మారుతి సుజుకి సూపర్ క్యారీ ఎల్‌సివిపై రూ.18,000 పెరిగిన ధర

మారుతి సుజుకి ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న లైట్ కమర్షియల్ వెహికల్ (ఎల్‌సివి) సూపర్ క్యారీ ధరలను పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. సూపర్ క్యారీ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఏకైక తేలికపాటి వాణిజ్య వాహనం, ప్రస్తుతం మార్కెట్లో దీని ధరలు రూ.4.25 లక్షల నుండి 5.18 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

మారుతి సుజుకి సూపర్ క్యారీ ఎల్‌సివిపై రూ.18,000 పెరిగిన ధర

తాజాగా ఈ మోడల్‌పై రూ.18,000 మేర ధరలను పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. మారుతి సుజుకి తొలిసారిగా సూపర్ క్యారీ ఎల్‌సివిని 2016లో భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. కేవలం మూడు సంవత్సరాల వ్యవధిలోనే ఈ మోడల్ 50,000 యూనిట్లకు పైగా అమ్ముడుపోయి, కొత్త మైలురాయిని చేరుకుంది.

మారుతి సుజుకి సూపర్ క్యారీ ఎల్‌సివిపై రూ.18,000 పెరిగిన ధర

మారుతి సుజుకి ఇండియా ఈ ఏడాది ప్రారంభంలో కొత్త బిఎస్6 సూపర్ క్యారీ ఎల్‌సివిని విడుదల చేసింది. ఈ మోడల్ మార్కెట్లో విడుదలైన కొంతకాలానికే కంపెనీ ఇందులో బిఎస్6 కంప్లైంట్ ఎస్-సిఎన్‌జి వేరియంట్‌ను కూడా విడుదల చేసింది.

MOST READ:భారత్‌లో ఎంజి గ్లోస్టర్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

మారుతి సుజుకి సూపర్ క్యారీ ఎల్‌సివిపై రూ.18,000 పెరిగిన ధర

మారుతి సూపర్ క్యారీ బిఎస్6 కంప్లైంట్ పొందిన భారతదేశపు మొట్టమొదటి లైట్ కమర్షియల్ వెహికల్ (ఎల్‌సివి)గా ఉంది. సూపర్ క్యారీ బ్రాండ్ యొక్క ‘మిషన్ గ్రీన్ మిలియన్'లో భాగంగా ఉన్నందున, ఇందులో సిఎన్‌జి మరియు స్మార్ట్ హైబ్రిడ్ వేరియంట్లను కూడా కంపెనీ ప్రవేశపెట్టింది.

మారుతి సుజుకి సూపర్ క్యారీ ఎల్‌సివిపై రూ.18,000 పెరిగిన ధర

మారుతి సుజుకి సూపర్ క్యారీలో ఫోర్ సిలిండర్ ఇంజన్‌తో లభిస్తుంది. ఇది గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 64 బిహెచ్‌పి పవర్‌ను మరియు 3000 ఆర్‌పిఎమ్ వద్ద 85 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వాహనం అన్ని భూభాగాలపై అద్భుతమైన పనితీరును మరియు మెరుగైన ప్రాక్టికాలిటీని అందించేలా ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ భాగాలతో లభిస్తుంది.

MOST READ:కొత్త కారు కొంటే ఈ పండుగ సీజన్‌లోనే కొనాలి, ఎందుకో తెలుసా?

మారుతి సుజుకి సూపర్ క్యారీ ఎల్‌సివిపై రూ.18,000 పెరిగిన ధర

సూపర్ క్యారీలో సిఎన్‌జితో నడిచే వేరియంట్లో డ్యూయల్ ఫ్యూయల్ ఆప్షన్ ఉంటుంది. ఇందులో సిఎన్‌జి ట్యాంక్‌తో పాటుగా 5 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ కూడా ఉంటుంది.

మారుతి సుజుకి సూపర్ క్యారీ ఎల్‌సివిపై రూ.18,000 పెరిగిన ధర

మారుతి సుజుకి సూపర్ క్యారీ దేశంలో మొట్టమొదటి 4-సిలిండర్ ఇంజన్‌తో నడిచే మినీ-ట్రక్ కమర్షియల్ వెహికల్. ఇందులో రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, సీట్-బెల్ట్ రిమైండర్‌లు, లాక్ చేయగల గ్లోవ్ బాక్స్, పెద్ద లోడింగ్ డెక్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:బ్లూటూత్ కనెక్టెడ్ కన్సోల్‌తో కొత్త బర్గ్‌మ్యాన్ స్ట్రీట్, యాక్సెస్ 125 విడుదల

మారుతి సుజుకి సూపర్ క్యారీ ఎల్‌సివిపై రూ.18,000 పెరిగిన ధర

మారుతి సుజుకి సూపర్ క్యారీ ధరల పెంపుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మారుతి సుజుకి సూపర్ క్యారీ దేశంలో మొట్టమొదటి 4-సిలిండర్ ఇంజన్‌తో నడిచే మినీ-ట్రక్, ఇది ఇతర వాణిజ్య వాహనాలకు లేని కొన్ని అదనపు ఫీచర్లను కలిగి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ప్రసిద్ధమైన లైట్ కమర్షియల్ వెహికల్ (ఎల్‌సివి)లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది. భారతదేశంలో ఇది టాటా ఏస్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Maruti Suzuki has revised the prices of the only light commercial vehicle in their portfolio: the Super Carry. Prices for the Super Carry now starts at Rs 4.25 lakh to Rs 5.18 lakh. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X