బిఎస్ 6 మారుతి సుజుకి ఇకో : ధర, ఇతర వివరాలు

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన వాహన తయారీదారులలో ఒకటైన మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లో బిఎస్-6 ఇకోని విడుదల చేసింది. ఇండియన్ మార్కెట్లో విడుదలచేసిన ఈ బిఎస్-6 ఇకో గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..!

బిఎస్ 6 మారుతి సుజుకి ఇకో : ధర, ఇతర వివరాలు

మారుతి సుజుకి తన బిఎస్ 6 ఈకోను భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త మారుతి ఈకో బిఎస్ 6 ప్రారంభ ధర రూ. 4.64 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) తో అందించబడుతుంది. మారుతి సుజుకి బ్రాండ్ యొక్క ఉత్పత్తులలో ఎక్కువుగా అమ్ముడవుతున్న వాహనాలలో మారుతి ఇకో ఒకటి.

బిఎస్ 6 మారుతి సుజుకి ఇకో : ధర, ఇతర వివరాలు

భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ -10 కార్లలో క్రమం తప్పకుండా స్థానం సంపాదిస్తుంది. బహుళ ప్రయోజనాలకు ఉపయోగపడుతున్న ఈ వ్యాన్ ఐదు లేదా ఏడు సీట్ల వెర్షన్‌లో అందించబడుతుంది మరియు మొత్తం 12 వేరియంట్‌లలో వస్తుంది. మారుతి సుజుకి ఇకో ఇన్ కార్గో మరియు అంబులెన్స్ ఎంపికలను కూడా అందిస్తుంది.

బిఎస్ 6 మారుతి సుజుకి ఇకో : ధర, ఇతర వివరాలు

కొత్త బిఎస్-6 మారుతి ఇకో యొక్క అన్ని రకాలు కొలతలు మరియు ఇంటీరియర్ క్యాబిన్ స్థలం పరంగా ఎటువంటి మార్పులు ఉండవు. ఈ వ్యాన్ సిగ్నేచర్ స్లైడింగ్ తలుపులతో వస్తుంది.

బిఎస్ 6 మారుతి సుజుకి ఇకో : ధర, ఇతర వివరాలు

మారుతి సుజుకి ఇకో అనేక ఫీచర్స్ కలిగి ఉంటుంది. కొత్త బిఎస్ 6 కంప్లైంట్ మారుతి ఈకో ప్రస్తుతం ఈ విభాగంలో కూడా సురక్షితమైన వ్యాన్ అని చెప్పబడింది. ఇది డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఎబిడి విత్ ఎబిఎస్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, సీట్-బెల్ట్ రిమైండర్, హై-స్పీడ్ వార్ణింగ్ వంటి భద్రతా లక్షణాలను కలిగి ఉంటుంది.

బిఎస్ 6 మారుతి సుజుకి ఇకో : ధర, ఇతర వివరాలు

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ మారుతి ఇకో తన అద్భుతమైన మైలేజ్, బెస్ట్-ఇన్-సెగ్మెంట్ సౌకర్యం కలిగి ఉంటుంది. ఇందులో ఉత్తమమైన భద్రతను కలిగి ఉంటుంది. ఇది ప్రయాణికుల కోసం మాత్రమే కాకుండా బహుళ ప్రయోజనాలకు ఉపయోగించే విధంగా తయారు చేయబడింది. ఇది వ్యాపార వినియోగానికి కూడా ఉపయోగపడుతుంది.

బిఎస్ 6 మారుతి సుజుకి ఇకో : ధర, ఇతర వివరాలు

కొత్త మారుతి ఈకో సిఎన్‌జి బిఎస్ 6 కంప్లైంట్ 1.2 లీటర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 73 bhp మరియు 101 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఐదు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కి జతచేయబడి ఉంటుంది. ఇకో సిఎన్‌జి మోడల్ బ్రాండ్ యొక్క ‘మిషన్ గ్రీన్ మిలియన్' చొరవలో భాగంగా ఉంది. మారుతి ఇకో మార్కెట్లో మొదట జనవరి 2010 లో ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇకో 7 లక్షల యూనిట్లకు దగ్గరగా అమ్మకాలు జరిగాయి.

బిఎస్ 6 మారుతి సుజుకి ఇకో : ధర, ఇతర వివరాలు

డ్రైవ్‌‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి ఇకో ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో వాన్ విభాగంలో అగ్రగామిగా ఉంది. ఈ సెగ్మెంట్ అమ్మకాల్లో దాదాపు 87% పైగా అమ్మకాలను సాధించింది. ఇకో అనేది భారతీయ మార్కెట్లో మారుతి బ్రాండ్ నుండి ప్రసిద్ది చెందిన ఆఫర్ మరియు క్రమం తప్పకుండా అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో ఉంది. ఇది ఇప్పటిదాకా కూడా మార్కెట్లో మంచి అమ్మకాలను కలిగి ఉంది అనుటలో సందేహం లేదు.

More from DriveSpark

Article Published On: Tuesday, March 17, 2020, 14:16 [IST]
English summary
Maruti Suzuki Eeco CNG BS6 Launched In India: Prices Start At Rs 4.64 Lakh. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+