మారుతి సుజుకి సెలెరియో 'పాప్రికా ఆరెంజ్' కలర్ నిలిపివేత! ఎందుకంటే?

భారతదేశపు నెంబర్ వన్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెలెరియోలో కంపెనీ 'పాప్రికా ఆరెంజ్' కలర్ స్కీమ్‌ను నిలిపివేసింది. మారుతి సుజుకి సెలెరియో ఎక్స్ పాప్రికా ఆరెంజ్ కలర్ వేరియంట్ ఈ నెల నుండి ఎంచుకోవడానికి కస్టమర్లకు అందుబాటులో ఉండదు.

మారుతి సుజుకి సెలెరియో 'పాప్రికా ఆరెంజ్' కలర్ నిలిపివేత! ఎందుకంటే?

ఈ మార్పుతో మారుతి సుజుకి సెలెరియో ఎక్స్ ప్రస్తుతం నాలుగు కలర్ ఆప్షన్లలో మాత్రమే అందుబాటులో ఉండనుంది. రష్‌లేన్ నుండి వచ్చిన నివేదికల ప్రకారం, ఈ ఏడాది చివర్లో కొత్త తరం సెలెరియో మోడల్‌ను విడుదల చేసేందుకు మారుతి సుజుకి ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో, ఈ పాత కలర్ ఆప్షన్‌ను నిలిపివేసినట్లు తెలుస్తోంది.

మారుతి సుజుకి సెలెరియో 'పాప్రికా ఆరెంజ్' కలర్ నిలిపివేత! ఎందుకంటే?

మారుతి సుజుకి ‘వైఎన్‌సి' అనే కోడ్‌నేమ్‌తో కొత్త తరం సెలెరియో కారను భారత మార్కెట్లో విడుదల చేయటానికి ముందే రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చిత్రాలు కూడా ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:ఒక నెలరోజుల తరువాత పట్టుబడ్డ లంబోర్ఘిని సూపర్ కార్ : ఎలాగో తెలుసా !

మారుతి సుజుకి సెలెరియో 'పాప్రికా ఆరెంజ్' కలర్ నిలిపివేత! ఎందుకంటే?

ప్రస్తుత మార్కెట్లో లభిస్తున్న సెలెరియో ఎక్స్ టార్క్ బ్లూ, గ్లిస్టరింగ్ గ్రే, కెఫిన్ బ్రౌన్ మరియు ఆర్కిటిక్ వైట్ అనే నాలుగు రంగులలో లభిస్తుంది: ఎక్స్ వెర్షన్ సెలెరియో స్టాండర్డ్ సెలెరియోకి రగ్గడ్ వెర్షన్‌గా ఉంటుంది. యాంత్రికంగా, ఈ రెండు మోడళ్లలో ఒకేరకమైన ఇంజన్ ఉన్నప్పటికీ, సెలెరియో ఎక్స్‌లో మాత్రం అనేక కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ ఉంటాయి.

మారుతి సుజుకి సెలెరియో 'పాప్రికా ఆరెంజ్' కలర్ నిలిపివేత! ఎందుకంటే?

సెలెరియో ఎక్స్ హ్యాచ్‌బ్యాక్ చుట్టూ బ్లాక్ కలర్ బాడీ క్లాడింగ్ ఉంటుంది, ఇది కారుకు మరింత అగ్రెసివ్ అండ్ స్పోర్టి డిజైన్‌ను అందిస్తుంది. అలాగే, ముందు భాగంలో పూర్తిగా నలుపు రంగులో ఉండే బ్లాక్-అవుట్ గ్రిల్ మరియు ఫాగ్-లాంప్ హౌసింగ్‌లు ఈ కారుకు విలక్షణమైన X-ఆకారపు డిజైన్‌ను ఇస్తాయి.

MOST READ: హెల్మెట్ ధరించలేదని నుదుటిపై బైక్ కీ తో పొడిచిన పోలీస్, తర్వాత ఏం జరిగిందంటే

మారుతి సుజుకి సెలెరియో 'పాప్రికా ఆరెంజ్' కలర్ నిలిపివేత! ఎందుకంటే?

ఇంటీరియర్స్‌ను గమనిస్తే, ఎక్స్‌టీరియర్ స్పోర్టి థీమ్‌కు తగినట్లుగా బ్లాక్-అవుట్ ఇంటీరియర్స్ థీమ్ మరియు బ్లాక్ సీట్ అప్‌హోలెస్ట్రీలను ఇందులో గమనించవచ్చు. క్యాబిన్ స్పోర్టీనెస్‌ను మరియు అనుభూతిని పెంచడానికి ఎక్స్‌టీరియర్ రంగుతో సరిపోయే అంశాలతో ఇంటీరియర్లను కస్టమైజ్ చేయబడి ఉంటుంది.

