Just In
- 12 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 13 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 13 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 15 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- Lifestyle
ఆదివారం దినఫలాలు : వ్యాపారులు ఈరోజు తమ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మారుతి వ్యాగన్ఆర్ సిఎన్‌జికి పెరుగుతున్న డిమాండ్; అప్పుడే 3 లక్షల యూనిట్లు..
మారుతి సుజుకి అందిస్తున్న టాల్-బాయ్ కార్ "వాగన్ఆర్"లో సిఎన్‌జి వెర్షన్ మోడల్ ఓ కొత్త మైలురాయిని చేరుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. సిఎన్‌జి పవర్డ్ వ్యాగన్ఆర్ ఉత్పత్తిని ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకూ 3 లక్షల యూనిట్లను తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది. అంతేకాకుండా, ఇది దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన సిఎన్‌జి వాహనంగా కూడా నిలిచింది.

సిఎన్‌జి ఇంధనంతో నడిచే వాహనాల్లో అత్యంత ప్రియమైన వాహనంగా మారుతి సుజుకి వాగన్ఆర్ నిలిచింది. మూడు లక్షల యూనిట్ల ఉత్పత్తిని అధిగమించిన ఈ మోడల్, సిఎన్‌జి ప్యాసింజర్ వాహన విభాగంలో అత్యంత విజయవంతమైన కారుగా మారింది.

మొత్తంగా చూసుకుంటే, మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (పెట్రోల్, సిఎన్‌జి రెండూ కలిపి) భారతదేశంలో మొట్టమొదటిసారిగా విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకూ కంపెనీ మొత్తం 24 లక్షల యూనిట్లను విక్రయించింది.

బోల్డ్ డిజైన్, విశాలమైన క్యాబిన్ స్పేస్, మెరుగైన సీటింగ్ మరియు అధిక యుటిలిటీ వంటి అంశాల దృష్ట్యా 24 శాతం మంది కస్టమర్లు తిరిగి వ్యాగన్ఆర్ కారునే ఎంచుకున్నట్లు కంపెనీ తెలిపింది. మారుతి సుజుకి ప్రస్తుతం ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌ను వ్యాగన్ఆర్‌తో పాటుగా ఆల్టో, ఈకో మరియు ఎర్టిగా వంటి వాహనాల్లో అందిస్తోంది.

మారుతి వాగన్ఆర్ సిఎన్‌జి వేరియంట్‌లో 1.0-లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 5500 ఆర్‌పిఎమ్ వద్ద 58 బిహెచ్‌పి పవర్‌ను మరియు 3500ఆర్‌పిఎమ్ వద్ద 78 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.
MOST READ:ఒక్క క్షణం ఆలస్యం అయ్యుంటే ఈ బైక్ రైడర్ ఏమయ్యేవాడు ; కావాలంటే వీడియో చూడండి

మారుతి సుజుకి ఎస్-సిఎన్‌జి కార్లు ఇంటెలిజెంట్ ఇంజెక్షన్ సిస్టమ్‌తో డ్యూయెల్ ఇంటర్ డిపెండెంట్ ఈసియుతో లభిస్తాయి. ఇది అన్ని భూభాగాల్లో అధిక ఇంధన సామర్థ్యంతో పాటు మెరుగైన మరియు స్థిరమైన పనితీరును అందించడంలో సహకరిస్తుంది.

వ్యాగన్ఆర్ కారును 5వ తరం హార్టెక్ ప్లాట్‌ఫారమ్‌పై ఇంజనీరింగ్ చేయబడి, నిర్మించబడినది. ఈ ప్లాట్‌ఫామ్ కారులోని ప్రయాణీకుల సేఫ్టీని పెంచడానికి క్రాష్ ఎనర్జీని సమర్థవంతంగా గ్రహించి, మెరుగైన స్థిరత్వానికి భరోసా ఇస్తుందని కంపెనీ తెలిపింది.
MOST READ:మరో వాహనాన్ని కాఫీ కొట్టిన చైనా కంపెనీ.. ఈ సారి ఏ వాహనంలో తెలుసా ?

మారుతి సుజికి వ్యాగన్ఆర్ కారులో డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్, ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)తో కూడిన ఏబిఎస్ (యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఫ్రంట్ సీట్ బెల్ట్స్ రిమైండర్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్స్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి.

మారుతి వ్యాగన్ఆర్ సిఎన్‌జి వేరియంట్ ఉత్పత్తి మైలురాయి గురించి మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, "మారుతి సుజుకి వ్యాగన్ఆర్ దాదాపు రెండు దశాబ్దాలుగా భారతదేశంలోని టాప్ 10 కార్లలో నిరంతరం కనిపిస్తూ, ఈ విభాగంలో తిరుగులేని మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోంది. వ్యాగన్ఆర్ గడచిన 1999 నుండి ఇప్పటి వరకూ 24 లక్షలకు పైగా సంతోషకరమైన కస్టమర్లను దక్కించుకుంది. వారిలో దాదాపు సగం మందికి ఇదే మొదటి కారు. మారుతి సుజుకి నుండి వచ్చిన ఐకానిక్ కారు 2000 సంవత్సరం నుండి భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 కార్లలో ఒకటిగా కొనసాగుతోంద"ని అన్నారు.
MOST READ:దేవెగౌడకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఖరీదైన లగ్జరీ కార్, ఇదే.. చూసారా ?

"వ్యాగన్ఆర్ ఎస్-సిఎన్‌జి 3 లక్షల అమ్మకాల మైలురాయి మా విశ్వసనీయ కస్టమర్లు మాపై ఉంచిన అపారమైన విశ్వాసానికి మరో నిదర్శనం. మారుతి సుజుకి తన వినియోగదారులకు సస్టైనబల్ మొబిలిటీ ఆప్షన్లను అందించడానికి నిరంతరం కృషి చేసింది. వ్యాగన్ఆర్ ఎస్-సిఎన్‌జిని భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన సిఎన్‌జి ఇంధన కారుగా మార్చడంలో సహకరించిన మా విశ్వసనీయ కస్టమర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాల తెలియజేసేస్తున్నాని" అన్నారు.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సిఎన్‌జి మైలురాయిపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఈ విభాగంలో దేశీయ మార్కెట్లో లభిస్తున్న ఇతర ట్రెడిషనల్ హ్యాచ్‌బ్యాక్ మోడళ్లతో పోలిస్తే అది పొడవైన రైడింగ్ వైఖరి, విశాలమైన క్యాబిన్ స్పేస్ మరియు మెరుగైన ప్రాక్టికాలిటీలను అందిస్తుంది. ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌తో లభించే మారుతి సుజుకి వ్యాగన్ఆర్ పెట్రోల్ లేదా డీజిల్‌తో నడిచే వాహనాల కంటే అధిక మైలేజీస్తూ, వినియోగదారులకు డబ్బును ఆదా చేస్తుంది. ఇది కూడా ఈ మోడల్ విజయానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.