Just In
- 17 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 1 day ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 1 day ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 1 day ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
మార్చి 8 నుంచి రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Movies
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆన్‌లైన్‌లో 2 లక్షల మంది కొన్నారు.. మారుతి సుజుకి కొత్త రికార్డ్..
కోవిడ్-19 దేశంలో డిజిటల్ విప్లవానికి మార్గం సుగమం చేసిందనే చెప్పాలి. వైరస్ వ్యాప్తి భయంతో ప్రజలు ఇళ్ల నుండి రావటానికి ఇష్టం చూపని నేపథ్యంలో, తయారీదారులు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు ఆన్‌లైన్ రీటైల్ సేల్స్ ప్లాట్‌ఫామ్‌లను ఎంచుకున్నారు. దీని సాయంతో కస్టమర్‌కు కావల్సిన ఎండ్ టూ ఎండ్ సపోర్ట్ అందిస్తూ, వారిని ఆకర్షిస్తున్నారు.

ప్రత్యేకించి ఆటోమొబైల్ రంగంలో కూడా ఆన్‌లైన్ సేల్స్ ప్లాట్‌ఫామ్ మంచి విజయాన్ని సాధించింది. దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి భారత మార్కెట్లో తమ ఆన్‌లైన్ సేల్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా 2 లక్షలకు పైగా యూనిట్లను విక్రయించినట్లు ప్రకటించింది.

మారుతి సుజుకి డిజిటల్ ఛానెల్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా 1000 డీలర్‌షిప్‌లను కవర్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఏప్రిల్ 2019 నుండి ఇప్పటి వరకూ మారుతి సుజుకి ఆన్‌లైన్ ద్వారా రెండు లక్షల కార్లను విక్రయించింది. మారుతి సుజుకి తొలిసారిగా 2017లో ఆన్‌లైన్ బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభించింది.
MOST READ:మీకు తెలుసా.. అత్యంత ఖరీదైన తెలుగు హీరోల కార్లు, వాటి వివరాలు

గడచిన కొన్నేళ్లతో పోలిస్తే మారుతి సుజుకి తమ డిజిటల్ ఎంక్వైరీలలో ఐదు రెట్లు పెరుగుదలను చూసినట్లు పేర్కొంది.
ఏప్రిల్ 2019 నుండి కంపెనీ 2 లక్షల యూనిట్ల అమ్మకాలను మరియు 21 లక్షల కస్టమర్ ఎంక్వైరీలను నమోదు చేసుకున్నట్లు పేర్కొంది. దేశీయ మార్కెట్లో బ్రాండ్ యొక్క మొత్తం అమ్మకాల్లో ఇది 20 శాతం పెరుగుదలను కనబరిచింది.

భారతదేశంలో కోవిడ్-19 లాక్‌డౌన్ తర్వాత, గడచిన 5 నెలల్లోనే భారీగా డిజిటల్ ఎంక్వైరీలు వచ్చినట్లు కంపెనీ తెలిపింది. మారుతి సుజుకి ఇండియాకు మొత్తంగా లభిస్తున్న ఎంక్వైరీలలో డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారానే 33 శాతం వస్తున్నట్లు కంపెనీ వివరించింది.
MOST READ:పరుగులు తీస్తున్న ఫాస్ట్‌ట్యాగ్ ఇన్స్టాలేషన్.. ఇప్పటికి ఎంతో తెలుసా?

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సాధించిన ఈ అరుదైన ఆన్‌లైన్ సేల్స్ మైల్‌స్టోన్ గురించి కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, గూగుల్ ఆటో గేర్ షిఫ్ట్ ఇండియా 2020 రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో దాదాపు 95 శాతం కొత్త కార్ల అమ్మకాలు డిజిటల్‌గానే ప్రభావితమయ్యాయని తెలిపారు.

వినియోగదారులు మొదట ఆన్‌లైన్‌లో పరిశోధన చేసిన తర్వాతనే భౌతికంగా డీలర్‌షిప్‌లకు వెళ్లి కొనుగోళ్లు చేస్తున్నారని, ఆన్‌లైన్ అనుభవం వినియోగదారులకు పూర్తి స్పెక్ట్రం సమాచారాన్ని అందిస్తుందని, లాస్ట్ మైల్‌గా మాత్రమే వారు తమ విశ్వసనీయ డీలర్‌లను సంప్రదించి డీల్స్ క్లోజ్ చేస్తున్నారని ఆయన చెప్పారు.
MOST READ:రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 రివ్యూ.. ఇది అభిమానుల అంచనాలను అందుకుంటుందా..?

మారుతి సుజుకి డిజిటల్ ఛానల్ ద్వారా ఎంక్వైరీ చేసే కస్టమర్లు కేవలం 10 రోజుల్లోనే కారు కొనుగోలు చేసే ప్రక్రియను పూర్తిచేస్తున్నారని, డిజిటల్ ఎనేబుల్డ్ సేల్స్ ఫోర్స్ ద్వారా అమలు చేయబడిన ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫామ్ సాయంతో బలమైన డిజిటల్ ఎంక్వైరీలను అమ్మకాలుగా మార్చడం ద్వారా ఇది సాధ్యమవుతుందని శ్రీవాత్సవ చెప్పారు.

గడచిన 2018లో ఈ కొత్త డిజిటల్ ఛానెల్ ప్రవేశపెట్టినప్పటి నుండి, తాము డిజిటల్ ఎంక్వైరీలలో మూడు రెట్లు పెరుగుదల చూశామని మరియు ఏప్రిల్ 2019 నుండి 2 లక్షలకు పైగా యూనిట్ల అమ్మకాలను నమోదు చేసామని, ఈ డిజిటల్ ఛానల్ ద్వారా ఇప్పటికే 21 లక్షలకు పైగా కస్టమర్ ఎంక్వైరీలు వచ్చాయని ఆయన చెప్పారు.
MOST READ:మెర్సిడెస్ బెంజ్ క్లాసిక్ కార్ ర్యాలీ ; పూర్తి వివరాలు

ఈ డిజిటల్ ట్రెండ్స్‌కు సహకరించేందుకు మారుతి సుజుకి ఇండియా, దేశవ్యాప్తంగా ఉన్న తమ డీలర్ భాగస్వాములకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. దేశవ్యాప్తంగా తమ డిజిటల్ మార్కెటింగ్ సామర్థ్యాలను మెరుగుపరచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

మారుతి సుజుకి ఆన్‌లైన్ అమ్మకాల మైలురాయిపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
మారుతి సుజుకి భారత మార్కెట్లో తమ ఆన్‌లైన్ సేల్స్ ప్లాట్‌ఫామ్‌ను విస్తృతంగా విస్తరిస్తోంది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా కంపెనీ తమ కస్టమర్లకు విస్తృతమైన ఆప్షన్లను అందిస్తుంది. కస్టమర్‌లు ఇప్పుడు తమ ఇంటి వద్ద నుండే తమకు నచ్చిన మారుతి సుజుకి కారును కొనుగోలు చేసి, ఇంటి వద్దకే డెలివరీ కూడా పొందే అవకాశం ఉంది.