బిఎస్-6 కార్ల అమ్మకాలలో 5 లక్షల మైలురాయిని దాటిన మారుతి

ఇండో-జపనీస్ తయారీదారు అయిన మారుతి తమ బిఎస్ 6 మోడళ్ల అమ్మకాలలో ఇప్పుడు 5 లక్షల మైలురాయిని దాటేసింది. ఏప్రిల్ 1 గడువుకు ముందే అధికలాభాలా బాటలో మారుతి పరుగులు తీస్తుంది.

బిఎస్-6 కార్ల అమ్మకాలలో 5 లక్షల మైలురాయిని దాటిన మారుతి

మారుతి తన బిఎస్ 6 మోడల్ కార్లను వేగంగా విస్తరించి వాటికి చాల వరకు కొత్త ఉద్గార నియామాలకు అనుకూలంగా తయారు చేస్తుంది. ప్రస్తుతం కంపెనీ బిఎస్ 6 కార్ల అమ్మకాలలో మొత్తం 75 శాతం అమ్మకాలను చేరుకోవడానికి అతి చేరువలో ఉంది.

బిఎస్-6 కార్ల అమ్మకాలలో 5 లక్షల మైలురాయిని దాటిన మారుతి

దేశంలో అతి పెద్ద కార్ల తయారీ సంస్థగా పేరు పొందిన మారుతి గత సంవత్సరం ఏప్రిల్ లో 1.2 లీటర్ డ్యూయల్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన బిఎస్ 6 వెర్షన్ బాలెనోని విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ 1.2 లీటర్ కె సిరీస్ పెట్రోల్ ఇంజిన్ని కూడా అప్‌గ్రేడ్ చేసింది.

బిఎస్-6 కార్ల అమ్మకాలలో 5 లక్షల మైలురాయిని దాటిన మారుతి

మారుతి తమ వాహనాలైన ఆల్టో 800, స్విఫ్ట్, డిజైర్ మరియు వాగన్ఆర్ మోడళ్లకు కూడా కొంత నవీనీకరణలు చేపట్టింది. స్విఫ్ట్, డిజైర్ మరియు వాగన్ఆర్ శ్రేణి కార్లు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటాయి. ఈ వాహనాలన్నీ బిఎస్ 6 మోడల్స్.

బిఎస్-6 కార్ల అమ్మకాలలో 5 లక్షల మైలురాయిని దాటిన మారుతి

కంపెనీ నుంచి 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్‌కు అప్‌గ్రేడ్ చేయబడిన ఆరవ కారుగా ఎర్టిగా నిలిచింది. ఇది 102 బిహెచ్‌పి శక్తిని మరియు 138 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ సంస్థ యొక్క ఎక్స్ఎల్ 6 మోడళ్లలో కూడా కనిపిస్తుంది.

బిఎస్-6 కార్ల అమ్మకాలలో 5 లక్షల మైలురాయిని దాటిన మారుతి

మారుతి వారి సూపర్ హిట్ మినీ ఎస్‌యూవీ ఎస్-ప్రెస్సోను బిఎస్ 6 కంప్లైంట్ ఇంజిన్‌తో విడుదల చేసింది. ఈ చిన్న వాహనం సంస్థ యొక్క అత్యధికంగా అమ్ముడైన మోడళ్లలో ఒకటి, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎగుమతి చేయబడుతోంది.

బిఎస్-6 కార్ల అమ్మకాలలో 5 లక్షల మైలురాయిని దాటిన మారుతి

బిఎస్ 6 కంప్లైంట్ ఇంజన్లను కలిగి ఉన్న ఇతర మారుతి మోడల్స్ ఈకో మరియు సెలెరియో కార్లు. ఇవి మొత్తం 10 బిఎస్ 6 కంప్లైంట్ వాహనాలు.

బిఎస్-6 కార్ల అమ్మకాలలో 5 లక్షల మైలురాయిని దాటిన మారుతి

మారుతి సుజుకి ఇంతటి గొప్ప ఘనత సాధించడానికి మొత్తం తొమ్మిది నెలల కాలం పట్టింది. ఎంఎస్ఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మిస్టర్ కెనిచి ఆయుకావా మాట్లాడుతూ, సంస్థ దాదాపుగా అన్ని వాహనాలకు బిఎస్ 6 కంప్లైంట్ ఇంజిన్లను పరిచయం చేసిందని, ఇదంతా వినియోగదారుల అనుకూలతను దృష్టిలో ఉంచుకుని ప్రారంభించడం జరిగింది అన్నారు.

బిఎస్-6 కార్ల అమ్మకాలలో 5 లక్షల మైలురాయిని దాటిన మారుతి

మారుతి యొక్క స్టేబుల్ నుండి తదుపరి వాహనం త్వరలో విడుదల కానుంది. ఇది కూడా బిఎస్ 6 కంప్లైంట్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ వాహనం చిన్న కాస్మెటిక్ మరియు విజువల్ డిఫరెన్స్ తో వస్తుందని భావిస్తున్నారు.

బిఎస్-6 కార్ల అమ్మకాలలో 5 లక్షల మైలురాయిని దాటిన మారుతి

మారుతి ఇప్పుడు ఎస్-క్రాస్ మోడళ్లను కూడా బిఎస్ 6 కంప్లైంట్ ఇంజిన్‌కి అప్‌గ్రేడ్ చేయబడింది. విటారా బ్రెజ్జా, ఎస్-క్రాస్, ఎర్టిగా మరియు ఎక్స్‌ఎల్ 6 మోడళ్లలో కనిపించే 1.5-లీటర్ ఎస్‌హెచ్‌విఎస్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుందని అంచనాలు ఉన్నాయి.

బిఎస్-6 కార్ల అమ్మకాలలో 5 లక్షల మైలురాయిని దాటిన మారుతి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం:

మారుతి బిఎస్ 6 వెర్షన్ వాహనాల యొక్క సమిష్టి అమ్మకాలు దాదాపుగా 5 లక్షలకంటే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మారుతి కంపెనీ యొక్క బిఎస్ 6 కార్లు మార్కెట్లో బాగా అమ్ముడవుతున్నాయి. ఇవి ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా ఇతరదేశాల కూడా ఎగుమతి అవుతున్నాయి. మారుతి యొక్క అన్ని కార్లు వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. అందుకే వీటికి మార్కెట్లో కూడా చాలా ఎక్కువ డిమాండ్ ఉంది.

Most Read Articles

English summary
Maruti Sales Milestone: Company Registers Over 5 Lakh Units In Collective Sales Of BS6 Units. Read in Telugu.
Story first published: Saturday, January 25, 2020, 12:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X