Just In
Don't Miss
- Finance
కోవిడ్ క్లెయిమ్స్ రూ.9,000 కోట్లు, హెల్త్ పాలసీవే రూ.7,100 కోట్లు
- Movies
పూరి తనయుడి రొమాంటిక్ సినిమా ఆగిపోలేదు.. ఫైనల్ గా ఓ క్లారిటీ ఇచ్చేశారు
- News
IPL 2021: టీఆర్ఎస్ యూటర్న్ -BCCIకి మంత్రి కేటీఆర్ అభ్యర్థన -Sunrisers Hyderabadకు షాక్?
- Sports
హైదరాబాద్‌లోనూ ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించండి.. బీసీసీఐకి కేటీఆర్ రిక్వెస్ట్!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మారుతి సుజుకి నుంచి మరిన్ని సిఎన్‌జి కార్లు వస్తున్నాయ్!
దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి రానున్న రోజుల్లో తమ సిఎన్‌జి వాహనాల పోర్ట్‌ఫోలియోని విస్తరించుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. భారత మార్కెట్లోని తమ చిన్న వాహనాల పోర్ట్‌ఫోలియోలో మారుతి సుజుకి తమ ఎస్-సిఎన్‌జి టెక్నాలజీని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.

చిన్న కార్లపై సిఎన్‌జి టెక్నాలజీని ప్రవేశపెట్టడం డీజిల్ యూనిట్ల కంటే ఎక్కువ ఆర్థిక విలువను కలిగిస్తుందని మారుతి సుజుకి అధికారులు చెబుతున్నారు. పెట్రోల్ మోడళ్ల వైపు నెమ్మదిగా మారుతున్న మార్కెట్ కోసం, బిఎస్6 కంప్లైంట్ డీజిల్ యూనిట్‌ను ప్రవేశపెట్టడం ఆర్థిక సాధ్యత విషయంలో ఎటువంటి లాజిక్ చేయలేదని కంపెనీ పేర్కొంది.

పిటిఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎంఎస్ఐఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, "చిన్న డీజిల్ ఇంజన్‌ను అభివృద్ధి చేయడంలో ఎటువంటి లాజిక్ లేదు. ఇది హ్యాచ్‌బ్యాక్ విభాగంలో 5 శాతం కన్నా తక్కువ మరియు సెడాన్లలో గణనీయంగా తగ్గింది మరియు ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ విభాగాలు ఎకనామిక్స్ కూడా దీనికి మద్దతు ఇవ్వవు."
MOST READ:సూపర్ లుక్ లో ఉన్న మోడిఫైడ్ ఫోర్డ్ జీప్ [వీడియో]

ఈ నేపథ్యంలో, చిన్న సైజు డీజిల్ ఇంజన్‌లకు బదులుగా, సంస్థ తమ సిఎన్‌జి పోర్ట్‌ఫోలియోను భారతదేశంలో విస్తరించాలని చూస్తోంది. మారుతి సుజుకి అందించే చిన్న కార్లు ప్రస్తుతం కేవలం పెట్రోల్ ఇంజన్లతో మాత్రమే లభిస్తున్నాయి. మారిన బిఎస్6 నిబంధనల కారణంగా, చిన్న సైజు డీజిల్ ఇంజన్ల తయారీ కంపెనీలకు పెద్దగా గిట్టుబాటు కాదు. ఈ పరిణామాల నేపథ్యంలో సిఎన్‌జి టెక్నాలజీని చిన్న కార్లపై చేర్చడం మరింత లాభదాయకంగా ఉంటుంది.

సిఎన్‌జి విభాగం గత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధిని సాధించగా, మొత్తం ప్రయాణీకుల వాహనాల పరిశ్రమ 18 శాతం క్షీణించిందని శ్రీవాస్తవ తెలిపారు. రాబోయే రోజుల్లో సిఎన్‌జి పోర్ట్‌ఫోలియోను మరింత మెరుగుపరచడానికి ప్లాన్ చేస్తున్నామని ఆయన అన్నారు.
MOST READ:మోటార్ సైకిల్ లేని వ్యక్తి జాగ్వార్ ఎక్స్‌జె-ఎల్ కొనేసాడు, ఎలానో మీరే చూడండి

రానున్న రెండు సంవత్సరాల్లో గ్రీన్ టెక్నాలజీ (సిఎన్‌జి మరియు పెట్రోల్-హైబ్రిడ్)తో పది లక్షల కార్లను విక్రయించాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని కంపెనీ నిర్దేశించింది. ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా మారుతి సుజుకి తమ సిఎన్‌జి పోర్ట్‌ఫోలియో విస్తరణను చేపట్టింది.

మారుతి సుజుకి ప్రస్తుతం ఆల్టో, సెలెరియో, ఎస్-ప్రెస్సో, వ్యాగన్ఆర్ మరియు ఎర్టిగా మోడళ్లలో సిఎన్‌జి-పవర్‌తో నడిచే వాహనాలను విక్రయిస్తోంది. మారుతి సుజుకి సమీప భవిష్యత్తులో ఈ శ్రేణికి మరిన్ని మోడళ్లను పరిచయం చేయాలని చూస్తోంది.
MOST READ:అద్భుతంగా ఉన్న మహేంద్ర సింగ్ ధోని గ్యారేజ్ చూసారా..?

ఇక డీజిల్‌తో నడిచే మోడళ్ల విషయానికి వస్తే, భారతీయ మార్కెట్లో మారుతి సుజుకి బిఎస్6 కంప్లైంట్ డీజిల్ ఇంజన్‌లను కొన్ని పెద్ద మోడళ్లలో మాత్రమే అందించాలని చూస్తోంది. అయితే, ఈ విషయంపై కంపెనీ ఇంకా అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

బిఎస్ 6 డీజిల్ ఇంజన్ల గురించి శ్రీవాస్తవ మాట్లాడుతూ, "ఆ (పెద్ద డీజిల్ ఇంజన్) విభాగంలో తగినంత మంది ఉన్నారని మేము గుర్తిస్తే, పెద్ద బిఎస్-6 డీజిల్ ఇంజన్‌ను అభివృద్ధి చేసే అంశంపై దృష్టి సారిస్తాము. ఈ విషయంలో కంపెనీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు" అని అన్నారు.
MOST READ:కారు పేపర్లు చూపమంటే రోడ్డు మీద పడి ఏడ్చిన అమ్మాయి : వీడియో

మారుతి సుజుకి సిఎన్‌జి పోర్ట్‌ఫోలియో విస్తరణపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
అభివృద్ధి చెందిన నగరాల్లో సిఎన్‌జి ఇంధనం విరివిగా దొరుకుతోంది. పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో పోల్చుకుంటే సిఎన్‌జితో నడిచే కార్లు అధిక మైలేజీనిస్తాయి మరియు పర్యావరణానికి కూడా తక్కువ హాని కలిగిస్తాయి. మరోవైపు మారిన బిఎస్6 ఉద్ఘార నిబంధనల కారణంగా ఆటో కంపెనీలకు చిన్నసైజు డీజిల్ ఇంజన్లను తయారు చేయటం లాభదాయం కాదు, దీంతో కంపెనీలు ప్రత్యామ్నాయ ఇంజన్ల అభివృద్ధిపై దృష్టిపెడుతున్నాయి. భారతదేశంలో సిఎన్‌జి మార్కెట్ క్రమంగా పెరుగుతున్నందున, ఈ విభాగంలో కొత్త వాహనాలను ప్రవేశపెట్టడం అర్ధమేనని మారుతి భావిస్తోంది.