ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా పెట్రోల్ వెర్షన్ కారుని లాంచ్ చేయనున్న మారుతి సుజుకి

మారుతి సుజుకి సంస్థకి ఇండియన్ మార్కెట్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మారుతి చాలా వాహనాలను మార్కెట్లోకి విడుదల చేసింది. రాబోయే ఆటో ఎక్స్‌పోలో మొట్ట మొదటి సారికా పెట్రోల్ వెర్షన్ కారుని లాంచ్ చేయబోతోంది. దీని గురించో మరింత సమాచారం తెలుసుకుందా!

ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా పెట్రోల్ వెర్షన్ కారుని లాంచ్ చేయనున్న మారుతి సుజుకి

మారుతి సుజుకి 2020 ఆటో ఎక్స్‌పోలో సరికొత్త ఎస్-క్రాస్ పెట్రోల్ వేరియంట్ ని పరిచయం చేయనుంది. ఈ పెట్రోల్ వేరియం యొక్క ఖర్చులను భరించడానికిక్ సంస్థ డీజిల్ మోడల్ వాహనాలను నిలిపివేయనుంది. కానీ చాల మంది వినియోగదారులు మారుతి యొక్క డీజిల్ వెర్షన్ కార్లను కొనసాగించాలని కోరుతున్నారు.

ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా పెట్రోల్ వెర్షన్ కారుని లాంచ్ చేయనున్న మారుతి సుజుకి

మారుతి ఎస్-క్రాస్ ప్రారంభంలో రెండు డీజిల్ ఇంజన్ ఎంపికలతో ప్రారంభించబడింది. అవి ఒకటి 1.3-లీటర్, రెండు 1.6-లీటర్ వెర్షన్. కానీ మారుతి ఎస్-క్రాస్ ఫేస్ లిఫ్ట్ అందుకున్నప్పుడు 1.6-లీటర్ ఇంజిన్ చివరికి నిలిపివేయబడింది మరియు 1.3-లీటర్ కొంత నవీనీకరించబడింది.

ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా పెట్రోల్ వెర్షన్ కారుని లాంచ్ చేయనున్న మారుతి సుజుకి

ప్రస్తుత తరం మారుతి ఎస్-క్రాస్‌లో కనిపించే అవుట్‌గోయింగ్ 1.3-లీటర్ డీజిల్ ఇంజన్. ఇది 89 బిహెచ్‌పి శక్తిని మరియు 200 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ ఐదు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కి జతచేయబడుతుంది. ఇది ఇప్పుడు నిలిపివేయబడిన మల్టీ-జెట్ ఇంజిన్ ఫియట్ నుండి తీసుకోబడింది.

ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా పెట్రోల్ వెర్షన్ కారుని లాంచ్ చేయనున్న మారుతి సుజుకి

2020 మారుతి ఎస్-క్రాస్ బిఎస్-6 1.5-లీటర్ కె15 బి పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది మారుతి సియాజ్ మరియు మారుతీ ఎర్టిగా యొక్క ప్రస్తుత మోడల్స్ లో కూడా కనిపిస్తుంది. కొత్తగా లాంచ్ చేయబోయే బిఎస్-6 కార్ ఇంజిన్ లక్షణాలు పూర్తిగా తెలియవు, కాని సియాజ్ మరియు ఎర్టిగా యొక్క 103 బిహెచ్‌పి శక్తి మరియు 138 ఎన్ఎమ్ టార్క్ వంటి ఇంజన్ అదే శక్తిని మరియు పనితీరును అందిస్తుందని ఊహించవచ్చు.

ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా పెట్రోల్ వెర్షన్ కారుని లాంచ్ చేయనున్న మారుతి సుజుకి

1.5-లీటర్ కె 15 బి ఇంజిన్ సంస్థ యొక్క ఎస్‌హెచ్‌విఎస్ మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌కి సమానంగా ఉంటుంది. ఇది మంచి ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ని రాబోయే 2020 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా మోడళ్లలో కూడా అమర్చాలని మేము భావిస్తున్నాము. ప్రస్తుత తరం విటారా బ్రెజ్జా మరియు మారుతి ఎస్-క్రాస్ రెండూ ప్రస్తుతం కంపెనీ విజిటి మల్టీ-జెట్ ఇంజిన్‌ను కలిగి ఉన్నాయి, అవి ఇప్పుడు నిలిపివేయబడ్డాయి.

ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా పెట్రోల్ వెర్షన్ కారుని లాంచ్ చేయనున్న మారుతి సుజుకి

మారుతి ఇగ్నిస్ ఫేస్‌లిఫ్ట్ 2020 మోడల్ బిఎస్ 6 ఫార్మాట్‌లో ఉన్నప్పటికీ కంపెనీ 1.2-లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. కంపెనీ ఇగ్నిస్ లో మైనర్ కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లను కూడా కల్పిస్తుంది.

ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా పెట్రోల్ వెర్షన్ కారుని లాంచ్ చేయనున్న మారుతి సుజుకి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లో ఇప్పుడు డీజిల్ ఇంజిన్ వాహనాలకు ఆదరణ రాను రాను క్షీణించింది. కాబట్టి దాదాపు ఇప్పుడు అన్ని సంస్థలు బిఎస్-6 వాహనాలను ప్రవేశపెడుతున్నాయి. రాబోయే ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి కూడా తన మొదటి పెట్రోల్ వెర్షన్ ఎస్-క్రాస్‌ని పరిచయం చేయనుంది. దీని స్థానంలో ఉన్న ఎస్ క్రాస్ 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్ ని నిలిపివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

Most Read Articles

English summary
Maruti Suzuki S-Cross Diesel Model Discontinued: Petrol Model To Debut At Auto Expo. Read in Telugu.
Story first published: Friday, January 31, 2020, 12:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X