సరికొత్త ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తున్న మారుతి-టొయోటా జాయింట్ వెంచర్

భారత మార్కెట్లో తమ వ్యాపార వ్యూహంలో భాగంగా భారతదేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరియు జపాన్‌కు చెందిన టొయోటా కిర్లోస్కర్ కంపెనీలు జాయింట్ వెంచర్‌గా ఏర్పడిన సంగతి తెలిసినదే. ఈ ఇరు కంపెనీల నుండి ఇప్పటికే బాలెనో - గ్లాంజా మరియు విటారా బ్రెజ్జా - అర్బన్ క్రూయిజర్ మోడళ్లు మార్కెట్లోకి వచ్చాయి.

సరికొత్త ఎస్‌యూవీని అభివృద్ధి చేసిన మారుతి-టొయోటా జాయింట్ వెంచర్

అయితే, ఈసారి ఇలా క్లోనింగ్ చేయకుండా ఇరు కంపెనీలు కలిసి ఓ సరికొత్త ఎస్‌యూవీని అభివృద్ధి చేయాలని నిర్ణయించాయి. భారత్‌లో శరవేగంగా విస్తరిస్తున్న ఎస్‌యూవీ విభాగంలో మారుతి-టొయోటా కంపెనీలు ఓ సరికొత్త మోడల్‌ను విడుదల చేయనున్నాయి. మరో ఏడాది కాలానికి ఈ కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

సరికొత్త ఎస్‌యూవీని అభివృద్ధి చేసిన మారుతి-టొయోటా జాయింట్ వెంచర్

స్టాక్ ఎక్సేంజ్‌లో మారుతి సుజుకి చేసిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో, 2022 నుండి తమ అలయన్స్ భాగస్వామి టొయోటా ప్లాంట్‌లో విటారా బ్రెజ్జా ఉత్పత్తికి చేసిన ప్రణాళికల్లో పునర్విమర్శ చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. కర్ణాటకలోని బిడాడిలోని టొయోటా ప్లాంట్‌లో విటారా బ్రెజ్జా ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఓ కొత్త మోడల్‌ను తయారు చేయనున్నారు.

సరికొత్త ఎస్‌యూవీని అభివృద్ధి చేసిన మారుతి-టొయోటా జాయింట్ వెంచర్

మారుతి సుజుకి మరియు టొయోటా కిర్లోస్కర్ రెండు కంపెనీలు సంయుక్తంగా తయారు చేయనున్న ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఉత్పత్తి 2022 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ వంటి మోడళ్లకు పోటీగా నిలిచే ఆస్కారం ఉంది.

సరికొత్త ఎస్‌యూవీని అభివృద్ధి చేసిన మారుతి-టొయోటా జాయింట్ వెంచర్

మారుతి సుజుకి మరియు టొయోటా కిర్లోస్కర్ కంపెనీల నుండి వస్తున్న ఈ కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ, ఇరు కంపెనీలు కలిసి ఉమ్మడిగా అభివృద్ధి చేస్తున్న మొదటి ఉత్పత్తి కానుంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఈ కారును టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్లాంట్-2 ఉత్పత్తి చేయనున్నారు. ఈ ఉత్పత్తిని మారుతి సుజుకి నిర్వహించనుంది.

సరికొత్త ఎస్‌యూవీని అభివృద్ధి చేసిన మారుతి-టొయోటా జాయింట్ వెంచర్

కర్ణాటకలోని టొయోటా బిడాది ఉత్పత్తి కేంద్రంలో రెండు ప్లాంట్‌లు ఉన్నాయి. మొదటి ప్లాంట్‌లో టొయోటా ఇన్నోవా మరియు ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలను ఉత్పత్తి చేస్తుండగా, రెండవ ప్లాంట్ టొయోటా యారిస్ మరియు క్యామ్రీ హైబ్రిడ్ వాహనాలను ఉత్పత్తి చేస్తున్నారు.

సరికొత్త ఎస్‌యూవీని అభివృద్ధి చేసిన మారుతి-టొయోటా జాయింట్ వెంచర్

కాగా, ఇరు సంస్థలు కలిసి అభివృద్ధి చేయనున్న ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ పొడవులో 4.3 మీటర్లుగా ఉండి, టొయోటా యొక్క డిఎన్‌జిఎ ప్లాట్‌ఫాంపై ఆధారపడి ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని మారుతి-టొయోటాలు ఈ కారును తయారు చేయనున్నాయి.

సరికొత్త ఎస్‌యూవీని అభివృద్ధి చేసిన మారుతి-టొయోటా జాయింట్ వెంచర్

మారుతి సుజుకి మరియు టొయోటా కిర్లోస్కర్ సంస్థలు తయారు చేస్తున్న వాహనాల్లో చాలా వరకూ ఒకేరకమైన సాంకేతికతను మరియు పరికరాలను కలిగి ఉన్నప్పటికీ, డిజైన్ లాంగ్వేజ్ పరంగా ఇవి విభిన్నమైన స్టైలింగ్‌ను కలిగి ఉంటాయి. ఈ జాయింట్ వెంచర్ నుండి రానున్న కొత్త ఎస్‌యూవీలో మారుతి సుజుకి ఆఫర్ చేస్తున్న 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

సరికొత్త ఎస్‌యూవీని అభివృద్ధి చేసిన మారుతి-టొయోటా జాయింట్ వెంచర్

అంతేకాకుండా, ఈ కొత్త ఎస్‌యూవీలో టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం ఈ ఎస్‌యూవీలో డీజిల్ ఇంజన్ వినియోగం గురించి ఎలాంటి సమాచారం లేదు. రాబోయే కొత్త ఎస్‌యూవీ మారుతి సుజుకి మరియు టొయోటా బ్రాండ్ల యొక్క ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న భారీ అంతరాన్ని పూరించడానికి సహాయపడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రెండు కంపెనీలకు మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో ఎలాంటి ఉత్పత్తులు లేవు.

Article Published On: Friday, December 4, 2020, 16:34 [IST]
English summary
Maruti Suzuki And Toyota To Jointly Produce New SUV By 2022 Details, Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+