ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు.. అయినా సురక్షితంగా బయటపడిన డ్రైవర్

వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు దాని ధర, మైలేజ్ వంటివి మాత్రమే కాకుండా అందులో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ కూడా గమనిస్తారు. ఎందుకంటే ప్రమాదాలు సంభవించినప్పుడు సురక్షితంగా బయటపడటానికి ఈ సేఫ్టీ ఫీచర్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. మహీంద్రా బ్రాండ్ యొక్క ఎక్స్‌యువి 500 కారు మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంది. ఈ కారణగాగే ఇటీవల ఒక భయంకరమైన కార్ ప్రమాదంలో కూడా డ్రైవర్ సురక్షితంగా బయట పడ్డాడు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు.. అయినా సురక్షితంగా బయటపడిన డ్రైవర్

ఎక్స్‌యువి 500 అనేది మహీంద్రా యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన కార్ మోడళ్లలో ఒకటి. కారు ప్రమాదంలో ప్రయాణికులను రక్షించినట్లు తెలిసింది. బీహార్‌లోని దర్భంగలో ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ ఫోటోలను గమనించినట్లయితే ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో మనకు అర్థమవుతుంది.

ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు.. అయినా సురక్షితంగా బయటపడిన డ్రైవర్

సాధారణంగా కారు యొక్క సేఫ్టీ ఫీచర్స్ అందులో ఉన్న ప్రయాణికులను రక్షిస్తుంది. ఈ కారు ఇంత భయంకరంగా దెబ్బతిన్నప్పటికీ ఇందులో ఉన్న వారు సురక్షితంగా ఉన్నారని అందరూ ఆశ్చర్యపోయారు.

MOST READ:దుర్భర స్థితిలో పడిఉన్న ఖరీదైన లగ్జరీ కార్స్.. ఎక్కడో తెలుసా ?

ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు.. అయినా సురక్షితంగా బయటపడిన డ్రైవర్

మహీంద్రా కంపెనీ తన ఎక్స్‌యువి 500 కారులో ప్రయాణికుల భద్రత కోసం వివిధ ఫీచర్లను ఏర్పాటు చేసింది. ఈ కారులో ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఈ కారులో ఉన్న ఈ ఫీచర్స్ ప్రమాదంలో వాహనదారులను కాపాడుతున్నాయి.

ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు.. అయినా సురక్షితంగా బయటపడిన డ్రైవర్

ఆసియా ఎన్‌సిఎపి నిర్వహించిన క్రాష్ టెస్ట్ లో ఈ కారుకు ఫోర్ స్టార్ రేటింగ్ లభించింది. కానీ నిజ జీవితంలో దీనిని ధృవీకరించడానికి, ఈ ప్రమాదంలో బయటపడిన వారే సాక్షులు. ఎందుకంటే ఇంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడగలిగారు కాబట్టి.

MOST READ:బెంగళూరులో అమలుకానున్న కొత్త పార్కింగ్ విధానం : పూర్తి వివరాలు

ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు.. అయినా సురక్షితంగా బయటపడిన డ్రైవర్

భారతదేశంలో ఎక్కువమంది వినియోగదారులు ఇష్టపడే మహీంద్రా కార్లలో ఎక్స్‌వి 500 కూడా ఒకటి. ఇది ఎస్‌యూవీ టైప్ కారు. మహీంద్రా ప్రస్తుతం ఈ కారును ఆధునిక యుగానికి తగినట్టుగా అప్‌డేట్ చేస్తోంది. ఈ నవీకరణ త్వరలో భారతదేశంలో అమ్మకానికి రానుంది.

ఇటువంటి పరిస్థితులలో భారతీయులను ఆకర్షించడానికి మహీంద్రా ఎక్స్‌యువి 500 తన సేఫ్టీ ఫీచర్స్ మరొక్కసారి నిరూపించింది. కొత్త తరానికి అప్‌గ్రేడ్ అవుతున్న ఎక్స్‌వి కారులో 2 వ స్థాయి ఆటోమేటిక్ డ్రైవింగ్ టెక్నాలజీ, డిజిటల్ కాక్‌పిట్, ప్రీమియం ఫీచర్లు వంటి అదనపు ఫీచర్లు ఉంటాయి.

ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు.. అయినా సురక్షితంగా బయటపడిన డ్రైవర్

భారతీయ రహదారులపై ప్రమాదాలు సర్వసాధారణంగా మారుతున్నాయి. రోజురోజుకి ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోంది. ఈ ప్రమాదాల నుంచి బయటపడటానికి సేఫ్టీ ఫీచర్స్ ఉన్న కార్లను ఉపయోగించడం తప్పనిసరి. సేఫ్టీ ఫీచర్స్ ఎన్ని ఉన్నప్పటికీ వాహనదారులు కూడా సరైన ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలి.

MOST READ:ఒక లీటర్ పెట్రోల్ ధర రూ. 160 ; ఇంతకీ ఈ పెట్రోల్ స్పెషాలిటీ ఏంటో తెలుసా ?

Most Read Articles

English summary
Mahindra XUV500 Saves Driver Life: Here Is Full Details. Read in Telugu.
Story first published: Thursday, December 3, 2020, 13:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X