కొత్త సంవత్సరంలో మారుతి సుజుకి నుండి బిఎస్6 డీజిల్ కార్లు!

దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, కొత్త సంవత్సరంలో కొత్త డీజిల్ ఇంజన్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుత మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా బిఎస్6 కంప్లైంట్ డీజిల్ ఇంజన్లను తిరిగి ప్రవేశపెట్టేందుకు కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

కొత్త సంవత్సరంలో మారుతి సుజుకి నుండి బిఎస్6 డీజిల్ కార్లు!

భారత్‌లో కాలుష్య నిబంధనలు కఠినతరం చేసిన నేపథ్యంలో, మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న కొన్ని కీలక మోడళ్లలో డీజిల్ ఇంజన్ ఆప్షన్లను ఆఫర్ చేయటం నిలిపివేసింది. అయితే, ఇటీవలి కాలంలో డీజిల్ కార్లకు గిరాకీ పెరగడంతో వచ్చే ఏడాదిలో ఎప్పుడైనా భారత మార్కెట్లో డీజిల్ విభాగంలోకి తిరిగి ప్రవేశించాలని కంపెనీ నిర్ణయించుకుంది.

కొత్త సంవత్సరంలో మారుతి సుజుకి నుండి బిఎస్6 డీజిల్ కార్లు!

మారుతి సుజుకి దేశీయంగా అభివృద్ధి చేసిన తమ 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌ను బిఎస్6 ఫార్మాట్‌లో పునరుద్ధరించాలని కంపెనీ భావిస్తోంది. హెచ్‌టి ఆటో నుండి వచ్చిన ఇటీవలి నివేదిక ప్రకారం, ఎర్టిగా మరియు విటారా బ్రెజ్జా మోడళ్లలో ముందుగా బిఎస్6 కంప్లైంట్ డీజిల్ ఇంజన్‌లను కంపెనీ ప్రారంభించే అవకాశం ఉంది.

MOST READ:10 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు కలిగి ఉన్న బిలీనియర్ : అతని కార్ల వివరాలు

కొత్త సంవత్సరంలో మారుతి సుజుకి నుండి బిఎస్6 డీజిల్ కార్లు!

దేశంలోని వాహన తయారీదారులు బిఎస్6 నిబంధనలకు మారిన తర్వాత డీజిల్ ఇంజన్ల తయారీని నిలిపివేశారు. ఇందుకు ప్రధాన కారణంగా, పెట్రోల్ వెర్షన్ బిఎస్6 ఇంజన్లతో పోల్చుకుంటే డీజిల్ వెర్షన్ బిఎస్6 ఇంజన్ల తయారీ చాలా ఖర్చుతో కూడుకున్నది. అందుకే కంపెనీలు దీనికి ప్రత్యామ్నాయంగా టర్బో పెట్రోల్ ఇంజన్లను ప్రవేశపెట్టడం ప్రారంభించారు.

కొత్త సంవత్సరంలో మారుతి సుజుకి నుండి బిఎస్6 డీజిల్ కార్లు!

నిజానికి భారత్‌లో వాహన వినియోగదారులు పెట్రోల్ కంటే డీజిల్ వాహనాలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. పెట్రోల్ వాహనాల కన్నా డీజిల్ వాహనాల ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, వాటి మైలేజ్ మరియు డీజిల్ ఇంధన ధరలను దృష్టిలో ఉంచుకొని కస్టమర్లు డీజిల్ వాహనాలనే ఎంచుకుంటుంటారు.

MOST READ:టైటానికి షిప్‌ను తలపిస్తున్న ఫెర్రీ షిప్ : పూర్తి వివరాలు

కొత్త సంవత్సరంలో మారుతి సుజుకి నుండి బిఎస్6 డీజిల్ కార్లు!

