Just In
Don't Miss
- Movies
HIT2 అప్డేట్.. ప్రాజెక్ట్ నుంచి విశ్వక్ సేన్ అవుట్!.. కొత్త హీరో ఎవరంటే?
- News
ఆ తపన ఉన్నా శరీరం సహకరించలేదు: చిన్నప్పుడు చీరాలలో: ఆ యుద్ధ విద్యలకు ప్రోత్సాహం: పవన్
- Finance
కోవిడ్ క్లెయిమ్స్ రూ.9,000 కోట్లు, హెల్త్ పాలసీవే రూ.7,100 కోట్లు
- Sports
హైదరాబాద్‌లోనూ ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించండి.. బీసీసీఐకి కేటీఆర్ రిక్వెస్ట్!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టెస్టింగ్ దశంలో మారుతి సుజుకి ఎక్స్ఎల్5 - ఇది పొడగించిన వ్యాగన్ఆర్‌లా ఉందే!
మారుతి సుజుకి తమ నెక్సా సిరీస్‌లో అందిస్తున్న ఎక్స్ఎల్6 ప్రీమియం ఎస్‌యూవీ మాదిరిగానే అందులో ఓ ప్రీమియం వెర్షన్ కాంపాక్ట్ ప్రీమియం ఎస్‌యూవీపై మారుతి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మారుతి సుజుకి ఎక్స్ఎల్6 అనే కోడ్‌నేమ్‌తో పిలువబడే ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంబంధించిన కొన్ని వివరాలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.

భారత మార్కెట్ కోసం తయారు చేస్తున్న ఈ ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం మారుతి సుజుకి తమ పాపులర్ వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకోనుంది. మారుతి సుజుకి ఇప్పటికే తమ ఎక్స్ఎల్5 వాహనాన్ని భారత రోడ్లపై విస్తృతంగా టెస్ట్ చేస్తోంది. వాస్తవానికి ఈ వ్యాగన్ఆర్ యొక్క ప్రీమియం వెర్షన్‌ను కంపెనీ త్వరలో విడుదల చేయాల్సి ఉంది, కాని కోవిడ్-19 మహమ్మారి కారణంగా, దానిని వాయిదా వేయవలసి వచ్చింది.

తాజాగా అభినవ్ భట్ యూజర్ తన యూట్యూబ్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం, ఎక్స్ఎల్5 కాంపాక్ట్ ఎస్‌యూవీని ఢిల్లీ-ఎన్‌సీఆర్ వీధుల్లో టెస్టింగ్ చేస్తుండటాన్ని చూడొచ్చు. ఈ వీడియోలో చూసినట్లుగా, ఎక్స్ఎల్5 వాహన వివరాలు బయటకు రాకుండా ఉండేలా, ఈ టెస్టింగ్ వాహనాన్ని భారీగా క్యామోఫ్లేజ్ చేశారు. దీనిని ఓవరాల్ డిజైన్ సిల్హౌట్‌ను గమనిస్తే, ఇది పొడగించిన మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారులా అనిపిస్తుంది.
MOST READ:కరోనా నివారణ కోసం మరో కొత్త చర్య తీసుకుంటున్న జగన్ ప్రభుత్వం ; అదేంటో తెలుసా

మారుతి సుజుకి ఎక్స్‌ఎల్5 ముందు భాగంలో, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, ఫ్రంట్ బంపర్‌పై ట్వీక్డ్ ఎయిర్ డ్యామ్, ఇరువైపులా ఫాగ్‌ల్యాంప్స్‌తో కూడిన సొగసైన గ్రిల్ వంటి మార్పులు ఇందులో ఉన్నాయి. కారు వెనుక భాగంలో కొన్ని మార్పులు చేయబడ్డాయి, నిలువుగా పేర్చబడిన టెయిల్ లైట్స్, ట్వీక్ చేయబడిన బంపర్స్ వంటివి సాధారణ వ్యాగన్ఆర్ కంటే కొంచెం భిన్నంగా కనిపిస్తాయి. ఎక్స్ఎల్5 కూడా 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మీద నడుస్తున్నట్లు కనిపిస్తుంది.

ఇక లోపలి భాగంలో, మారుతి సుజుకి ఎక్స్‌ఎల్5లో కూడా స్టాండర్డ్ వ్యాగన్ఆర్ కారులో కనిపించే విధంగానే క్యాబిన్ డిజైన్ లేఅవుట్ ఉండే అవకాశం ఉంది. ఎక్స్‌ఎల్ 5 పొందబోయే కొన్ని కొత్త ఫీచర్లలో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఎయిర్ కండిషనింగ్ యూనిట్, 7.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో పాటుగా మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు ఉండొచ్చని అంచనా. మారుతి ఎక్స్‌ఎల్5 మోడల్‌ను కూడా ఎక్స్ఎల్6 మాదిరిగానే బ్రాండ్ యొక్క ప్రీమియం నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా ప్రత్యేకంగా విక్రియించే ఆస్కారం ఉంది.
MOST READ:భారీ ఆఫర్లను ప్రకటించిన మారుతి సుజుకి ; దేనిపై ఎంతెంతో తెలుసా ?

ఇందులోని ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, కొత్త మారుతి ఎక్స్‌ఎల్5 కారులో అదే బిఎస్6 కంప్లైంట్ 1.2-లీటర్ కె12బి పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇదే ఇంజన్‌ను వ్యాగన్ఆర్ కారులో ఉపయోగిస్తున్నారు. వ్యాగన్ఆర్ కారులోని ఈ ఇంజన్ 82 బిహెచ్‌పి శక్తి మరియు 114 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆప్షనల్ ఏజిఎస్ (ఆటో గేర్ షిఫ్ట్) ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పాటుగా స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో కూడా లభిస్తుంది.

మారుతి సుజుకి ఎక్స్ఎల్5 టెస్టింగ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
మారుతి సుజుకి ఎక్స్‌ఎల్5ను స్టాండర్డ్ వ్యాగన్ఆర్‌కు ప్రీమియం వెర్షన్‌గా పరిచయం చేసి విక్రయించనున్నారు, ఈ మోడల్ మార్కెట్లో విడుదలైతే ఇది ఈ సెగ్మెంట్లోని మారుతి ఇగ్నిస్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మరియు ఫోర్డ్ ఫిగో మరియు ఫ్రీస్టైల్ వంటి ప్రీమియం మోడళ్లతో పోటీ పడే అవకాశం ఉంది. ఇది వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల కావచ్చని అంచనా.
Image Courtesy: Abhinav Bhatt/YouTube
MOST READ: మళ్ళీ పడిపోయిన పెట్రోల్ - డీజిల్ అమ్మకాలు ; ఎందుకంటే ?