ఇకపై ఇండియాలో మారుతి సుజుకి ఆల్టో కె 10 అమ్మకాలు లేనట్టే!
భారతదేశంలో మాత్రమే కారు దక్షిణ ఆసియాలోనే కార్ల తయారీ సంస్థలలో అతి పెద్ద సంస్థ మారుతి సుజుకి. ఈ సంస్థ ఇప్పుడు తన బ్రాండ్ అయిన మారుతి ఆల్టో కె 10 కారుని అధికారికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మారుతి ఆల్టో కె 10 కారుని నిలిపివేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. కానీ ఇప్పుడు ఇది 796 సిసి సిలిండర్ అవతార్ మాత్రమే అందుబాటులో ఉంటుంది.

మారుతి ఆల్టో కె 10 ని నిలిపివేస్తున్నట్లు ప్రకటన అయితే చేసింది కానీ వెబ్‌సైట్ నుండి ఈ వాహన జాబితాను తొలగించలేదు. వీరి తయారీ ప్రస్తుతానికి సానుకూలంగా నిలిపివేసింది. డీలర్‌షిప్‌లో ఉన్న స్టాక్ ని పూర్తి చేయాలనే ఆలోచనతో అమ్మకాలను చేపడుతోంది.

మారుతి ఆల్టో కె 10 కారు 998 సిసి బిఎస్-4 కంప్లైంట్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో లభించింది. ఇది 67 బిహెచ్‌పి పవర్ మరియు 90 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్మిషన్ ఎంపికలలో మాత్రం ఐదు-స్పీడ్ మాన్యువల్ మరియు ఐదు-స్పీడ్ ఆటోమేటిక్ వంటివి ఉన్నాయి.

మారుతి యొక్క మొదటి వెర్షన్ ఆల్టో కె 10 2010 లో రెండవ వెర్షన్ 2014లో, మరియు ఫెసిలిఫ్ట్ మోడల్ అయితే 2019లో విడుదల చేసింది. అవుట్‌గోయింగ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో చిన్న డిజైన్ మార్పులు చేయబడ్డాయి. అంతే కాకుండా ఎబిఎస్ విత్ ఇబిడి, డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్, బ్యాక్ పార్కింగ్ సెన్సార్లు, సీట్ బెల్ట్ రిమైండర్ మరియు హై-స్పీడ్ అలెర్ట్ సిస్టం వంటివి ఉన్నాయి.

ఇప్పుడు నిలిపివేయబడిన ఆల్టో కె 10 ధర ప్రస్తుతం రూ .3.72 లక్షల నుండి 4.51 లక్షల రూపాయల (ఎక్స్-షోరూమ్, ఇండియా) మధ్య ఉంది. ఇప్పుడు ఉన్న స్టాక్ 2020 మార్చ్ 31 వరకు మాత్రమే లభిస్తుంది.

మారుతి ఎస్-ప్రెస్సో మినీ ఎస్‌యూవీ పై ఉన్న భారీ ఆసక్తి కారణంగా మార్కెట్లో ఆల్టో కె 10 ని నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించుకుంది. ఎస్-ప్రెస్సో దేశీయ మార్కెట్లో బాగా అమ్ముడవడం వల్ల ఇది మార్కెట్లో గొప్ప విజయం సాధిస్తుంది.

శక్తివంతమైన ఎస్-ప్రెస్సో మోడల్‌లో బిఎస్ 6 కంప్లైంట్ 998 సిసి పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 68 బిహెచ్‌పి పవర్ మరియు 90 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ ఐదు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కి జతచేయబడి ఉంటుంది. ప్రస్తుత తరం మారుతి ఎస్-ప్రెస్సో రూ .3.69 లక్షల నుండి రూ. 4.91 లక్షల మధ్య లభిస్తుంది (ఎక్స్-షోరూమ్, ఇండియా).

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
మారుతి సుజుకి ఆల్టో కె 10 సంస్థ యొక్క బెస్ట్ సెల్లెర్లలో ఒకటిగా ఉంది. ఇది వినియోగదారునికి అనుకూలమైన డ్రైవింగ్ ని అందిస్తుంది. కానీ ఆల్టో కె 10 ని నిలిపివేయడం మారుతీ బ్రాండ్ కి కొంత కొరతగానే ఉంటుంది.


Click it and Unblock the Notifications








