ఉద్యోగుల కోసం గృహ నిర్మాణాలను చేపడుతున్న మారుతి సుజుకి; వివరాలు

భారతదేశంలో ప్రముఖ కార్ల తయారీదారుగా ప్రసిద్ధి చెందిన కొన్ని కంపెనీలలో మారుతి సుజుకి కూడా ఒకటి. మారుతి సుజుకి తమ ఉద్యోగుల సంక్షేమ పథకం కింద సంస్థ తన ఉద్యోగులకు గృహాలను నిర్మించింది. సంస్థ తన ఉద్యోగులకు సరసమైన, ఆధునిక గృహాలను అందించింది.

ఉద్యోగుల కోసం గృహ నిర్మాణాలను చేపడుతున్న మారుతి సుజుకి

మారుతి సుజుకి పర్యావరణానికి హాని కలిగించకుండా ఈ ఇళ్లను డిజైన్ చేసింది. ఇది ఈ కొత్త ఇంటి యొక్క ప్రత్యేక లక్షణం. మారుతి సుజుకి ఈ గృహాలను హర్యానాలోని ధారుహెరాలోని తన ఉద్యోగులకు అప్పగించింది. ఈ అప్పగించే కార్యక్రమం (డిసెంబర్ 23) బుధవారం జరిగింది.

ఉద్యోగుల కోసం గృహ నిర్మాణాలను చేపడుతున్న మారుతి సుజుకి

మారుతి సుజుకి తన ఉద్యోగుల కోసం 360 కి పైగా గృహాలను నిర్మిస్తోంది. ఇందులో భాగంగా మొదటి దశలో కొన్ని ఇళ్లను కంపెనీ యొక్క ఉద్యోగులకు అప్పగించారు. వీలైనంత త్వరగా మిగిలిన గృహాలను అప్పగించే ప్రక్రియ పురోగతిలో ఉంది.

MOST READ:నిజంగా ఈ బైకర్స్ అదృష్టవంతులే సుమీ.. ఎందుకో వీడియో చూడండి

ఉద్యోగుల కోసం గృహ నిర్మాణాలను చేపడుతున్న మారుతి సుజుకి

మారుతి సుజుకి మొట్టమొదట 1989 లో తన ఉద్యోగుల కోసం ఒక హోసింగ్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఆ సమయంలో సకర్పూర్ ప్రాంతంలో ఉద్యోగుల కోసం ఇళ్ళు నిర్మించారు. అప్పుడు 1994 లో, గురుగ్రామ్ లోని పాండ్సి ప్రాంతంలో రెండవసారి గృహాలను నిర్మించబడింది.

ఉద్యోగుల కోసం గృహ నిర్మాణాలను చేపడుతున్న మారుతి సుజుకి

హర్యానాలోని ధారుహెరాలో మూడోసారి మారుతి సుజుకి ఎన్‌క్లేవ్ పేరుతో కొత్త ఇళ్ళు నిర్మిస్తున్నారు. ఈ కంపెనీ నిర్మించిన కొత్త గృహాలు తమ ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా నిర్మించబడ్డాయి. విశేషమేమిటంటే, ఈ ఇళ్లను మారుతి సుజుకి కంపెనీ నిర్వహిస్తుంది.

MOST READ:ఫ్యాన్సీ నెంబర్ కోసం 32 లక్షలు వేలం పాడాడు.. కానీ చివరికి ఏమైందంటే ?

ఉద్యోగుల కోసం గృహ నిర్మాణాలను చేపడుతున్న మారుతి సుజుకి

ఈ గృహాలు హర్యానా రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం మరియు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మించబడ్డాయి. ప్రభుత్వ గృహనిర్మాణ పథకాలైన ప్రధాన్ మంత్రి ఆవాస్, దీన్ దయాల్ ఆవాస్ పథకాలు ఈ ఇళ్లకు వర్తిస్తాయి. ఇది మారుతి సుజుకి ఉద్యోగులకు సబ్సిడీ పొందటానికి వీలు కల్పిస్తుంది.

ఉద్యోగుల కోసం గృహ నిర్మాణాలను చేపడుతున్న మారుతి సుజుకి

ప్రస్తుతం ఉన్న సిబ్బందికి ఇస్తున్న ఇళ్లతో మారుతి సుజుకి ఏమి చేస్తుందో తెలియదు. ఈ గృహాలు చూడటానికి చాలా లగ్జరీగా కనిపిస్తాయి. ఈ ఇళ్ళు పార్క్, ఎల్ఈడి స్ట్రీట్ లైటింగ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, డ్రింకింగ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వంటి అన్ని వసతులు ఇందులో కల్పించబడ్డాయి.

MOST READ:ఈ రూల్స్ సాధరణ వాహనాలకు మాత్రమే కాదు పోలీస్ వాహనాలకు కూడా వర్తిస్తాయి.. ఆ రూల్స్ ఏవో మీరూ చూడండి

ఉద్యోగుల కోసం గృహ నిర్మాణాలను చేపడుతున్న మారుతి సుజుకి

ఏది ఏమైనా కంపెనీ తమ ఉద్యోగుల కోసం గృహాలను నిమించడం చాలా అరుదు. కంపెనీలు ఈ విధంగా నిర్మించడం వల్ల ఉద్యోగులకు చాలా అనుకూలంగా ఉంటుంది. దీని ప్రభుత్వాలు కూడా వీలైనంతవరకు సహకరించాలి. అప్పుడే ఇవన్నీ పూర్తిగా సాధ్యమవుతాయి.

Most Read Articles

English summary
Maruti Suzuki Hands Over Eco Friendly Houses To Employees. Read in Telugu.
Story first published: Thursday, December 24, 2020, 13:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X