Just In
- 7 min ago
3 కి.మీ ట్రక్కుని రివర్స్ గేర్‌లో నడిపిన డ్రైవర్.. ఎందుకనుకుంటున్నారా, అయితే ఇది చూడండి
- 45 min ago
దేశంలోనే అతిపెద్ద మల్టీ-బ్రాండ్ కార్ సర్వీస్ సెంటర్‌ను ఓపెన్ చేసిన బాష్
- 1 hr ago
టీవీఎస్ ఎక్స్‌ఎల్ 100 విన్నర్ ఎడిషన్ లాంచ్ : ధర & వివరాలు
- 15 hrs ago
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
Don't Miss
- News
గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తా .. టచ్ చేసి చూడు .. కొడాలి నానికి దేవినేని ఉమ సవాల్
- Sports
మ్యాచ్‌కే హైలైట్! స్టార్క్ షార్ట్ పిచ్ బంతికి.. గిల్ ఎలా సమాధానం ఇచ్చాడో చూడండి వీడియో
- Movies
Master box office: 6వ రోజు కూడా పవర్ఫుల్ కలెక్షన్స్.. విజయ్ మరో బిగ్గెస్ట్ రికార్డ్
- Lifestyle
ప్రతి రాశిచక్రం వారి చింతలను ఎలా నిర్వహించాలో తెలుసా? భాదల నుండి ఇలా భయటపడాలి
- Finance
మారుతీ సుజుకీ కార్ల ధరల షాక్, కార్లపై రూ.34,000 వరకు పెంపు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నవంబర్‌లో పెరిగిన మారుతి కార్ల ఉత్పత్తి; చిన్న కార్లదే పైచేయి
భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (ఎమ్ఎస్ఐఎల్) గడచిన నవంబర్ నెలలో ప్రోత్సాహకర ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకుంది. దేశంలో కరోనా మహమ్మారి వలన ఏర్పడిన ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, కంపెనీ నవంబర్ 2020లో మొత్తం 1,50,221 యూనిట్ల వాహనాలను తయారు చేసి, 5.91 శాతం వృద్ధిని నమోదు చేసింది.

గడచిన సంవత్సరం ఇదే సమయంలో (నవంబర్ 2019లో) మొత్తం 1,41,834 యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసిందని మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్‌ఐఎల్) రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. కంపెనీ అమ్మకాలకు అనుగుణంగానే ఉత్పత్తి సామర్థ్యం కూడా వృద్ధి చెందుతోంది.

గత నవంబర్ 2020 నెలలో, మారుతి సుజుకి మొత్తం 1,46,577 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను తయారు చేయగా, నవంబర్ 2019 నెలలో 1,39,084 ప్యాసింజర్ వాహనాలను తయారు చేసి 5 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇదే సమయంలో ఆల్టో, ఎస్-ప్రెస్సో వంటి చిన్న కార్ల ఉత్పత్తి 24,052 యూనిట్ల నుండి 24,336 యూనిట్లకు పెరిగింది.
MOST READ:నమ్మండి ఇది నిజంగా హీరో స్ప్లెండర్ బైక్, కావాలంటే వీడియో చూడండి

అలాగే, వ్యాగన్ఆర్, సెలెరియో, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్ వంటి కాంపాక్ట్ కార్ల ఉత్పత్తి గత నవంబర్ 2020లో 85,118 యూనిట్లుగా ఉండగా, నవంబర్ 2019లో ఇది 78,133 యూనిట్లు నమోదైంది. అప్పటితో పోల్చుకుంటే, కంపెనీ ఈ విభాగంలో 8.93 శాతం ఉత్పత్తి వృద్ధిని సాధించింది.

ఇకపోతే, యుటిలిటీ వాహన విభాగంలో కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం పైన పేర్కొన్న రెండు విభాగాల కన్నా తక్కువగా నమోదైంది. ఈ విభాగంలో మారుతి సుజుకి జిప్సీ, ఎర్టిగా, ఎస్-క్రాస్, విటారా బ్రెజ్జా మరియు ఎక్స్‌ఎల్6 వంటి మోడళ్లను విక్రయిస్తోంది. ఇందులో జిప్సీ ఎస్‌యూవీని అంతర్జాతీయ మార్కెట్ల కోసం భారత్‌లోనే అసెంబ్లింగ్ చేస్తున్నారు.
MOST READ:వావ్.. ఇది నిజమేనా? మైండ్‌తో కంట్రోల్ అయ్యో హోండా మోటార్‌సైకిల్!

యుటిలిటీ వాహన విభాగంలో మారుతి సుజుకి గడచిన నవంబర్ 2020 నెలలో మొత్తం 24,719 యూనిట్లను ఉత్పత్తి చేయగా, అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (నవంబర్ 2019లో) కంపెనీ వీటిని 27,187 యూనిట్లు ఉత్పత్తి చేసింది. అప్పటితో పోల్చుకుంటే మారుతి సుజుకి ఈ విభాగంలో 9.07 శాతం క్షీణతను నమోదు చేసింది.

మారుతి సుజుకి ప్యాసింజర్ వాహనాలనే కాకుండా తేలికపాటి వాణిజ్య వాహనాలను కూడా తయారు చేసి, భారత మార్కెట్లో విక్రయిస్తోంది. ఈ విభాగంలో కంపెనీ అందిస్తున్న సూపర్ క్యారీ ఎల్‌సివిని కంపెనీ గడచిన నెలలో 3,644 యూనిట్లను ఉత్పత్తి చేయగా, అంతకు ముందు సంవత్సరం నవంబర్ నెలలో 2,750 యూనిట్లను ఉత్పత్తి చేసినట్లు పేర్కొంది.
MOST READ:త్వరలో రోడ్డెక్కనున్న అలీబాబా డ్రైవ్‌లెస్ రోబోటాక్సిస్, ఇవే.. మీరు చూసారా

దేశంలో కోవిడ్-19 లాక్‌డౌన్ తర్వాత మారుతి సుజుకి తమ అన్ని ఉత్పత్తి కేంద్రాలను పూర్తి సామర్థ్యంతో నడిపిస్తోంది. మరోవైపు లాక్‌డౌన్ అనంతరం దేశంలో వాహనాల వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో, పెరుగుతున్న డిమాండ్‌కి అనుగుణంగా మారుతి సుజుకి కూడా తమ వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతోంది.

అమ్మకాల పరంగా కూడా మారుతి సుజుకి క్రమంగా వృద్ధిని కనబరుస్తోంది. అయితే, గడచిన నవంబర్ 2020లో మాత్రం కంపెనీ అమ్మకాలు స్వల్పంగా క్షీణించాయి. నవంబర్ 2019లో మారుతి సుజుకి విక్రయించిన మొత్తం 1,39,133 యూనిట్ల ప్యాసింజర్ కార్లతో పోల్చుకుంటే నవంబర్ 2020లో కంపెనీ 1,35,775 యూనిట్ల వాహనాలను విక్రయించి 2 శాతం క్షీణతను నమోదు చేసింది.
MOST READ:మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ కారు 'ప్రవైగ్ ఎక్స్‌టింక్షన్' ఆవిష్కరణ