మారుతి సుజుకి బాలెనోలో కొత్త ఇంజన్ రానుందా?

దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, తమ ఎక్స్‌క్లూజివ్ నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 'బాలెనో'లో కంపెనీ ఓ కొత్త ఇంజన్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి తాజాగా ఇంటర్నెట్‌లో కొన్ని టెస్టింగ్ ఫొటోలు విడుదలయ్యాయి.

మారుతి సుజుకి బాలెనోలో కొత్త ఇంజన్ రానుందా?

గాడివాడి విడుదల చేసిన స్పై చిత్రాల ప్రకారం, క్యామోఫ్లేజ్ లేని ఓ డార్క్ గ్రే కలర్ మారుతి సుజుకి బాలెనో కారును మహారాష్ట్ర వీధులపై టెస్టింగ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. రెడ్ కలర్ నెంబర్ ప్లేట్‌తో టేస్టింగ్ చేస్తున్న ఈ వాహనాన్ని చూస్తుంటే, బహుశా ఇది 1.0 లీటర్ టర్బో పెట్రోల్ బిఎస్6 ఇంజన్‌‌తో కూడిన ‘ఆర్ఎస్' వేరియంట్ కావచ్చని తెలుస్తోంది.

మారుతి సుజుకి బాలెనోలో కొత్త ఇంజన్ రానుందా?

మారుతి సుజుకి బాలెనో కారులో ఇదివరకు ఆర్ఎస్ వేరియంట్ పేరిట శక్తివంతమైన 1.0 లీటర్ బూస్టర్‌జెట్ ఇంజన్‌ను ఆఫర్ చేసేవారు. ఈ ఇంజన్ 102 బిహెచ్‌పి శక్తిని మరియు 150 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేసేది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌కు జతచేయబడి ఉంటుంది.

MOST READ:చివరకు పట్టుబడ్డ దేశంలోనే అతిపెద్ద దొంగల ముఠా

మారుతి సుజుకి బాలెనోలో కొత్త ఇంజన్ రానుందా?

మారుతి తమ బిఎస్6 లైనప్‌లో భాగంగా ఇంజన్‌కు బిఎస్6 అప్‌గ్రేడ్ ఇవ్వబడలేదు, పైగా ఈ సంవత్సరం ప్రారంభంలో తమ ఇంజన్ లైనప్ నుండి ఈ టర్బో వేరియంట్‌ను తొలగించి వేసింది. అయితే, ప్రస్తుతం మార్కెట్లో టర్బో పెట్రోల్ ఇంజన్లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా, కంపెనీ తమ పాత ఇంజన్‌నే కొత్తగా బిఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా అప్‌డేట్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మారుతి సుజుకి బాలెనోలో కొత్త ఇంజన్ రానుందా?

కొత్త ఉద్గార నిబంధనల తరువాత చాలా మంది వాహన తయారీదారులు డీజిల్ ఇంజన్లను నిలిపివేసి, కేవలం పెట్రోల్ ఇంజన్లను మాత్రమే ఆఫర్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. డీజిల్ ఇంజన్లకు ప్రత్యామ్నాయంగా కంపెనీలు టర్బో పెట్రోల్ ఇంజన్లను ఆఫర్ చేయటం ప్రారంభించారు. ఈ ఇంజన్లు పెర్ఫార్మెన్స్ మరియు మైలేజ్ కలయికతో మంచి పనితీరును అందిస్తాయి.

MOST READ:ఇండియన్ ఎయిర్ పోర్స్ లో చేరనున్న రాఫెల్ ఫైటర్ జెట్స్ ; ఎందుకో తెలుసా

మారుతి సుజుకి బాలెనోలో కొత్త ఇంజన్ రానుందా?

కాగా, తాజాగా కెమెరాకి చిక్కిన ఈ మారుతి సుజుకి బాలెనో టెస్టింగ్ వాహనం, ఓ హైబ్రిడ్ వేరియంట్ అయి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఇది హైబ్రిడ్ వేరియంట్ అయి ఉంటే, ఇందులో ఇది 48 వోల్ట్ స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్ ఉండే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం మారుతి సుజుకి అందిస్తున్న తేలికపాటి హైబ్రిడ్ సిస్టమ్ కన్నా మెరుగైన మైలేజీని ఆఫర్ చేయవచ్చని అంచనా.

