఛాయిస్ ఆవార్డ్ పొందిన తొలి ఇండియన్ కారు: మహీంద్రా ఎక్స్‌యూవీ300

కాంపాక్ట్ కార్స్/ఎస్‌యూవీ కెటగిరీలో సబ్-ఫోర్ మీటర్ వెహిల్ సెగ్మెంట్లో మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఈ ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకుంది. ఈ అవార్డు మహీంద్రా అండ్ మహీంద్రాకు గొప్ప విజయమనే చెప్పాలి. ఇప్పటి వరకూ ఇండియన్ మార్కెట్లో ఈ అవార్డు పొందిన మోడల్ ఒక్కటి కూడా లేదు.

గ్లోబల్ సేఫర్ ఛాయిస్ ఆవార్డ్ పొందిన తొలి ఇండియన్ కారు: మహీంద్రా ఎక్స్‌యూవీ300

మహీంద్రా ఎక్స్‌యూవీ300 అంతర్జాతీయ సేఫర్ ఛాయిస్ అవార్డు సాధించినట్లు గ్లోబల్ ఎన్సీఏపీ సంస్థ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పష్టం చేసింది. ఇండియన్ మార్కెట్లో ప్యాసింజర్ కార్లను విక్రయించే కంపెనీలకు ఇదొక పెద్ద సవాలు. ఇప్పటికీ ఈ రేసులో ఎన్నో కంపెనీలు వచ్చాయి. కానీ సక్సెస్ కాలేకపోయాయి.

గ్లోబల్ సేఫర్ ఛాయిస్ ఆవార్డ్ పొందిన తొలి ఇండియన్ కారు: మహీంద్రా ఎక్స్‌యూవీ300

కంపెనీ సాధించిన ఈ విజయానికి థ్యాంక్స్ చెబుతూ, ఆనంద్ మహీంద్రా వెంటనే ఈ ట్వీట్‌కు రీట్వీట్ చేశారు. మహీంద్రా ఫ్యూచర్‌లో ఇంకా ఎంతో సాధిస్తుందని, ఇందులో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

గ్లోబల్ సేఫర్ ఛాయిస్ ఆవార్డ్ పొందిన తొలి ఇండియన్ కారు: మహీంద్రా ఎక్స్‌యూవీ300

కొన్ని ఆసక్తికర విషయాలు:

సేఫర్ ఛాయిస్ అవార్డను గ్లోబల్ ఎన్సీఏపీ (NCAP - న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రాం) 2018లో ప్రారంభించింది. తమ ఆధ్వర్యంలో భద్రతా పరీక్షలకొచ్చే కార్లలో అత్యున్నత భద్రతా ప్రమాణాలు మరియు క్రాష్ టెస్టుల్లో అత్యుత్తమ సామర్థ్యాలు ప్రదర్శించిన మోడళ్లకు ఈ అవార్డును ప్రధానం చేస్తారు.

గ్లోబల్ సేఫర్ ఛాయిస్ ఆవార్డ్ పొందిన తొలి ఇండియన్ కారు: మహీంద్రా ఎక్స్‌యూవీ300

యునైటెడ్ నేషన్స్ రెగ్యులేషన్స్ UN127 లేదా GTR9 పాదచారుల భద్రత గురించి పనిచేస్తాయి. రోడ్డు ప్రమాదంలో నడుచుకుంటే వెళ్లేవారికి ఎలాంటి ఆపద జరగకుండా, ఇందుకుగాను కొన్ని సేఫ్టీ ప్రమాణాలను ఆటోమొబైల్ ఇండస్ట్రీ కోసం పొందుపరిచారు. దీనికి సంభందించిన డాక్యుమెంట్స్ ఆన్‌లైన్‌‌లో అందుబాటులో ఉన్నాయి.

గ్లోబల్ సేఫర్ ఛాయిస్ ఆవార్డ్ పొందిన తొలి ఇండియన్ కారు: మహీంద్రా ఎక్స్‌యూవీ300

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సేఫర్ ఛాయిస్ అవార్డు సాధించిన మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థకు డ్రైవ్‌స్పార్క్ తెలుగు నుండి అభినందనలు!. ఎస్‌యూవీ కార్ల తయారీలో మహీంద్రా అగ్రగామి సంస్థగా నిలిచింది. అద్భుతమైన టెక్నాలజీ మరియు ఆవిష్కరణలతో మహీంద్రా అభివృద్ది చేసిన ఎక్స్‌యూవీ300 ఎస్‌యూవీ ప్రపంచంలోనే గ్లోబల్ సేఫర్ ఛాయిస్ అవార్డు పొందిన కారుగా నిలిచింది.

Most Read Articles

English summary
Mahindra XUV300 Wins Global NCAP’s Safer Choice Award: Becomes First Indian Manufacturer To Win. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X