టాటా మోటార్స్‌కి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన మారుతి సుజుకి

టాటా మోటార్స్ తమ కార్ల సేఫ్టీ గురించి సోషల్ మీడియా వేదికగా మార్కెట్లోని ఇతర బ్రాండ్ కార్లతో పోలుస్తూ, వ్యంగ్యంగా పోస్టులు చేస్తున్న సంగతి తెలిసినదే. ఇదే కోవలో మారుతి సుజుకి అందిస్తున్న వ్యాగన్ఆర్ కారును తమ టాటా టియాగోతో పోలుస్తూ కంపెనీ ట్వీట్ చేసింది. ఇప్పుడు మారుతి సుజుకి అందుకు సమాధానంగా మరో ట్వీట్ చేసింది.

టాటా మోటార్స్‌కి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన మారుతి సుజుకి

ఇలా రెండు బ్రాండ్ల మధ్య ట్వీట్‌ల యుద్ధం జరుగుతోంది. టాటా మోటార్స్ ట్వీట్‌కు సమాధానంగా మారుతి సుజుకి తమ వ్యాగన్ఆర్ కారు ఫొటోతో ఓ ట్వీట్ చేసింది ఇందులో మారుతి సుజుకి తమ వ్యాగన్ఆర్ కారును 24 లక్షలకు పైగా కుటుంబాలు విశ్వసించాయి, అదే వారిని "దిల్‌సే స్ట్రాంగ్"గా చేస్తుందని టాటా టియాగో ట్వీట్‌కి సమాధానమిచ్చింది.

టాటా మోటార్స్‌కి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన మారుతి సుజుకి

గ్లోబల్ ఎన్‌సిఏపి క్రాష్ టెస్టులో మారుతి సుజుకి వ్యాగన్ కనిష్టంగా 2 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకున్నప్పటికీ, భారతదేశంలో అనేక లక్షల మంది వినియోగదారులు ఈ కారుపై విశ్వాసం ఉంచారని కంపెనీ చెబుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే, వ్యాగన్ఆర్ బయటి నుంచి సురక్షితం కాకపోయినా, హృదయాలకు హత్తుకునేంత దృఢమైన విశ్వాసాన్ని దక్కించుకుందనేది మారుతి అభిప్రాయం.

MOST READ:స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన సర్వే బోట్ : ఇంతకీ దీని ఉపయోగమేంటో మీకు తెలుసా ?

టాటా మోటార్స్‌కి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన మారుతి సుజుకి

కాగా.. టాటా మోటార్స్ అందిస్తున్న పాపులర్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ టాటా టియాగో గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్టులో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. టియాగో ఈ విభాగంలో దాని కాంపిటీటర్లతో పోల్చుకుంటే, బెస్ట్ సేఫ్టీ రేటింగ్‌ను కలిగి ఉంది. ఇదే విషయాన్ని కంపెనీ సోషల్ మీడియా వేదిక మార్కెట్లోని వివిధ రకాల మోడళ్లతో పోలుస్తూ ట్వీట్స్ చేస్తోంది.

టాటా మోటార్స్‌కి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన మారుతి సుజుకి

టాటా మోటార్స్ పోస్ట్ చేసిన తాజా ట్వీట్‌లో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ గ్లోబల్ ఎన్‌సిఏపి క్రాష్ టెస్టులో 2-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకోవటాన్ని పరోక్షంగా కంపెనీ ప్రస్థావించింది. ఇదే ట్వీట్‌లో "OH SH ** T! WAGONE" అనే కామెంట్‌తో విరిగిన చక్రంతో కూడిన ఓ బండి ఫొటోను టాటా మోటార్స్ పోస్ట్ చేసింది.

MOST READ:క్రాష్ టెస్ట్‌లో ఫోర్ స్టార్ రేటింగ్ సొంతం చేసుకున్న మహీంద్రా థార్ : వివరాలు

టాటా మోటార్స్‌కి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన మారుతి సుజుకి

టాటా టియోగో కారుకు ప్రధాన పోటీ మోడళ్లలో ఒకటైన మారుతి సుజుకి వ్యాగన్ఆర్ 2019లో గ్లోబల్ ఎన్‌సిఎపి నిర్వహించిన క్రాష్ టెస్టులో 2-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను మాత్రమే దక్కించుకుంది. ఈ క్రాష్ టెస్టులో వ్యాగన్ఆర్ కారు ప్రమాదానికి గురైనప్పుడు అందులోని వయోజనులు మరియు పిల్లల భద్రతకు 2-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది.

టాటా మోటార్స్‌కి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన మారుతి సుజుకి

టాటా టియాగో సేఫ్టీ రేటింగ్ విషయానికి వస్తే, జిఎన్‌సిఎపి క్రాష్ టెస్టులో ఈ హ్యాచ్‌బ్యాక్ మొత్తం 5 స్టార్లకు గాను 4 స్టార్లను సాధించింది. ఇది వయోజన భద్రత కోసం 17 పాయింట్లకు గాను 12.52 పాయింట్లను మరియు పిల్లల భద్రత కోసం 49 పాయింట్లకు గాను 34.15 పాయింట్లను దక్కించుకుంది.

MOST READ:ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ కొత్త కలర్స్‌లో కూడా

టాటా మోటార్స్‌కి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన మారుతి సుజుకి

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ టాప్-ఎండ్ వేరియంట్‌లో డ్రైవర్ మరియు ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబిడితో కూడిన ఏబిఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి భద్రతా పరికరాలు లభిస్తాయి. ఇంకా ఇందులో స్పీడ్ అలర్ట్ సిస్టమ్, డ్రైవర్ మరియు ప్యాసింజర్ సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్లు మరియు లోడ్ లిమిటర్లు కూడా ఉన్నాయి.

టాటా మోటార్స్‌కి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన మారుతి సుజుకి

ఇకపోతే, టాటా టియాగో కారులో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు, (ఏబిఎస్) యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ విత్ (సిఎస్‌సి) కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ అండ్ (ఇబిడి) ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, రియర్ పార్కింగ్ అసిస్ట్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి.

MOST READ:కొత్త మాడిఫైడ్ మహీంద్రా థార్.. ఎలా ఉందో చూసారా !

టాటా మోటార్స్‌కి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన మారుతి సుజుకి

టాటా మోటార్స్ ట్రోల్‌కి మారుతి సుజుకి స్ట్రాంగ్ రిప్లై ఇవ్వటంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

క్రాష్ సేఫ్టీ విషయంలో టాటా మోటార్స్ చేసిన ట్రోల్స్‌కి మారుతి సుజుకి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. టాటా మోటార్స్ లేటెస్ట్ మోడళ్లు మాత్రమే సేఫ్టీలో 4-స్టార్ లేదా 5-స్టార్ రేటింగ్‌ను దక్కించుకున్నాయి. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ చాలా కాలంగా మార్కెట్లో ఉంది. భారత మార్కెట్లో వ్యాగన్ఆర్ ఓ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్యామిలీ కార్‌గా అనేక లక్షల మంది అభిమానాన్ని పొందింది. కానీ, టాటా టియాగో మాత్రం ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ సేఫ్టీ విభాగంలో దాని ప్రత్యర్థుల కంటే మెరుగైన సేఫ్టీ రేటింగ్‌ని దక్కించుకుంది.

Most Read Articles

English summary
Maruti Suzuki replies to Tata Motors's troll on WagonR. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X