మారుతి సుజుకి ఈకో సరికొత్త రికార్డ్; పదేళ్లలోనే సాధించగలిగింది!

మారుతి సుజుకి ఇండియా అందిస్తున్న పాపులర్ ఎమ్‌పివి ఈకో భారత మార్కెట్లో 7 లక్షల విక్రయాల మార్కును చేరుకున్నట్లు కంపెనీ పేర్కొంది. సరిగ్గా పదేళ్ల క్రితం మారుతి సుజుకి ఈకో ఎమ్‌పివిని తొలిసారిగా భారత మార్కెట్లో ప్రవేశపెట్టారు. దేశంలో ఈ మోడల్ ఉత్పత్తిని ప్రారంభించినప్పటి నుంచి 10 ఏళ్ల కాలంలో ఈ సరికొత్త అమ్మకాల మైలురాయిని సాధించినట్లు కంపెనీ తెలిపింది.

మారుతి సుజుకి ఈకో సరికొత్త రికార్డ్; పదేళ్లలోనే సాధించగలిగింది!

దేశంలోని ప్రైవేట్ మరియు వాణిజ్య వాహన విభాగంలో మారుతి సుజుకి ఈకో అందుబాటులో ఉంది. ఈకో మొట్టమొదటిసారిగా 2010 లో ప్రారంభించబడింది మరియు దేశంలో ప్రారంభించిన రెండు సంవత్సరాలలోనే 1 లక్ష యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. 2014వ ఆర్థిక సంవత్సరం చివరి మరో లక్ష యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.

మారుతి సుజుకి ఈకో సరికొత్త రికార్డ్; పదేళ్లలోనే సాధించగలిగింది!

మారుతి సుజుకి ఈకో ప్యాసింజర్ వాహన విభాగం కన్నా, వాణిజ్య ఉపయోగంలో ఎక్కువగా పాపులర్ అయింది. సరుకు రవాణా కోసం ఇది అనువైన వాహనంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మోడల్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి మారుతి సుజుకి 2015లో ఇందులో వాణిజ్య వినియోగం కోసం ఈకో కార్గో అనే వేరియంట్‌ను కూడా విడుదల చేసింది.

MOST READ:ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్ మోహన్ రెడ్డికి ప్రశంసల వెల్లువ.. ఎందుకో తెలుసా ?

మారుతి సుజుకి ఈకో సరికొత్త రికార్డ్; పదేళ్లలోనే సాధించగలిగింది!

ఈ వేరియంట్ విడుదలతో మారుతి సుజుకి ఈకో ఎమ్‌పివి అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. 2018 చివరి నాటికి, ఈకో బ్రాండ్ మొత్తం 5 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని సాధించింది. గడచిన రెండేళ్లలో మారుతి సుజుకి ఈకో ఏటా లక్ష యూనిట్ల చొప్పున అమ్మకాలను నమోదు చేయటంతో మొత్తం 7 లక్షల మైలురాయిని చేరుకోగలిగింది.

మారుతి సుజుకి ఈకో సరికొత్త రికార్డ్; పదేళ్లలోనే సాధించగలిగింది!

మారుతి సుజుకి దేశంలో తాజా ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఈకోలో బిఎస్6 అప్‌డేట్‌ను ప్రవేశపెట్టింది. మార్కెట్లో కొత్త మారుతి ఈకో బిఎస్6 ప్రారంభ ధర రూ.4.64 లక్షలు ఎక్స్-షోరూమ, ఢిల్లీగా ఉంది.

MOST READ:ఇప్పుడే చూడండి.. ఎంజి గ్లోస్టర్ యొక్క కొత్త టీజర్ వీడియో

మారుతి సుజుకి ఈకో సరికొత్త రికార్డ్; పదేళ్లలోనే సాధించగలిగింది!

ఇది ప్రైవేట్ కస్టమర్లకు ఐదు లేదా ఏడు సీట్ల కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. ఇందులో మొత్తం 12 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వాణిజ్య ఉపయోగం కోసం మారుతి సుజుకి ఈకో వహనాన్ని కార్గో మరియు అంబులెన్స్ రూపంలో కూడా విక్రయిస్తోంది.

మారుతి సుజుకి ఈకో సరికొత్త రికార్డ్; పదేళ్లలోనే సాధించగలిగింది!

భారతదేశంలో అనుసరించే తాజా క్రాష్ నిబంధనలను సైతం ఈకో పాటిస్తుంది. ఇందులో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు, ఈబిడితో కూడిన ఏబిఎస్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, సీట్-బెల్ట్ రిమైండర్, హై-స్పీడ్ అలెర్ట్ మరియు మరెన్నో కొత్త భద్రతా నిబంధనలకు అనుగుణంగా అవసరమైన అన్ని భద్రతా పరికరాలను ఇది కలిగి ఉంటుంది.

MOST READ:162 అడుగుల జీప్ ఎస్‌యూవీలతో తయారైన గణేష్ మహారాజ్ [వీడియో]

మారుతి సుజుకి ఈకో సరికొత్త రికార్డ్; పదేళ్లలోనే సాధించగలిగింది!

మారుతి సుజుకి ఈకో ఎమ్‌పివిలో 1.2-లీటర్, ఫోర్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 72 బిహెచ్‌పి శక్తిని మరియు 98 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌ను కూడా కంపెనీ అందిస్తుంది. సిఎన్‌జి మోడ్‌లోని ఇంజన్ 61 బిహెచ్‌పి శక్తిని మరియు 85 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. సిఎన్‌జి మోడ్‌లో ఈకో కిలోకు 20.88 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

మారుతి సుజుకి ఈకో సరికొత్త రికార్డ్; పదేళ్లలోనే సాధించగలిగింది!

మారుతి సుజుకి ఈకో ఎమ్‌పివిపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారత మార్కెట్లో మారుతి సుజుకి నుండి అత్యధికంగా అమ్ముడైన వాహనాల్లో ఈకో కూడా ఒకటి. ఈ ఎమ్‌పివి ప్రైవేట్ మరియు వాణిజ్య వాహన కొనుగోలుదారులకు సరిపోయేలా బహుముఖ డిజైన్‌ను కలిగి ఉంటుంది. తక్కువ రన్నింగ్ మరియు మెయింటినెన్స్ కాస్ట్, మెరుగైన ఇంధన సామర్థ్యం వంటి ఫీచర్లతో ఇది బెస్ట్ పీపుల్స్/లగేజ్ క్యారియర్‌గా ఉంటుంది.

MOST READ:హెలికాఫ్టర్లు చేసే ఈ పనులు విమానాలు ఎందుకు చేయలేవు.. మీకు తెలుసా ?

Most Read Articles

English summary
Maruti Suzuki has announced that it has sold over 7 lakh Eeco units in the India market. The MPV has achieved a new sales milestone for the brand in 10 years of its production. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X