మారుతి సుజుకి వింటర్ కేర్ క్యాంపైన్ ప్రారంభం; వివరాలు

మారుతి సుజుకి జెన్యూన్ పార్ట్స్ అండ్ యాక్సెసరీస్ దేశవ్యాప్తంగా ఉన్న మారుతి సుజుకి డీలర్లు మరియు డిస్ట్రిబ్యూటర్ల ద్వారా వింటర్ కేర్ క్యాంపైన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ వింటర్ కేర్ క్యాంపెయిన్ ద్వారా కస్టమర్లు తమ వాహనాలను శీతాకాలం కోసం సిద్ధంగా ఉంచుకోవ్చచు.

మారుతి సుజుకి వింటర్ కేర్ క్యాంపైన్ ప్రారంభం; వివరాలు

శీతాకాలంలో ఎక్కువగా ఉపయోగించే భాగాలు మరియు యాక్ససరీల విషయంలో సరైన మెయింటినెన్స్ ఎంతో అవసరం. ఈ క్యాంపైన్ ప్రధానంగా శీతాకాలంలో వాహనాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను హైలైట్ చేస్తుంది.

మారుతి సుజుకి వింటర్ కేర్ క్యాంపైన్ ప్రారంభం; వివరాలు

మారుతి సుజుకి వింటర్ కేర్ సర్వీస్ క్యాంపైన్‌కు వచ్చే వాహనాలను కంపెనీ తనిఖీ చేసి, ఏవైనా భాగాలను మార్చాల్సి వస్తే కంపెనీ తగిన సూచనలు చేస్తుంది. సాధారణంగా శీతాకాలంలో వాహనాలకు ఫాగ్ ల్యాంప్స్ ఉండటం మంచిది. ఇవి పొగమంచు సమయంలో రోడ్డుపై విజిబిలిటీని పెంచడానికి సహకరిస్తాయి.

MOST READ:ఎలక్ట్రిక్ వాహనాల వాడకంపై సంచలన నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం.. అదేంటో తెలుసా ?

మారుతి సుజుకి వింటర్ కేర్ క్యాంపైన్ ప్రారంభం; వివరాలు

అంతేకాకుండా, ఈ శీతాకాలం సమయంలో రాత్రివేళల్లో మరియు తెల్లవారుజాముల్లో పొగమంచు కారణంగా దృశ్యమానత (విజిబిలిటీ) తక్కువగా ఉంటుంది కాబట్టి హెడ్‌ల్యాంప్స్, వైపర్స్ చక్కగా పనిచేస్తున్నాయో లేదో చూసుకోవటం చాలా అవసరం.

మారుతి సుజుకి వింటర్ కేర్ క్యాంపైన్ ప్రారంభం; వివరాలు

మారుతి సుజుకి జెన్యూన్ పార్ట్స్ అండ్ యాక్సెసరీస్ ఈ వింటర్ కేర్ సర్వీస్ క్యాంప్‌లో భాగంగా, కొన్ని రకాల యాక్ససరీలు మరియు భాగాలపై తగ్గింపులను కూడా అందిస్తోంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో క్యాబిన్‌లో ఎల్లప్పుడూ స్వచ్ఛమైన గాలిని అందించేందుకు కంపెనీ కార్ అయోనైజర్ + ఎయిర్ ప్యూరియర్, క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్ పిఎమ్ 2.5, ఎన్ 95 మాస్క్ / జెర్మ్ బస్టర్, ఎసి క్రిమిసంహారకం (డిస్ఇన్ఫెక్టెంట్), బాడీ కవర్ వంటి అనేక రకాల యాక్ససరీలను అందిస్తోంది.

MOST READ:కొత్త హోండా హార్నెట్ 2.0 రెప్సోల్ ఎడిషన్ వీడియో.. మీరు చూసారా ?

మారుతి సుజుకి వింటర్ కేర్ క్యాంపైన్ ప్రారంభం; వివరాలు

మారుతి సుజుకి జెన్యూన్ పార్ట్స్ అండ్ యాక్సెసరీస్ కంపెనీ నెట్‌వర్క్ ద్వారా 2,733 డీలర్ వర్క్‌షాప్‌లు మరియు 758 డిస్ట్రిబ్యూటర్ టచ్‌పాయింట్ల ద్వారా ఈ యాక్ససరీలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుకండా, కస్టమర్లు డీలర్ల వద్ద అందుబాటులో ఉన్న హెల్త్ అండ్ హైజీన్ కేటగిరీ కింద కోవిడ్-19 నివారణ యాక్ససరీలను కూడా ఎంచుకోవచ్చు.

మారుతి సుజుకి వింటర్ కేర్ క్యాంపైన్ ప్రారంభం; వివరాలు

మారుతి సుజుకి బ్రాండ్‌కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ తమ నెక్సా డీలర్‌షిప్ బ్రాండ్ కస్టమర్ల కోసం ఆన్‌లైన్ కార్ ఫైనాన్సింగ్ ప్లాట్‌ఫామ్ అయిన 'స్మార్ట్ ఫైనాన్స్'ను ప్రారంభించినట్లు ప్రకటించింది. కంపెనీ ఈ సేవలను ముందుగా దేశంలోని 30 ప్రధాన నగరాల్లో తమ ప్రీమియం కార్ రిటైల్ ప్లాట్‌ఫామ్ నెక్సా ద్వారా అందుబాటులోకి తెచ్చింది.

MOST READ:డ్రైవర్‌రహిత వాహనాల టెస్ట్ కోసం తయారవుతున్న కొత్త కృత్రిమ నగరం.. ఎక్కడో తెలుసా ?

మారుతి సుజుకి వింటర్ కేర్ క్యాంపైన్ ప్రారంభం; వివరాలు

ఈ ఫైనాన్స్ సదుపాయానికి సంబంధించి మారుతి సుజుకి ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం, ఈ ఆన్‌లైన్ స్మార్ట్ ఫైనాన్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా, కస్టమర్లు షోరూమ్‌లను సందర్శించాల్సిన అసరం లేకుండానే రుణం తీసుకోవటానికి సంబంధించిన పూర్తి ప్రక్రియను ఆన్‌లైన్ ద్వారానే చేయవచ్చు. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Maruti Suzuki Genuine Parts and Accessories commences Winter Care Campaign. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X