మారుతి సుజుకి బాలెనోలో కొత్త ఇంజన్ రానుందా?

ఈ హాగానాలకు మరింత ఊతమిచ్చేలా, బాష్ సంస్థ బెంగళూరులో బాలెనో స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాన్ని (ఎస్‌హెచ్ఈవి) పరీక్షిస్తోంది. ఎస్‌హెచ్ఈవి వ్యవస్థలో అధిక సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, ఇది పూర్తి ఎలక్ట్రిక్, ఇంజన్‌ బూస్ట్, కోస్టింగ్ మరియు బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్ వంటి బహుళ మోడ్‌లను కలిగి ఉండేందుకు వీలు కల్పిస్తుంది.

MOST READ:పోలీసులు స్వాధీనం చేసుకున్న 4 కోట్ల విలువైన లంబోర్ఘిని సూపర్ కార్, కారణం ఏంటో తెలుసా ?

మారుతి సుజుకి బాలెనోలో కొత్త ఇంజన్ రానుందా?

ప్రస్తుతం, మారుతి బాలెనో హ్యాచ్‌బ్యాక్ రెండు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లతో అందుబాటులో ఉంది. ఇవి రెండూ కూడా వేర్వేరు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరియు విభిన్న శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటాయి. ఇందులో మొదటగా, 1.2-లీటర్ వివిటి ఇంజన్ 82 బిహెచ్‌పి శక్తిని మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

మారుతి సుజుకి బాలెనోలో కొత్త ఇంజన్ రానుందా?

ఇకపోతే, టాప్-ఎండ్ వేరియంట్లలో ఆఫర్ చేసే 1.2-లీటర్ డ్యూయల్ వివిటి పెట్రోల్ ఇంజన్ బ్రాండ్ యొక్క మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 89 బిహెచ్‌పి శక్తిని మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. అంటే రెగ్యులర్ వివిటి ఇంజన్ కంటే ఇది అదనంగా 7 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. వీటికి అదనంగా, హ్యాచ్‌బ్యాక్‌లోని తేలికపాటి-హైబ్రిడ్ వ్యవస్థ కారణంగా ఇది మంచి మైలేజీని కూడా అందిస్తుంది.

MOST READ:240 ఇంచ్ చక్రాలతో కొత్త రికార్డ్ సృష్టించిన కార్ [వీడియో]

మారుతి సుజుకి బాలెనోలో కొత్త ఇంజన్ రానుందా?

ప్రస్తుతం మార్కెట్లో మారుతి సుజుకి బాలెనో ధరలు రూ.5.63 లక్షల నుంచి రూ.8.96 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి. ఇది ఈ సెగ్మెంట్లో హ్యుందాయ్ ఎలైట్ ఐ20, టాటా ఆల్ట్రోజ్, ఫోక్స్‌వ్యాగన్ పోలో, హోండా జాజ్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

మారుతి సుజుకి బాలెనోలో కొత్త ఇంజన్ రానుందా?

మారుతి సుజుకి బాలెనో కొత్త ఇంజన్ ఆప్షన్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

బాలెనోలో కొత్త పెట్రోల్ ఇంజన్‌ను అందించాలని మారుతి సుజుకి నిర్ణయిస్తే, ఈ విభాగంలో ఇది మూడు వేర్వేరు పెట్రోల్ ఇంజన్లతో అందుబాటులో ఉండే ఏకైక హ్యాచ్‌బ్యాక్‌గా మారుతుంది. ఒకవేళ ఆఫర్ చేయబోయే ఇంజన్ హైబ్రిడ్ ఇంజన్ కనుక అయితే, ఈ సెగ్మెంట్లో బెస్ట్ మైలేజీనిచ్చే హైబ్రిడ్ కారుగా బాలెనో నిలిచే అవకాశం ఉంది.

Source: Gaadiwaadi

Most Read Articles

English summary
The Maruti Suzuki Baleno is placed in the premium hatchback segment in the India market. It is currently being sold through the brand's Nexa premium dealership chain with a couple of engine and transmission options. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X