మారుతి సుజుకి జిమ్మీ భారతీయ అరంగేట్రం చేయనుందా..?

దేశీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన మారుతి సుజుకి జిమ్ని భారత దేశంలో లాంచ్ చేయబోయే ప్రముఖ ఎస్‌యూవీలలో ఒకటి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రశంసలు అందుకున్న సుజుకి జిమ్ని మినీ ఎస్‌యూవీని భారత్‌లో విడుదల చేయనున్నట్లు నివేదికలు వెలువడ్డాయి. ఈ కొత్త సుజుకి కారు గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

మారుతి సుజుకి జిమ్మీ భారతీయ అరంగేట్రం చేయనుందా..?

సుజుకి జిమ్మీ ఎస్‌యూవీ కోసం భారతదేశంలో చాలామంది వినియోగదారులు అధిక సంఖ్యలో వేచి ఉన్నారు. కానీ మారుతి సుజుకి ఆఫ్ రోడ్ వినియోగదారులకి షాకింగ్ న్యూస్ ఇచ్చింది. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, సుజుకి జిమ్నీని భారతదేశంలో విడుదల చేయలేదని ప్రకటించారు.

మారుతి సుజుకి జిమ్మీ భారతీయ అరంగేట్రం చేయనుందా..?

భారతదేశంలో జరిగిన అధ్యయనాల ప్రకారం దీని మీద ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. భారతదేశంలో లాంచ్ చేస్తే మారుతి సుజుకి గుర్గావ్ ఆధారిత యూనిట్, జిమ్ని ఎస్‌యూవీ తయారు చేయబడుతుంది. జిమ్నీ ఎస్‌యూవీని హెర్టెక్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా బ్రెజా, ఎస్-క్రాస్, ఎకో మరియు క్యారీ వంటి ఇతర ఎస్‌యూవీలతో కూడా తయారు చేయవచ్చు.

మారుతి సుజుకి జిమ్మీ భారతీయ అరంగేట్రం చేయనుందా..?

ఈ లోపు జపాన్‌లో జిమ్మీ ఎస్‌యూవీ కోసం వేచి ఉండాల్సిన సమయం 1.5 సంవత్సరాలకు పొడిగించబడింది. కొత్త జిమ్నీ జపాన్ లో సియెర్రా మరియు స్టాండర్డ్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. జపాన్‌లో జిమ్ని ఎస్‌యూవీకి డిమాండ్ ఎక్కువగా ఉంది. కరోనా వైరస్ సంక్రమణ కారణంగా సుజుకి జిమ్మీ వెయిటింగ్ పీరియడ్ మరికొంత కాలం పెరిగింది.

మారుతి సుజుకి జిమ్మీ భారతీయ అరంగేట్రం చేయనుందా..?

ఈ మినీ ఎస్‌యూవీని ప్రపంచవ్యాప్తంగా 2018 లో ఆవిష్కరించారు. మినీ ఎస్‌యూవీ 2019 సంవత్సరపు ప్రతిష్టాత్మక ప్రపంచ రికార్డ్ గెలుచుకుంది. మారుతి సుజుకి జిమ్ని అంతర్జాతీయంగా వినియోగదారుల ప్రశంసలను పొందడంలో విజయవంతమైంది. మారుతి సుజుకి జిమ్ని 2020 ఆటో ఎక్స్‌పోలో చాలా మంది ప్రజల దృష్టిని ఆకర్శించింది.

మారుతి సుజుకి జిమ్మీ భారతీయ అరంగేట్రం చేయనుందా..?

ఈ జిమ్మీ ఎస్‌యూవీని భారత్‌లో విడుదల చేయడంపై కంపెనీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ ఆటో ఎక్స్‌పో కస్టమర్ల నుండి సానుకూల స్పందన ఉన్నందున, ఇది భారతదేశంలో ప్రారంభించాలని నిర్ణయించింది. కొత్త జిమ్మీ ల్యాడెర్ ఫ్రేమ్ చట్రం ఆధారంగా ఉంటుంది. జిమ్మీకి పార్ట్‌టైమ్ 4 డబ్ల్యుడి సెటప్ ఉంది. దీన్ని 2 హెచ్ / 4 డబ్ల్యు హై / 4 డబ్ల్యు లో గా మార్చవచ్చు.

మారుతి సుజుకి జిమ్మీ భారతీయ అరంగేట్రం చేయనుందా..?

ఈ మినీ ఎస్‌యూవీలో 3 లింక్ యాక్సిల్ సస్పెన్షన్ ఉంటుంది. ఇది కఠినమైన భూభాగంలో కూడా సజావుగా నావిగేట్ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మినీ ఎస్‌యూవీకి 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ అమర్చారు.

మారుతి సుజుకి జిమ్మీ భారతీయ అరంగేట్రం చేయనుందా..?

ఇంజిన్ 5 స్పీడ్ లేదా 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ మినీ ఎస్‌యూవీ డీజిల్ లేదా హైబ్రిడ్ ఆప్షన్లలో విడుదల కాలేదు. భారతదేశంలో విడుదల చేస్తే ఈ జిమ్మీ ఎస్‌యూవీ 33 సంవత్సరాల పాటు దేశంలో విక్రయించిన ప్రసిద్ధ జిప్సీ ఎస్‌యూవీకి వారసురాలు అవుతుంది. ఏది ఏమైనా దీనికోసం ఎక్కువమంది వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. కాబట్టి భవిష్యత్ లో విడుదలయ్యే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, May 21, 2020, 10:28 [IST]
English summary
Maruti Suzuki Jimny SUV India Launch Not Finalized. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+