మారుతి సుజుకిపై కరోనా వేటు : అమాంతం పడిపోయిన ఏప్రిల్ అమ్మకాలు

ప్రపంచదేశాలలో కరోనా వైరస్ రోజురోజుకి ఎక్కువగా వ్యాపిస్తున్న కారణంగా దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా వాణిజ్య వ్యాపారాలు పూర్తిగా నిలిచిపోయాయి. అంతే కాకుండా ఆటో మొబైల్ పరిశ్రమలు కూడా భారీ నష్టాలను చవిచూస్తున్నాయి.

మారుతి సుజుకిపై కరోనా వేటు : అమాంతం పడిపోయిన ఏప్రిల్ అమ్మకాలు

మార్చి 24 నుంచి లాక్ డౌన్ ప్రకటించడంతో చాలా ఆటో పరిశ్రమలు ఉత్పత్తి మరియు అమ్మకాలను పూర్తిగా నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో ఆటో కంపెనీలు ఎటువంటి ఉత్పత్తి మరియు అమ్మకాలు లేకపోవడం వల్ల వందల కోట్ల నష్టాలు చూస్తున్నాయి. కరోనా వైరస్ కేవలం ప్రజలమీద మాత్రమే కాకుండా ఆటో పరిశ్రమల మీద కూడా దాని ప్రభావాన్ని చూపిస్తోంది.

మారుతి సుజుకిపై కరోనా వేటు : అమాంతం పడిపోయిన ఏప్రిల్ అమ్మకాలు

భారతదేశంలో ప్రస్తుతం రెండవదశ లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇది 2020 మే 03 న ముగియనుంది. కానీ వైరస్ అంతకంతకూ పెరుగుతుండటం వల్ల ఈ గడువు మరింత పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జరీ చేసింది. కాబట్టి వాహన అమ్మకాలు ఈ సమయంలో అసాధ్యమనే చెప్పాలి.

MOST READ:లాక్‌డౌన్ లో జరిగిన పెళ్లి : రాయల్ ఎన్ఫీల్డ్ పై రైడింగ్

మారుతి సుజుకిపై కరోనా వేటు : అమాంతం పడిపోయిన ఏప్రిల్ అమ్మకాలు

భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన వాహన తయారీదారులలో ఒకటైన మారుతి సుజుకి చరిత్రలో మొట్టమొదటి సారి ఏప్రిల్ నెలలో ఒక్క వాహనం కూడా అమ్మడు పోకపోవడం వల్ల, సున్నా అమ్మకాలను కొనసాగించింది. కేవలం మారుతి మాత్రమే కాకుండా చాల కంపెనీలు కూడా చాలా తక్కువ అమ్మకాలను కలిగి ఉన్నాయి.

మారుతి సుజుకిపై కరోనా వేటు : అమాంతం పడిపోయిన ఏప్రిల్ అమ్మకాలు

ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు వాహనాల ఉత్పత్తిని నిలిపివేసిన కొందరు ఆటో తయారీదారులు ఇప్పుడు లాక్ డౌన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఉత్పత్తిని తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్నారు.

MOST READ:లాక్‌డౌన్ లో తల్లిని చూడటానికి 480 కి.మీ సైకిల్ పై వచ్చిన కొడుకు, చివరికి ఏమైందంటే

మారుతి సుజుకిపై కరోనా వేటు : అమాంతం పడిపోయిన ఏప్రిల్ అమ్మకాలు

ఆటో పరిశ్రమల్లో వాహనాల ఉత్పత్తికి ప్రస్తుతం పెద్ద విడిభాగాలు లేకపోవడం వల్ల వాహనాల ఉత్పత్తులు పాక్షికంగా నిలివేయబడ్డాయి. ప్రస్తుతం వ్యవసాయ రణగంలో ఉన్న కొన్ని పరిశ్రమలకు మాత్రమే అనుమతి లభించింది. ఇప్పటికే చాల ప్రాంతాలు రెడ్, ఆరంజ్, మరియు గ్రీన్ జోన్ లుగా విభజించారు. ఇది ఆటో ఉత్పత్తులకు సమస్యగా మారింది.

మారుతి సుజుకిపై కరోనా వేటు : అమాంతం పడిపోయిన ఏప్రిల్ అమ్మకాలు

వాహనతయారీ విభాగాలలో అన్ని విడి భాగాలు అందుబాటులో లేనట్లయితే మరియు వాహనాలు విక్రయించబడకపోతే, కంపెనీలు అదనపు ఆర్థిక భారం మోయవలసి వస్తుంది. తర్వాత చాలా కంపెనీలు నష్టాల్లో మునిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

MOST READ:రిషి కపూర్ మరణం : లాక్‌డౌన్ లో కూడా ఇల్లుచేరిన రిధిమా కపూర్

మారుతి సుజుకిపై కరోనా వేటు : అమాంతం పడిపోయిన ఏప్రిల్ అమ్మకాలు

ఆటో పరిశ్రమలు అన్ని కష్టాలను ఎదుర్కొంటున్నప్పటికి, కరోనాకి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రభుత్వాలకు మద్దతు తెలుపుతున్నాయి. అంతే కాకుండా అత్యవసర సమయాల్లో అవసరమైన వైద్య పరికరాలను ఉత్పత్తి చేయడం ద్వారా వైరస్ నివారణకు పాటుపడుతున్నాయి.

Most Read Articles

English summary
Maruti Suzuki India Limited had zero sales in the domestic market, (including sales to OEM), in April 2020. This was because in compliance with the Government orders all production facilities were closed. Read in Telugu.
Story first published: Saturday, May 2, 2020, 12:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X