Just In
- 19 min ago
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- 1 hr ago
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- 2 hrs ago
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
- 1 day ago
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
Don't Miss
- Lifestyle
జనన నియంత్రణ ఉన్నప్పటికీ గర్భం వచ్చే ప్రమాదం
- News
ఎస్ఈసీ, ఉద్యోగులకు గవర్నర్ షాక్- అపాయింట్మెంట్ల నిరాకరణ- సుప్రీం తీర్పు తర్వాతే
- Movies
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
- Finance
Gold prices today: రూ.49,000 స్థాయికి బంగారం ధరలు, వెండి స్వల్పంగా అప్
- Sports
మెల్బోర్న్ సెంచరీ చాలా స్పెషల్.. అందుకే సిడ్నీలో మైదానం వీడలేదు: అజింక్యా రహానే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ధరల పెరుగుదలను ప్రకటించిన మారుతి సుజుకి : ఎప్పటినుంచో తెలుసా?
దేశీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన వాహన తయారీదారు మారుతి సుజుకి, ఇటీవల తన బ్రాండ్ యొక్క కార్ల ధరలు పెరగనున్నట్లు ప్రకటించింది. మారుతి సుజుకి కార్ల ధరలు 2021 జనవరి నుండి పెరగనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇన్ ఫుట్ కాస్ట్ యొక్క ప్రభావం పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. కంపెనీ కారు యొక్క ఇన్ ఫుట్ కాస్ట్ గత సంవత్సరం పెరుగుదలను నమోదు చేసింది.

మారుతి కార్ల యొక్క ధరల పెరుగుదల ప్రతి మోడల్ కి భిన్నంగా ఉంటుంది. అయితే ఏ మోడల్ మీద ఎంత ధర పెరుగుతుందో అనే దానిని గురించి కంపెనీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కరోనా మహమ్మారి కారణంగా మారుతి కార్ల ఇన్ ఫుట్ కాస్ట్ చాలా వరకు ప్రభావితమైంది. ఈ కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

కంపెనీ యొక్క అదనపు ఖర్చులతో పాటు వినియోగదారులపై కూడా ఇది కొంత ప్రభావాన్ని చూపుతుంది. ఇక కంపెనీ కార్ల యొక్క ధరల పెరుగుదల 2021 నూతన సంవత్సరం నుంచి అమలులోకి రానుంది. ఇది వరకు మేము చెప్పినట్లుగా, ప్రతి మోడల్‌కు ధర భిన్నంగా ఉంటుంది.
MOST READ:టైటానికి షిప్‌ను తలపిస్తున్న ఫెర్రీ షిప్ : పూర్తి వివరాలు

ప్రస్తుతం మారుతి సుజుకి కంపెనీ ఆల్టో నుండి ఎక్స్‌ఎల్ 6 వంటి మోడళ్లను విక్రయిస్తోంది. వీటి ధర రూ. 2.95 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 11.52 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. కంపెనీ దేశీయ అమ్మకాలు నవంబర్‌లో 2.4 శాతం క్షీణించి 1,35,775 యూనిట్లకు తగ్గడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు ఏడాది 1,39,133 యూనిట్లు అమ్మినట్లు కంపెనీ నివేదికలు చెబుతున్నాయి.

మారుతి కంపెనీ కార్ల అమ్మకాలు గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు మెరుగ్గా ఉన్నప్పటికీ, ధరలను మాత్రం పెరుగనున్నట్లు కంపెనీ నిర్ణయించింది. అయితే ఇప్పుడు కంపెనీ కార్ల యొక్క అమ్మకాల ధరలు పెరిగితే వచ్చే సంవత్సరం వాటి అమ్మకాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కార్లపై పెరగనున్న ధరలు అమ్మకాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయనే విషయం తెలుసుకోవడానికి మనం కొంత కాలం వేచి చూడాలి.
MOST READ:మీకు తెలుసా.. ఈ ట్రాక్టర్‌కి డ్రైవర్ అవసరం లేదు.. ఇంకెలా పనిచేస్తుందో వీడియోలో చూడండి

ఎంట్రీ లెవల్ మరియు కాంపాక్ట్ మోడళ్ల అమ్మకాలలో సంస్థ యొక్క పట్టు నిజంగా చాలా అద్భుతమైనది. కానీ చిన్న కార్లను తీసుకోవానుకునే కస్టమర్లపై ఇది ఎక్కువ ప్రభావం అయ్యే అవకాశం ఉంటుంది. మారుతి సుజుకి కంపెనీ కాంపాక్ట్ మోడల్ స్విఫ్ట్ గత నెలలో దేశంలోనే అత్యధిక అమ్మకాలను సాధించిన మోడల్‌గా నిలిచింది. స్విఫ్ట్ తర్వాత కంపెనీ బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ను గత నెలలో 17,872 యూనిట్లను విక్రయించింది.

ప్రస్తుత పరిస్థితిలో కంపెనీ తన కస్టమర్లను ఆకర్షించడానికి మల్టీ-ఫైనాన్షియర్, ఆన్‌లైన్ కార్ ఫైనాన్సింగ్ ప్లాట్‌ఫామ్ 'స్మార్ట్ ఫైనాన్స్' వంటి వాటిని ప్రారంభించింది. సంస్థ మొదట్లో మొత్తం 30 నగరాల్లో తన ప్రీమియం కార్ రిటైల్ ప్లాట్‌ఫాం నెక్సా ద్వారా ఈ ఫీచర్‌ను పరిచయం చేస్తోంది.
MOST READ:ఛార్జింగ్ పాయింట్లుగా మారిన టెలిఫోన్ బూత్‌లు ; ఎక్కడో తెలుసా !

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
మారుతి సుజుకి రాబోయే సంవత్సరంలో అనేక కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనుంది. వీటిలో ఇప్పటికే చాలా వరకు అనేక సందర్భాలలో స్పాట్ టెస్ట్ కూడా నిర్వహించింది. 2021 లో ధరల పెరుగుదల జరిగితే కంపెనీ అమ్మకాలపై ఏవిధమైన ప్రభావం ఉంటుందో తెలుసుకోవడానికి వేచి చూడాలి.