ఇతర కంపెనీల మాదిరిగానే మారుతి సుజుకి కూడా మార్కెట్‌ను మరోలా అంచనా వేసింది. కొత్త ఉద్గార నిబంధనల వల్ల డీజిల్ ఇంజన్లకు డిమాండ్ తగ్గుతుందని కంపెనీ అంచనా వేసింది. అయితే, అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా, డీజిల్ ఇంజన్లకు డిమాండ్ ఇప్పటికీ బలంగానే ఉంది.

కొత్త సంవత్సరంలో మారుతి సుజుకి నుండి బిఎస్6 డీజిల్ కార్లు!

ప్రస్తుతం మార్కెట్లో కియా మోటార్స్ మరియు హ్యుందాయ్ వంటి బ్రాండ్లు దేశీయ మార్కెట్లో విక్రయించే కొన్ని ప్రముఖ మోడళ్లలో వివిధ రకాల డీజిల్ ఇంజన్లను ఆఫర్ చేస్తున్నాయి. ఫలితంగా ఆయా మోడళ్ల అమ్మకాలు కూడా అత్యధికంగా ఉంటున్నాయి. ఉదాహరణకు కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, హ్యుందాయ్ వెన్యూ మరియు హ్యుందాయ్ వెర్నా వంటి మోడళ్లలో డీజిల్ ఇంజన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

MOST READ:ఈ-రిక్షాలు ఇవ్వ‌నున్న‌ సోనూసూద్.. కానీ ఇవి వారికి మాత్రమే

కొత్త సంవత్సరంలో మారుతి సుజుకి నుండి బిఎస్6 డీజిల్ కార్లు!

ఇటీవలి కాలంలో నమోదైన సమగ్ర అమ్మకాల నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే, పైన పేర్కొన్న కొన్ని మోడళ్లలో డీజిల్ ఇంజన్ ఆప్షన్లను ఎంచుకునే వినియోగదారుల సంఖ్య ఎక్కువగా ఉంది. హ్యుందాయ్ క్రెటాలో ఎక్కువ శాతం అమ్మకాలు డీజిల్ ఇంజన్లవే కాగా, కియా సెల్టోస్ మోడల్‌లో కూడా డీజిల్ మరియు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లకు కస్టమర్ల నుండి 50:50 స్పందన లభించింది.

కొత్త సంవత్సరంలో మారుతి సుజుకి నుండి బిఎస్6 డీజిల్ కార్లు!

డీజిల్ ఇంజన్ల విషయంలో కస్టమర్ల డిమాండ్‌ను మరియు మార్కెట్ తీరును గమనించిన మారుతి సుజుకి, కేవలం పెట్రోల్ ఇంజన్లనే నమ్ముకుంటే, కంపెనీ అమ్మకాలు భారీగా తగ్గిపోయే ప్రమాదం ఉందని అంచనా వేసింది. ఈ బ్రాండ్ ఇకపై కూడా మార్కెట్ లీడర్‌గా కొనసాగాలంటే ఈ విభాగంలో డీజిల్ ఇంజన్లను ప్రవేశపెట్టడం ఒక్కటే మార్గం.

MOST READ:హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి డ్రైవ్ చేస్తూ కనిపించిన టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' [వీడియో]

కొత్త సంవత్సరంలో మారుతి సుజుకి నుండి బిఎస్6 డీజిల్ కార్లు!

బిఎస్6 డీజిల్ విభాగంలోకి పునఃప్రవేశించే విషయాన్ని మాత్రం మారుతి సుజుకి ఇంకా అధికారికంగా దృవీకరించలేదు. కానీ బిఎస్6 కంప్లైంట్ డీజిల్ ఇంజన్ల ఉత్పత్తికి అనుగుణంగా మారుతి సుజుకి తమ మానేసర్ ప్లాంట్ లేఅవుట్‌లో మార్పులు చేస్తున్నట్లు మాత్రం ఇటీవలి నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Source:HT Auto

Most Read Articles

English summary
Maruti Suzuki To Launch BS6 Diesel Engines In Next Year On Select Models, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X