మారుతి సుజుకి సెలెరియో 'పాప్రికా ఆరెంజ్' కలర్ నిలిపివేత! ఎందుకంటే?

ఈ కారులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉండదు, దీనికి బదులుగా, ఇందులో బ్లూటూత్‌తో పనిచేసే ఆడియో సిస్టమ్ లభిస్తుంది. ఇంకా ఇందులో ఎత్తు-సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్, అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మౌంటెడ్ ఆడియో కంట్రల్స్‌తో కూడిన మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:మరోసారి కరోనా లాక్‌డౌన్ ఉల్లంఘించి రోడ్ షో చేసిన బిజినెస్ మ్యాన్, తర్వాత ఏం జరిగిందో తెలుసా?

మారుతి సుజుకి సెలెరియో 'పాప్రికా ఆరెంజ్' కలర్ నిలిపివేత! ఎందుకంటే?

సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో ముందు వైపు డ్రైవర్ మరియు కోప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్, రివర్స్ పార్కింగ్ సెన్సార్, హెడ్‌లైట్ లెవల్ అడ్జస్ట్‌మెంట్ డయల్ స్విచ్, స్పీడ్ అలర్ట్ రిమైండర్ మరియు చైల్డ్‌ప్రూఫ్ రియర్ డోర్ లాక్స్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

మారుతి సుజుకి సెలెరియో 'పాప్రికా ఆరెంజ్' కలర్ నిలిపివేత! ఎందుకంటే?

ఇక ఇంజన్ విషయానికి వస్తే, మారుతి సుజుకి సెలెరియో ఎక్స్ వేరియంట్‌లో ఉపయోగించిన కె10బి పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 68 బిహెచ్‌పి శక్తిని మరియు 3500 ఆర్‌పిఎమ్ వద్ద 90 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌లతో లభిస్తుంది.

MOST READ:కొత్త కారును దొంగిలించడానికి హ్యుందాయ్ మాజీ ఉద్యోగి స్కెచ్ ; ఇలాంటి దొంగతనం ఇప్పటివరకు చూసి ఉండరు

మారుతి సుజుకి సెలెరియో 'పాప్రికా ఆరెంజ్' కలర్ నిలిపివేత! ఎందుకంటే?

తాజా రిపోర్ట్స్ ప్రకారం, మారుతి సుజుకి నుంచి రానున్న కొత్త తరం సెలెరియో ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి ఎప్పుడైనా మార్కెట్లో విడుదల కావచ్చని తెలుస్తోంది. ఇది మునుపటి తరం మోడల్ కంటే అనేక డిజైన్ మార్పులు, కొత్త ఫీచర్లను కలిగి ఉండనున్నట్లు సమాచారం.

ఇందులో ప్రధానంగా, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే మరియు సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు కొత్త ఫ్రంట్ ఫాసియా అలాగే అప్‌డేట్ చేసిన ఇంటీరియర్ ఫీచర్లు ఉండనున్నాయి. ఈ కొత్త మోడల్ ప్రస్తుత మోడల్ మాదిరిగానే పెట్రోల్ మరియు సిఎన్‌జి ఇంజన్ ఆప్షన్లతో లభించనుంది.

మారుతి సుజుకి సెలెరియో 'పాప్రికా ఆరెంజ్' కలర్ నిలిపివేత! ఎందుకంటే?

మారుతి సెలెరియో పాప్రికా ఆరెంజ్ కలర్ నిలిపివేతపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కలర్ ఆప్షన్స్ నుంచి పాప్రికా ఆరెంజ్‌ను తొలగించబడటానికి అసలు కారణం ఇంకా తెలియరాలేదు. బహుశా మార్కెట్లోకి కొత్త తరం మోడల్ రావటం వల్ల కావచ్చు. కొత్త తరం మోడల్ మార్కెట్లోకి రాకముందే కంపెనీ నెమ్మదిగా పాత తరం మోడల్‌ను తొలగించాల్సి ఉంటుంది కాబట్టి, ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Most Read Articles

English summary
The Maruti Suzuki Celerio X in 'Paprika Orange' paint scheme has been discontinued. It will no longer be available from the colour palette to choose from this month. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X