మారుతి సుజుకి నుంచి రానున్న కొత్త ఎస్-క్రాస్ ప్లస్ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్

భారతదేశపు నెంబర్ వన్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఎస్-క్రాస్ క్రాసోవర్ మోడల్‌లో కంపెనీ ఓ కొత్త స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎస్-క్రాస్ 'ప్లస్' పేరిట ఓ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను విడుదల చేయనున్నారు.

మారుతి సుజుకి నుంచి రానున్న కొత్త ఎస్-క్రాస్ ప్లస్ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్

కొత్త మారుతి సుజుకి ఎస్-క్రాస్ ప్లస్ లిమిటెడ్ ఎడిషన్ అక్టోబర్ 11, 2020వ తేదీ నుండి అమ్మకం కానుంది. ఈ కొత్త ప్లస్ వేరియంట్‌ను స్టాండర్డ్ మోడల్ యొక్క సిగ్మా వేరియంట్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేసే ఆస్కారం ఉంది. ఎస్-క్రాస్ ప్లస్ వేరియంట్‌లో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది, ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేను సపోర్ట్ చేస్తుంది.

మారుతి సుజుకి నుంచి రానున్న కొత్త ఎస్-క్రాస్ ప్లస్ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్

స్టాండర్డ్ మోడల్ ఎస్-క్రాస్‌తో పోలిస్తే ఈ ప్లస్ వేరియంట్‌ను భిన్నంగా ఉంచేందుకు ఇందులో ఎక్స్టీరియర్ ట్రిమ్స్‌ను క్రోమ్‌తో ఫినిష్ చేసే అవకాశం ఉంది. ఇంకా ఇందులో కొన్ని సూక్ష్మమైన డిజైన్ మార్పులు కూడా ఉండొచ్చని అంచనా.

MOST READ:పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కొత్త వీడియో.. చూసారా !

మారుతి సుజుకి నుంచి రానున్న కొత్త ఎస్-క్రాస్ ప్లస్ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్

ఇంటీరియర్స్‌లో కాంట్రాస్ట్ స్టిచింగ్‌తో పాటు కొత్త అప్‌హోలెస్ట్రీ వంటి కొన్ని సూక్ష్మమైన మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్‌లో చేసిన అన్ని మార్పుల వివరాలు విడుదల సమయంలో తెలిసే అకాశం ఉంది.

మారుతి సుజుకి ఎస్-క్రాస్ ప్లస్ వేరియంట్‌లో కొద్దిపాటి కాస్మెటిక్ మార్పులు మరియు అదనపు ఫీచర్లు మినహా ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ మాత్రం స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉండే అవకాశం ఉంది.

మారుతి సుజుకి నుంచి రానున్న కొత్త ఎస్-క్రాస్ ప్లస్ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్

కాగా, కొత్త 2020 మారుతి సుజుకి ఎస్-క్రాస్ మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది (సిగ్మా, డెల్టా, జీటా మరియు ఆల్ఫా). సిగ్మా వేరియంట్ మినహా మిగిలిన అన్ని వేరియంట్లు ఆప్షనల్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో వీటి ధరలు రూ.8.39 నుంచి రూ.12.39 లక్షల మధ్యలో ఉన్నాయి (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

MOST READ:బ్రతుకు తెరువుకోసం కొన్న రిక్షా స్వాధీనం చేసుకున్న అధికారులు.. తర్వాత ఏం జరిగిందంటే ?

మారుతి సుజుకి నుంచి రానున్న కొత్త ఎస్-క్రాస్ ప్లస్ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్

మారుతి సుజుకి ఎస్-క్రాస్ కారులో బిఎస్6 మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో (ఎస్‌హెచ్‌విఎస్) కూడిన 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 104 బిహెచ్‌పి పవర్‌ను మరియు 138 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది స్టాండర్డ్ ఫైవ్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. కంపెనీ ఇందులో ఆప్షనల్ ఫోర్-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కూడా కలిగి ఉంటుంది.

మారుతి సుజుకి నుంచి రానున్న కొత్త ఎస్-క్రాస్ ప్లస్ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్

కొత్త 2020 ఎస్-క్రాస్‌లో ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్స్, టెయిల్ లాంప్స్, డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్ విత్ ఇబిడి మరియు రియర్ పార్కింగ్ కెమెరా, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, కీలెస్ ఎంట్రీ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:ఆర్టిస్ట్ చేసిన బస్ నమూనాకు KSRTC ఫిదా, తర్వాత ఏం జరిగిందో తెలుసా?

మారుతి సుజుకి నుంచి రానున్న కొత్త ఎస్-క్రాస్ ప్లస్ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్

ఎస్-క్రాస్ క్రాసోవర్ మొత్తం ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది (నెక్సా బ్లూ, కెఫిన్ బ్రౌన్, గ్రానైట్ గ్రే, పెరల్ ఆర్కిటిక్ వైట్ మరియు ప్రీమియం సిల్వర్). ఎస్-క్రాస్ క్రాసోవర్ మోడల్‌ను మారుతి సుజుకి బ్రాండ్ యొక్క ప్రీమియం నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా ప్రత్యేకంగా విక్రయిస్తున్నారు.

మారుతి సుజుకి నుంచి రానున్న కొత్త ఎస్-క్రాస్ ప్లస్ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్

మారుతి సుజుకి ప్రకారం, కొత్త ఎస్-క్రాస్ క్రాసోవర్ మార్కెట్లో కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా మరియు నిస్సాన్ కిక్స్ వంటి మిడ్-సైజ్ ఎస్‌యూవీలతో పోటీ పడుతుంది.

మారుతి సుజుకి ఎస్-క్రాస్ ప్లస్ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

దేశంలో కొనసాగుతున్న పండుగ సీజన్ మార్కెట్ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు మారుతి సుజుకి ఇండియా ఓ కొత్త వేరియంట్ ఎస్-క్రాస్ మోడల్‌తో సిద్ధమవుతోంది. ఈ కొత్త వేరియంట్ ద్వారా కంపెనీ అమ్మకాలను పెంచుకోవాలని చూస్తోంది.

MOST READ:20 ఏళ్ళ బి.టెక్ అమ్మాయి ప్రాణం తీసిన గో-కార్టింగ్‌ సరదా.. ఎలాగో తెలుసా ?

Most Read Articles

English summary
Maruti Suzuki will be launching a new special-edition variant of the S-Cross called the 'Plus' variant in the Indian market. The new limited-edition will go on sale from October 11, 2020, in the country. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X