Just In
- 42 min ago
మా నాన్న పోలీస్.. నేను ఏమైనా చేస్తా.. కరోనా వేళ ఢిల్లీలో యువతి హల్చల్ [వీడియో]
- 56 min ago
డీలర్ల వద్దకు ఇసుజు డి-మ్యాక్స్ హై-ల్యాండర్ డబుల్ క్యాబిన్ పికప్ ట్రక్!
- 1 hr ago
ధర భారీగా పెరిగిన ఏ మాత్రం తగ్గని క్రేజ్.. ఇప్పటికే 50,000లకి పైగా బుకింగ్స్!
- 2 hrs ago
టూవీలర్స్ కోసం గ్రీన్ వెహికల్ రేటింగ్; పర్యావరణానికి మీ టూవీలర్ ఎంత సేఫ్?
Don't Miss
- Finance
882 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, రూ.3.5 లక్షల కోట్లు హుష్‌కాకి
- Lifestyle
ఫేషియల్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయితే ఇలా మారిపోతామా! మీరు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి...
- News
బస్సుల్లో వచ్చి దొంగ ఓట్లు వేసుంటే.. తిరుపతి ఉపఎన్నిక పోలింగ్‌పై కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు
- Movies
ప్రతి ఇంట్లో ఇలాంటి కొడుకులుండాలి…సల్మాన్ బ్రదర్స్ ను ఆకాశానికెత్తేసిన బాలీవుడ్ హాట్ బ్యూటీ !
- Sports
RCB vs KKR: అతడు వంగడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు.. ఇది కేకేఆర్‌కు పెద్ద తలనొప్పే: వాన్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
దేశంలో మరిన్ని కొత్త నగరాలలో మారుతి సుజుకి 'సబ్‌స్క్రిప్షన్' సేవలు షురూ
భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (ఎమ్ఎస్ఐఎల్) దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో తమ వాహనాల కోసం అందిస్తున్న సభ్యత్వ ఆధారిత యాజమాన్యాన్ని (సబ్‌స్క్రిప్షన్ బేస్డ్ ఓనర్‌షిప్) మరిన్ని కొత్త నగరాల్లో ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ స్కీమ్‌ను తాజాగా ముంబై (నావీ ముంబై, థానే), చెన్నై, అహ్మదాబాద్ మరియు గాంధీనగర్ నగరాల్లో ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది.

తాజా నగరాలతో కలిపి దేశంలో మొత్తం ఎనిమిది ప్రధాన నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఢిల్లీ-ఎన్‌సిఆర్, బెంగుళూరు, హైదరాబాద్ మరియు పూనే నగరాల్లో కూడా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.

కస్టమర్లు ఇప్పుడు కొత్త స్విఫ్ట్, డిజైర్, విటారా బ్రెజ్జా మరియు ఎర్టిగా మోడళ్లను మారుతి సుజుకి అరేనా షోరూమ్‌ల నుండి సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే, ప్రీమియం డీలర్‌షిప్ కేంద్రాలయిన నెక్సా ద్వారా బాలెనో, సియాజ్, ఎక్స్ఎల్6 మోడళ్లను ఎంచుకోవచ్చు.
MOST READ:టీవీఎస్ యంగ్ మీడియా రేసర్ ప్రోగ్రామ్‌లో మరో అడుగు ముందుకేసిన డ్రైవ్‌స్పార్క్ ; వివరాలు

మారుతి సుజుకి వాహనాలను నేరుగా డబ్బు చెల్లించి కొనుగోలు చేయకుండా, సబ్‌స్క్రిప్షన్ పద్దతిలో సొంతం చేసుకోవడానికి ఇదొక కొత్త మరియు సులభమైన మార్గమని కంపెనీ తెలిపింది. ఇందుకు కస్టమర్లు చేయాల్సిందల్లా అన్ని ఫీజులతో కూడిన నెలసరి మొత్తాన్ని చందా రూపంలో చెల్లించడమే.

ఈ సబ్‌స్క్రిప్షన్ సేవల కోసం వసూలు చేసే ధరలను గమనిస్తే, ఉదాహరణకు అహ్మదాబాద్‌లో స్విఫ్ట్ ఎల్‌ఎక్స్ఐ వేరియంట్‌ను సబ్‌స్క్రిప్షన్‌కు తీసుకుంటే 48 నెలల కాలపరిమితికి గాను ప్రతినెలా అన్ని పన్నులతో కలిపి రూ.15,368 చెల్లించాల్సి ఉంటుంది. అదే చెన్నై నగరంలో అయితే నెలకు రూ.15,196, అహ్మదాబాద్‌లో రూ.14,665 మరియు గాంధీనగర్‌లో రూ.14,691 చెల్లించాల్సి ఉంటుంది.
MOST READ:మొదటి సారి భారీ డిస్కౌంట్స్ ప్రకటించి ఎంజి మోటార్ కంపెనీ.. ఎంతో తెలుసా !

మారుతి సుజుకి సబ్‌స్క్రిప్షన్ సేవలో కస్టమర్లకు జీరో-డౌన్ పేమెంట్, ఫుల్ కార్ మెయింటినెన్స్, ఇన్సూరెన్స్, 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వంటి సదుపాయాలు లభిస్తాయి. అంతేకాదు, కస్టమర్లకు రీసేల్ రిస్క్ కూడా ఉండదు. మారుతి సుజుకి డీలర్ ఛానల్ ద్వారా వాహనాల మెయింటినెన్స్, భీమా కవరేజ్ మరియు రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి సదుపాయాలను కూడా కంపెనీ చూసుకుంటుంది.

కారును నేరుగా మారుతి సుజుకి నుండి కొనుగోలు చేయకుండా, కారును సొంతం చేసుకోవడం వల్ల కలిగే అన్ని ప్రయోజనాలను అనుభవించాలనుకునే కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని ఈ సబ్‌స్క్రయిబ్ ప్రోగ్రామ్‌ను పరిచయం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇది కారును దీర్ఘకాలం పాటు లీజుకు తీసుకోవటం లాంటిదే, కాకపోతే ఈ విధానంలో చివర్లో కారును పూర్తిగా సొంతం చేసుకోవాలనుకుంటే, అందుకు అవకాశం కూడా ఉంటుంది.
MOST READ:కొత్త విమానంలో ప్రయాణించిన భారత రాష్ట్రపతి ; ఇంతకీ ఈ విమానం ప్రత్యేకత ఏంటో తెలుసా

ఈ సబ్‌స్క్రిప్షన్ విధానం ద్వారా కారును లీజుకు తీసుకున్న కస్టమర్లు డౌన్‌పేమెంట్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ వంటి ముందస్తు చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు. మారుతి సుజుకి అరేనా షోరూమ్‌లు మరియు నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా కంపెనీ ఈ సబ్‌స్క్రిప్షన్ ఆధారిత స్కీమ్‌ను అందిస్తోంది.

మారుతి సుజుకి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
దేశంలో మారుతి సుజుకి సబ్‌స్క్రిప్షన్ సేవలకు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. ధీర్ఝకాలిక ఆర్థిక కట్టుబాట్లు లేకుండా, స్వల్ప సమయం కోసం ఎలాంటి ఇబ్బందులు లేని వాహన యాజమాన్యాన్ని కోరుకునే కస్టమర్లకు ఈ ప్లాన్ అనువుగా ఉంటుంది.
MOST READ:సైకిల్‌పై కాశ్మీర్ నుంచి 8 రోజుల్లో కన్యాకుమారి చేరుకున్న 17 ఏళ్ల యువకుడు, ఇతడే