మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో 75,000 యూనిట్స్

మారుతి సుజుకి భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ స్మాల్ కార్ ఎస్-ప్రెస్సో, దేశీయ విపణిలో విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకూ 75,000 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. మారుతి సుజుకి బ్రాండ్ నుండి లభిస్తున్న ఈ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ భారతదేశంలో కంపెనీ కొత్త అమ్మకాల మైలురాయిని సాధించి పెట్టింది.

మారుతి సుజుకి ఎస్-ప్రెసో @ 70,000 యూనిట్స్

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ఒక పొడవైన రైడింగ్ హ్యాచ్‌బ్యాక్, చూడటానికి ఇదొక చిన్నసైజు ఎస్‌యూవీ మాదిరిగా అనిపిస్తుంది. గడచిన సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఈ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేశారు. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ హ్యాచ్‌బ్యాక్ మంచి పరిమాణంలో అమ్ముడైంది మరియు దాని ప్రాక్టికాలిటీ మరియు ఎస్‌యూవిష్ వైఖరి కారణంగా ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించగలిగింది.

మారుతి సుజుకి ఎస్-ప్రెసో @ 70,000 యూనిట్స్

భారతదేశంలో తన ఏ2 విభాగంలో ఎస్-ప్రెస్సో మొత్తం మార్కెట్ వాటాలో 9 శాతాన్ని కలిగి ఉందని మారుతి సుజుకి తెలిపింది. ఈ హ్యాచ్‌బ్యాక్ కోసం సరైన ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకోవడంలో కంపెనీ అగ్రెసివ్‌గా ఉంది. ఎస్-ప్రెస్సో విషయంలో యువ పట్టణ కస్టమర్లను నిమగ్నం చేయడానికి ఏడాది పొడవునా కామిక్-కాన్, ఐఎస్ఎల్, స్ట్రీట్ డాన్సర్ 3డి, కల్ట్ ఫిట్ మరియు ఐపిఎల్ వంటి వివిధ ప్రత్యేకమైన సందర్భాల్లో ఈ కారును ప్రమోట్ చేయటం జరిగింది.

MOST READ:ప్రపంచంలోనే అత్యంత పొడవైన అటల్ టన్నెల్ ప్రారంభించిన నరేంద్ర మోదీ.. ఈ టన్నెల్ గురించి మీకు తెలుసా !

మారుతి సుజుకి ఎస్-ప్రెసో @ 70,000 యూనిట్స్

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కారు కేవలం పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే లభిస్తుంది. ఇందులో 1.0-లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 67 బిహెచ్‌పి పవర్‌ను మరియు 90 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంది.

మారుతి సుజుకి ఎస్-ప్రెసో @ 70,000 యూనిట్స్

మారుతి సుజుకి ఇండియాలో ఇందులో సిఎన్‌జి వేరియంట్‌ను కూడా అందిస్తోంది. ఇందులో అదే 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో ఫ్యాక్టరీతో ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌ను అమర్చారు. ఇది 5500 ఆర్‌పిఎమ్ వద్ద 58 బిహెచ్‌పి పవర్‌ను మరియు 3500 ఆర్‌పిఎమ్ వద్ద 70 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సిఎన్‌జి శక్తితో పనిచేసే యూనిట్ స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. ఇది ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, కేజీకి 31.2 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.

MOST READ:వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ పట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు.. ఎందుకో తెలుసా ?

మారుతి సుజుకి ఎస్-ప్రెసో @ 70,000 యూనిట్స్

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ఇంటీరియర్స్‌లో డ్యాష్‌బోర్డు మధ్యలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు 7 ఇంచ్ స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ రెండూ కలిసి ఉంటాయి. ఎస్-ప్రెస్సో ఇంటీరియర్స్ క్యాబిన్ అంతటా బ్లాక్-అవుట్ ట్రిమ్స్ మరియు డ్యూయెల్-టోన్ సీట్ ఫాబ్రిక్‌ను కలిగి ఉంటుంది.

మారుతి సుజుకి ఎస్-ప్రెసో @ 70,000 యూనిట్స్

ఈ కారులో ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్ విత్ ఈబిడి, పాదచారుల భద్రత, రివర్స్ పార్కింగ్ సెన్సార్, సీట్-బెల్ట్ రిమైండర్, హై-స్పీడ్ అలెర్ట్ మొదలైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. మార్కెట్లో మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ప్రారంభ ధర రూ.3.70 లక్షలు మరియు టాప్-ఎండ్ విఎక్స్ఐ సిఎన్‌జి వేరియంట్ ధర రూ.5.13 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉన్నాయి.

MOST READ:ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన కొత్త మహీంద్రా థార్ : ధర & ఇతర వివరాలు

మారుతి సుజుకి ఎస్-ప్రెసో @ 70,000 యూనిట్స్

ఈ విజయంపై మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, "ఏడాది వ్యవధిలో, మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో అనేక సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లతో తనకంటూ ఒక బలమైన సముచిత స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇందులో స్మార్ట్‌ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో మరియు వాయిస్ కంట్రోల్ వంటి డైనమిక్ సెంటర్ కన్సోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. యువ భారతదేశం యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా, ఎస్-ప్రెస్సో ప్రత్యేకంగా ఉత్తమమైన సాంకేతిక పరిజ్ఞానాలు మరియు ఫీచర్లతో మినీ ఎస్‌యూవీ అనుభూతిని అందించేలా రూపొందించబడింది" అని చెప్పారు.

మారుతి సుజుకి ఎస్-ప్రెసో @ 70,000 యూనిట్స్

"ఒక సంవత్సరంలో, ఎస్-ప్రెస్సో కొనుగోలుదారులు తమ జీవనశైలికి సరిపోయేలా ప్రత్యేకమైన మరియు ఉత్తేజకరమైన ఉపకరణాలతో (యాక్ససరీస్‌తో) తమ కార్లను అలంకరించుకోవడంలో 24 శాతం వృద్ధిని కనబరచారు. వాస్తవానికి, దేశంలో కొనసాగుతున్న అన్‌లాక్ ప్రక్రియలో ఎస్-ప్రెస్సో మార్కెట్ నుంచి సానుకూల స్పందన అందుకుని, యువ కొనుగోలుదారుల్లో ఆసక్తిని పెంచింది ఈ యువ బ్రాండ్‌ను ఆమోదించినందుకు మా వినియోగదారులకు ధన్యవాదాలు" అని శ్రీవాత్సవ అన్నారు.

MOST READ:ఈ ఫ్యాన్సీ నెంబర్ ధర అక్షరాలా రూ. 10.10 లక్షలు.. ఆ నెంబర్ ఎదో తెలుసా ?

మారుతి సుజుకి ఎస్-ప్రెసో @ 70,000 యూనిట్స్

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో సేల్స్ మైల్‌స్టోన్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో దాని ఎస్‌యూవీ-ప్రేరేపిత డిజైన్ కారణంగా మార్కెట్లో మంచి పాపులారిటీని దక్కించుకుంది. పొడవైన-రూపకల్పన మెరుగైన ప్రాక్టికాలిటీతో కూడిన విశాలమైన క్యాబిన్, సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లతో ఇది ఉత్తమ ఏ2 ఎంట్రీ లెవల్ కారుగా నిలిచింది. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో భారత మార్కెట్లో రెనాల్ట్ క్విడ్ మరియు డాట్సన్ రెడిగో వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Maruti Suzuki S-Presso has registered over 75,000 units sold since its launch in the Indian market. The entry-level hatchback from the brand has achieved a new sales milestone for the brand in the country. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X