కొత్త మారుతి ఎస్-క్రాస్ బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

మారుతి సుజుకి ఇండియా ఎట్టకేలకు తమ సరికొత్త ఎస్-క్రాస్ పెట్రోల్ మోడల్‌ను నేడు భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త 2020 మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఇప్పుడు కేవలం బిఎస్6 పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభ్యం కానుంది. ఇది మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తోంది. అవి - సిగ్మా, డెల్టా, జెటా, ఆల్ఫా.

కొత్త మారుతి ఎస్-క్రాస్ బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త 2020 మారుతి సుజుకి ఎస్-క్రాస్ బిఎస్6 పెట్రోల్ వెర్షన్‌లో ఇదివరకటి బిఎస్4 ఇంజన్‌నే కొత్తగా బిఎస్6 నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేశారు. ఇందులోని బిఎస్6 కంప్లైంట్ 1.5-లీటర్ కె15 సిరీస్ యూనిట్‌ను ఉపయోగించారు. ఇదే ఇంజన్‌ను మారుతి అందిస్తున్న సియాజ్, ఎర్టిగా మరియు విటారా బ్రెజ్జా వంటి మోడళ్లలో కూడా వినియోగిస్తున్నారు.

కొత్త మారుతి ఎస్-క్రాస్ బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఇది వరకు మారుతి సుజుకి ఎస్-క్రాస్‌లో డీజిల్ ఇంజన్ కూడా అందుబాటులో ఉండేది. అయితే, ఇప్పుడు కొత్త 2020 ఎస్-క్రాస్ కేవలం పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే లభిస్తుంది. ఇదివరకు ఆఫర్ చేసిన 1.3-లీటర్ డీజిల్ ఇంజన్ స్థానాన్ని 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో రీప్లేస్ చేశారు. కేవలం పెట్రోల్ కార్లను మాత్రమే తయారు చేయాలనే మారుతి లక్ష్యంలో భాగంగా ఇలా చేశారు.

కొత్త మారుతి ఎస్-క్రాస్ బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త మారుతి సుజుకి ఎస్-క్రాస్ ఇప్పుడు 1.5-లీటర్ కె15 సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 103 బిహెచ్‌పి శక్తిని మరియు 138 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో బ్రాండ్ యొక్క ఎస్‌హెచ్‌విఎస్ మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీని కూడో జోడించారు. ఈ ఇంజన్ ఆప్షనల్ 4-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పాటుగా స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో కూడా లభిస్తుంది.

కొత్త మారుతి ఎస్-క్రాస్ బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

మారుతి సుజుకి ఎస్-క్రాస్ పెట్రోల్ మోడల్‌ను కంపెనీ తమ ప్రీమియం నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా ప్రత్యేకంగా విక్రయించనుంది. ఈ కొత్త ఎస్-క్రాస్ కోసం నెక్సా డీలర్లు ఇప్పటి గత నెలలోనే బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభించారు. కస్టమర్లు రూ.11,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి ఈ క్రాసోవర్‌ను బుక్ చేసుకోవచ్చు. త్వరలోనే ఈ మోడల్ డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

కొత్త మారుతి ఎస్-క్రాస్ బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

బిఎస్6 కంప్లైంట్ పెట్రోల్ ఇంజన్ మినహా మారుతి సుజుకి ఎస్-క్రాస్‌లో పెద్దగా చెప్పుకోదగిన మార్పులు ఏవీ లేవు. ఈ క్రాస్ఓవర్ హ్యాచ్‌బ్యాక్‌లో అనేక ఫీచర్లు మరియు పరికరాలను స్టాండర్డ్‌గా అందించనున్నారు.

కొత్త మారుతి ఎస్-క్రాస్ బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఎల్‌ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడి టెయిల్ లైట్స్, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు (డేటైమ్ రన్నింగ్ లైట్స్), డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో కూడిన స్మార్ట్‌ప్లే స్టూడియో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లను ఇందులో ప్రధానంగా చెప్పుకోవచ్చు.

కొత్త మారుతి ఎస్-క్రాస్ బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

మారుతి సుజుకి తొలిసారిగా 2015లో తమ ఎస్-క్రాస్ క్రాసోవర్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. గడచిన 2017లో ఈ మోడల్‌లో భారీ అప్‌గ్రేడ్స్ చేశారు. ప్రస్తుతం మార్కెట్లో దీని బేస్ సిగ్మా వేరియంట్ ధర రూ.8.39 లక్షలుగా ఉండగా టాప్-స్పెక్ ఆల్ఫా వేరియంట్ ధర రూ.12.39 లక్షలుగా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

కొత్త మారుతి ఎస్-క్రాస్ బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త 2020 మారుతి సుజుకి ఎస్-క్రాస్ బిఎస్6 క్రాసోవర్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మారుతి సుజుకి ఎస్-క్రాస్‌లో డీజిల్ వేరియంట్ కోసం ఎదురుచూసే వారికి మాత్రం ఇది నిరాశనే మిగిల్చింది. మారుతున్న కాలుష్య నిబంధనలకు లోబడి, మారుతి సుజుకి డీజిల్ ఇంజన్ ఆప్షన్లు క్రమక్రమంగా నిలిపివేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే, కొత్త ఎస్-క్రాస్ ఇప్పుడు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తోంది. అయితే, మైలేజ్‌ను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఇందులో మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ ఆఫర్ చేస్తుండటం చెప్పుకోదగిన విషయం.

Most Read Articles

English summary
Maruti Suzuki has launched the S-Cross petrol in the Indian market. The new (2020) Maruti S-Cross petrol BS6 model is now available in four variants and is offered with a starting price of Rs 8.39 lakh, ex-showroom (Delhi).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X