మారుతి సుజుకి : అమ్మకాలలో కొత్త మైలురాయిని చేరుకున్న ఆల్టో

భారతదేశంలో అతిపెద్ద కార్ల సంస్థగా పేరుగాంచిన మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలను సాగిస్తోంది. ఇటీవల కాలంలో మారుతూ సుజుకి కంపెనీ అమ్మకాలను ప్రకటించింది. ఇందులో సంస్థ యొక్క ప్రముఖ ఆల్టో కార్ల అమ్మకాలలో కొత్త మైలురాయిని సాధించింది.

మారుతి సుజుకి : అమ్మకాలలో కొత్త మైలురాయిని చేరుకున్న ఆల్టో

మారుతి సుజుకి యొక్క ఆల్టో 4 మిలియన్ లేదా 40 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. భారతదేశంలో 70% కస్టమర్లకు ఆల్టో మొదటి కారు అవుతుందని కంపెనీ పేర్కొంది. ఆల్టో గత 16 సంవత్సరాలుగా కంపెనీలో అత్యధికంగా అమ్ముడైన కారుగా మిగిలిపోయింది. ఆల్టో కార్ ఒక దశాబ్దానికి పైగా భారత మార్కెట్‌ను శాసిస్తోంది.

మారుతి సుజుకి : అమ్మకాలలో కొత్త మైలురాయిని చేరుకున్న ఆల్టో

మారుతి సుజుకి ఆల్టోను 2000 లో దేశీయ మార్కెట్లో తొలిసారిగా లాంచ్ చేశారు. లాంచ్ అయిన కేవలం 8 సంవత్సరాలలో, ఈ కారు 10 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి రికార్డ్ సృష్టించింది.

MOST READ:తండ్రికి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ గిఫ్ట్ గా ఇచ్చిన కొడుకు [వీడియో]

మారుతి సుజుకి : అమ్మకాలలో కొత్త మైలురాయిని చేరుకున్న ఆల్టో

ఈ కారు 2012 లో ఇరవై లక్షల యూనిట్లను దాటి 2016 లో 30 లక్షల యూనిట్ అమ్మకాల మార్కును దాటింది. మారుతి ఆల్టో బిఎస్ 6 ఇంజిన్‌తో విడుదల చేసిన మొదటి ఎంట్రీ లెవల్ కారు. మారుతి సుజుకి కంపెనీ ఆల్టోను బిఎస్ 6 ఇంజిన్‌తో 2019 లో లాంచ్ చేశారు. బిఎస్ 6 ఇంజిన్ ప్రారంభించినప్పటి నుండి ఈ కారు అమ్మకాలు మరింత పెరిగాయి.

మారుతి సుజుకి : అమ్మకాలలో కొత్త మైలురాయిని చేరుకున్న ఆల్టో

2019 లో మారుతి సుజుకి ఆల్టో 1.50 లక్షల యూనిట్లను విక్రయించింది. ఆల్టో కారు కొనాలనుకునే లక్షలాది మంది భారతీయుల కలను నెరవేరుస్తోందని కంపెనీ తెలిపింది.

MOST READ:గ్రేట్ ఇండిపెండెన్స్ డే రైడ్ : 5 మంది ఫ్రెండ్స్, 5 దేశాలు, 5000 కి.మీ ప్రయాణం, ఎందుకో తెలుసా ?

మారుతి సుజుకి : అమ్మకాలలో కొత్త మైలురాయిని చేరుకున్న ఆల్టో

కార్లు కొనాలనే లక్షలాది మంది భారతీయుల కలలను ఆల్టో నెరవేరుస్తోందని కంపెనీ అభిప్రాయపడింది. మారుతి ఆల్టో ప్రస్తుతం రూ .3 లక్షల ప్రారంభ ధర వద్ద లభిస్తుంది మరియు దీని గరిష్ట ధర రూ .4.37 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఆల్టోను పెట్రోల్ మరియు సిఎన్జి ఇంజన్ ఎంపికలతో స్టాండర్డ్, ఎల్ఎక్స్ఐ మరియు విఎక్స్ఐలలో విక్రయిస్తారు.

మారుతి సుజుకి : అమ్మకాలలో కొత్త మైలురాయిని చేరుకున్న ఆల్టో

పెట్రోల్ మోడల్ లీటరుకు 22.05 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది, సిఎన్జి 31.56 కిమీ మైలేజీని అందిస్తుంది. ఆల్టో 799 సిసి పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 47 బిహెచ్‌పి మరియు 69 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఆల్టోలో 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉన్నాయి. అయితే ఇందులో ఉన్న CNG ఇంజిన్ 40 బిహెచ్‌పి శక్తిని మరియు 60 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:కరోనా లాక్‌డౌన్ లో వసూలు చేసిన జరిమానా ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు

మారుతి సుజుకి : అమ్మకాలలో కొత్త మైలురాయిని చేరుకున్న ఆల్టో

మారుతి ఆల్టోలో భద్రత లక్షణాలను గమనించినట్లయితే ఇందులో ఎయిర్‌బ్యాగ్, ఎబిఎస్ విత్ ఇబిడి, రివర్స్ పార్కింగ్ సెన్సార్, హై స్పీడ్ అలర్ట్ మరియు ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్ ఉన్నాయి. చాలా మంది వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే కారు ఈ మారుతి సుజుకి ఆల్టో.

Most Read Articles

English summary
Maruti Suzuki alto creates new milestone in sales. Read in Telugu.
Story first published: Friday, August 14, 2020, 9:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X