కరోనా పరీక్షలో మారుతి భద్రతా సిబ్బందికి పాజిటివ్, ఆపై పరారీ!

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న భద్రతా సిబ్బందికి కోవిడ్ -19 పరీక్షలు చేయడంతో వారిలో కొందరికి పాజిటివ్ ఫలితాలు వచ్చాయి, ఆ తర్వాత ఈ సిబ్బందిలో 17 మంది కనిపించకుండా పరారైనట్లు కంపెనీ ప్రకటించింది. పరారైన వారంతా దేశంలోనే అత్యంత పాపులర్ సెక్యూరిటీ కంపెనీ ఎస్ఐఎస్ ఇండియాకి చెందిన వారు కావటం గమనార్హం. భద్రతా చర్యల్లో భాగంగా జూన్ 17న ఈ సిబ్బందికి నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ రిజల్ట్స్ రావటంతో, వారిని క్వరెంటైన్ చేయాల్సి ఉంది.

కరోనా పరీక్షలో మారుతి భద్రతా సిబ్బందికి పాజిటివ్, ఆపై పరారీ!

ఈ నేపథ్యంలో, పాజిటివ్ వచ్చిన సిబ్బంది మొత్తం పరారయ్యారు. పారియిన పోయిన సిబ్బందిపై ఇండస్ట్రియల్ సెక్టార్-7లో కంపెనీ ఓ ఎఫ్ఐర్ కూడా నమోదు చేసింది. ఈ ఎఫ్‌ఐఆర్ ప్రకారం, గుర్గావ్‌లోని పిహెచ్‌సి భాంగ్రోలా కేంద్రంగా పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యుడు సదరు ఉద్యోగులను పరీక్షించిన వెంటనే వారి మేనేజర్‌ జూన్ 17న ఈ పాజిటివ్ పరీక్షల గురించి కంపెనీకి సమాచారం అందించారు.

కరోనా పరీక్షలో మారుతి భద్రతా సిబ్బందికి పాజిటివ్, ఆపై పరారీ!

కరోనా పాజిటివ్ రిజల్ట్స్ గురించి తెలియగానే, సదరు మేనేజర్ ఆ ప్రాంతంలోని సంబంధిత వైద్యాధికారులకు సమాచారం అందించారని, ఆ వెంటనే వారికి క్వరెంటైన్ చేశారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

MOST READ: మీ ఐఫోన్‌తో మీ BMW కారుని అన్‌లాక్ చేయొచ్చు; ఎలాగో తెలుసా..?

కరోనా పరీక్షలో మారుతి భద్రతా సిబ్బందికి పాజిటివ్, ఆపై పరారీ!

కానీ తమ వైద్య బృందం జూన్ 18న సైట్‌కి చేరుకున్నప్పుడు, ఈ 17 మంది కరోనా రోగులు అప్పటికే ఎటువంటి సమాచారం లేకుండా పరారైనట్లు గుర్తించాని, ఈ నేపథ్యంలో వారిపై విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం చర్య తీసుకోవాలని ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు.

కరోనా పరీక్షలో మారుతి భద్రతా సిబ్బందికి పాజిటివ్, ఆపై పరారీ!

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ అధికార ప్రతినిధి సదరు ఉద్యోగుల వైరస్ పరీక్ష ఫలితాలను ధృవీకరించారు, పాజిటివ్ ఫలితాలు వచ్చిన వ్యక్తులు మారుతి సుజుకి ఉద్యోగులు కాదని, వారు సంస్థతో నియమించబడిన అవుట్సోర్స్ / కాంట్రాక్టు విజిలెన్స్ సిబ్బందని ఆయన తెలిపారు.

MOST READ: వినియోగదారులకు గుడ్ న్యూస్ : రాపిడో స్టోర్స్ ప్రారంభించిన రాపిడో

కరోనా పరీక్షలో మారుతి భద్రతా సిబ్బందికి పాజిటివ్, ఆపై పరారీ!

కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో, ఉద్యోగుల భద్రత మరియు వారి ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన అన్ని మార్గదర్శకాలను, ఆదేశాలను పాటిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. కోవిడ్ -19 పాజిటివ్ వచ్చిన ఉద్యోగులు మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్‌కు నేరుగా పనిచేస్తున్న ఉద్యోగులు కానందున, ఈ ప్లాంట్ ఉత్పత్తి కార్యకాలాపాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయంపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా, ఈ విషయంపై కామెంట్ చేయటానికి ఎస్ఐఎస్ ఇండియా అందుబాటులో లేదు.

కరోనా పరీక్షలో మారుతి భద్రతా సిబ్బందికి పాజిటివ్, ఆపై పరారీ!

మారుతి సుజుకి ఇటీవలే తమ మానేసర్ ప్లాంట్‌లో పాక్షికంగా ఉత్పత్తి కార్యకాలాపాలు ప్రారంభించిన నేపథ్యంలో, అక్కడ ఓ ఉద్యోగికి కోవిడ్-19 పాజిటివ్ రావటంతో ప్లాంట్‌ను కొద్ది రోజుల పాటు మూసివేసి, ఇటీవలే తిరిగి ప్రారంభించింది. దాదాపు 55 రోజుల నిర్విరామ లాక్‌డౌన్ తర్వాత కంపెనీ ఇప్పుడు ఉత్పత్తిని పూర్తిగా ప్రారంభించింది.

MOST READ: బిడది ప్లాంట్‌లో టొయోటా సేవలు పునఃప్రారంభం

కరోనా పరీక్షలో మారుతి భద్రతా సిబ్బందికి పాజిటివ్, ఆపై పరారీ!

మారుతి మానేసర్ ప్లాంట్‌లో కంపెనీ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న ఆల్టో, స్విఫ్ట్, డిజైర్, ఎస్-ప్రెసో, ఎర్టిగా మరియు బాలెనో వంటి కార్లను ఉత్పత్తి చేస్తుంది. కాగా, గుర్గావ్ ప్లాంట్‌లో ఎస్-క్రాస్, విటారా బ్రీజ్జా, ఇగ్నిస్, మరియు సూపర్ క్యారీ ఎల్‌సివి వాహనాలను తయారు చేస్తోంది.

కరోనా పరీక్షలో మారుతి భద్రతా సిబ్బందికి పాజిటివ్, ఆపై పరారీ!

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ కాకుండా, ఇప్పటికే టయోటా కిర్లోస్కర్ మోటార్ మరియు హ్యుందాయ్ మోటార్ ఇండియా కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగుల్లో కోవిడ్-19 పాజిటివ్ కేసులు గుర్తించినట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే.

MOST READ: నదిలో పడిపోయిన కొత్తగా పెళ్లి చేసుకున్న జంట ఉన్న హోండా సిటీ, తర్వాత ఏం జరిగిందంటే ?

కరోనా పరీక్షలో మారుతి భద్రతా సిబ్బందికి పాజిటివ్, ఆపై పరారీ!

మారుతి సుజుకి భద్రతా సిబ్బందికి కరోనా సోకడంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భద్రతా ఏజెన్సీకి చెందిన 17 మంది సిబ్బందికి ఒకేసారి కోవిడ్-19 పాజిటివ్ రావటం విచారకరం. వాస్తవానికి ఫ్యాక్టరీలోని భద్రతా సంస్థలలో సాధారణంగా 20 మంది గార్డులు అందరూ కలిసి ఒకేచోట ఉంటుంటారు. ప్లాంట్‌లోకి వచ్చే, పోయే ఉద్యోగులను తనిఖీ చేస్తూ, ఒకే ప్రాంతంలో ఉండటం వలన వైరస్ వ్యాప్తి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. తమ సిబ్బంది విషయంలో ఎస్ఐఎస్ మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

Most Read Articles

English summary
Maruti Suzuki India Limited has said that seventeen employees from a security agency employed by them seem to have disappeared after testing positive for the Covid-19 virus. The virus infected folk work for SIS India, a well known security firm with interests across the country. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more