బిఎస్6 సెలెరియో మోడల్ లాంచ్ చేసిన మారుతి సుజుకి

మారుతి సుజుకి మార్కెట్లోకి సరికొత్త బిఎస్6 వెర్షన్ సెలెరియో కారును లాంచ్ చేసింది. మారుతి సెలెరియో బిఎస్6 మోడల్ ధర ఇప్పుడు రూ. 4.41 లక్షల నుండి రూ. 5.67 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది. బిఎస్4 వెర్షన్ మారుతి సెలెరియోతో పోలిస్తే బిఎస్6 వెర్షన్ సెలెరియో ధర సుమారుగా రూ. 15,000 నుండి రూ. 24,000 వరకూ పెరిగింది.

 బిఎస్6 సెలెరియో మోడల్ లాంచ్ చేసిన మారుతి సుజుకి

మారుతి సెలెరియో బిఎస్6 మోడల్‌లో ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్‌లో ఎలాంటి కాస్మొటిక్ మార్పులు జరగలేదు. మునుపటి మోడల్‌లో ఉన్నటువంటి మెష్ గ్రిల్, న్యూ హెడ్‌ల్యాంప్స్ మరియు షార్ప్ లుకింగ్ బంపర్.

 బిఎస్6 సెలెరియో మోడల్ లాంచ్ చేసిన మారుతి సుజుకి

మారుతి సెలెరియో హ్యాచ్‌బ్యాక్‌లో బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, బంపర్లు, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ గల సైడ్ మిర్రర్లు, అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, 60:40 స్ల్పిట్ సీట్లు, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, కీలెస్ ఎంట్రీ, ఆటో-డౌన్ పవర్ విండోస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

 బిఎస్6 సెలెరియో మోడల్ లాంచ్ చేసిన మారుతి సుజుకి

సేఫ్టీ పరంగా మారుతి సుజుకి సెలెరియో బిఎస్6 కారులో ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్, ఇబీడీ, సీట్-బెల్ట్ రిమైండర్, చైల్డ్-ప్రూఫ్ రియర్ డోర్ లాక్స్, హౌ-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్స్, రియర్ విండో వైపర్ మరియు వాషర్ మరియు ఇంజన్ ఇమ్మొబిలైజర్ వంటివి ఉన్నాయి.

 బిఎస్6 సెలెరియో మోడల్ లాంచ్ చేసిన మారుతి సుజుకి

మారుతి సెలెరియోలో 35-లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది, ఏఆర్ఏఐ సర్టిఫికేట్ ప్రకారం మారుతి సెలెరియో పెట్రోల్ వెర్షన్ లీటర్‌కు 23.10కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

 బిఎస్6 సెలెరియో మోడల్ లాంచ్ చేసిన మారుతి సుజుకి

సాంకేతికంగా మారుతి సెలెరియోలో 998సీసీ సామర్థ్యం గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇంజన్ పాతదే అయినప్పటికీ, కొత్తగా అమల్లోకి వచ్చిన బిఎస్6 ఉద్గార ప్రమాణాలను పాటిస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇంజన్ గరిష్టంగా 68బిహెచ్‍‌పి పవర్ మరియు 90ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

 బిఎస్6 సెలెరియో మోడల్ లాంచ్ చేసిన మారుతి సుజుకి

బిఎస్6 వెర్షన్ మారుతి సెలెరియో ఆరు విభిన్న రంగుల్లో లభిస్తుంది. అవి, బ్లేజింగ్ రెడ్, సిల్కీ సిల్వర్, గ్లిజనింగ్ గ్రే, అర్కిటిక్ వైట్, టార్క్ బ్లూ మరియు ట్యాంగో ఆరేంజ్.

మారుతి సెలెరియో విపణిలో ఉన్నహ్యుందాయ్ శాంట్రో, మారుతి వ్యాగన్ఆర్, డాట్సన్ గో మరియు టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

 బిఎస్6 సెలెరియో మోడల్ లాంచ్ చేసిన మారుతి సుజుకి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి సుజుకి రూ. 15,000 నుండి రూ. 24,000 మధ్య ధరల పెంపుతో మారుతి సెలెరియో బిఎస్6 వెర్షన్‌ను పరిచయం చేసింది. పవర్, మైలేజ్ పరంగా బిఎస్4తో పోల్చుకుంటే పెద్దగా మార్పులేమీ జరగలేదు. బిఎస్6 వెర్షన్ మార్కెట్లో నూతనత్వాన్ని పరిచయం చేసింది.

More from DriveSpark

Article Published On: Tuesday, January 21, 2020, 18:42 [IST]
English summary
Maruti Suzuki Celerio BS6 Models Launched In India Starting At Rs 4.41 Lakh. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+