డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త 2020 మారుతి సుజుకి ఎస్-క్రాస్

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ నుంచి మార్కెట్లోకి రానున్న తాజా ఉత్పత్తి '2020 ఎస్-క్రాస్'. నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా ప్రత్యేకంగా విక్రయించబడుతున్న ఈ మోడల్‌లో కంపెనీ కొత్త అప్‌డేటెడ్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ కారు డీలర్‌షిప్ కేంద్రాలను చేరుకుంటోంది. ఆగస్ట్ 5న ఈ కారు మార్కెట్లో విడుదల కానుంది.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త 2020 మారుతి సుజుకి ఎస్-క్రాస్

కొత్త 2020 మారుతి సుజుకి ఎస్-క్రాస్ బిఎస్6 మోడల్ ఇకపై కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభ్యం కానుంది. బిఎస్4 మోడళ్లలో ఉపయోగించిన డీజిల్ ఇంజన్‌ను కంపెనీ నిలిపివేసింది. నెక్సా డీలర్‌షిప్ కేంద్రాల్లో కొత్త ఎస్-క్రాస్ క్రాసోవర్ కోసం బుకింగ్‌లను కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కస్టమర్లు రూ.11,000 టోకెన్ అమౌంట్‌తో ఈ మోడల్‌ను బుక్ చేసుకోవచ్చు.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త 2020 మారుతి సుజుకి ఎస్-క్రాస్

గాడివాడి నుంచి వచ్చిన తాజా చిత్రాలను గమనిస్తే, మారుతి సుజుకి 2020 ఎస్-క్రాస్‌ను ఇప్పటికే డీలర్‌షిప్ స్టాక్ యార్డ్‌లకు చేరుకుంది. కొత్త ఎస్-క్రాస్ మొత్తం ఏడు వేరియంట్లలో లభ్యం కానుంది. వీటిలో నాలుగు మ్యాన్యువల్ మూడు ఆటోమేటిక్ వేరియంట్లు ఉన్నాయి. అవి - సిగ్మా, డెల్టా, జెటా, ఆల్ఫా, డెల్టా ఏటి, జెటా ఏటి మరియు ఆల్ఫా ఏటి.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త 2020 మారుతి సుజుకి ఎస్-క్రాస్

కొత్త 2020 ఎస్-క్రాస్ ఐదు కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. అవి - బ్లూ, బ్రౌన్, గ్రే, వైట్, సిల్వర్. కొత్త బిఎస్6 2020 మారుతి సుజుకి ఎస్-క్రాస్ క్రాసోవర్‌లో సుజుకి నుండి పాపులర్ అయిన 1.5-లీటర్ ‘ఎస్‌హెచ్‌విఎస్' స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ 1.5 లీటర్, ఫోర్ సిలిండర్, మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 104 బిహెచ్‌పి శక్తిని మరియు 138 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త 2020 మారుతి సుజుకి ఎస్-క్రాస్

ఈ ఇంజన్ స్టాండర్డ్ ఫైవ్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉండొచ్చని సమాచారం. ఈ కొత్త మోడల్ విడుదల సమయంలో కంపెనీ హై-స్పెక్ వేరియంట్‌లపై ఆప్షనల్ ఫోర్-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ఆఫర్ చేయవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త 2020 మారుతి సుజుకి ఎస్-క్రాస్

ప్రస్తుతం మారుతి సుజుకి విక్రయిస్తున్న ఎర్టిగా, సియాజ్ మరియు విటారా బ్రెజ్జా కాంపాక్ట్-ఎస్‌యూవీ వంటి ఇతర మోడళ్లలో కూడా కంపెనీ ఈ అధునాతన ఇంజన్‌ను ఆఫర్ చేస్తోంది. బిఎస్4 మోడళ్లలో ఉపయోగించిన ఇంజన్లను నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించినందున, ప్రస్తుతానికి ఎస్-క్రాస్ కేవలం పెట్రోల్ ఇంజన్‌తోనే లభ్యం కానుంది, ఇందులో డీజిల్ ఇంజన్ ఉండదు.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త 2020 మారుతి సుజుకి ఎస్-క్రాస్

కొత్త 2020 మారుతి సుజుకి ఎస్-క్రాస్ క్రాసోవర్ ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్లలో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేశారు. ఎక్స్‌టీరియర్ మార్పులలో రీడిజైన్ చేసిన ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్, అల్లాయ్ వీల్స్ వంటి వాటిని గమనించవచ్చు. అయితే, ఓవరాల్ డిజైన్ మరియు సిల్హౌట్ మాత్రం ఇదివరకటిలానే ఉంటుంది.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త 2020 మారుతి సుజుకి ఎస్-క్రాస్

ఈ ప్రీమియం క్రాసోవర్ ఇంటీరియర్‌లో చేసిన మార్పుల విషయానికి వస్తే ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే మరియు వాయిస్ కమాండ్స్‌ను సపోర్ట్ చేసే సరికొత్త స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఇంకా కొత్త 2020 ఎస్-క్రాస్ కారులోని అప్‌హోలెస్ట్రీని కూడా అప్‌గ్రేడ్ చేయనున్నారు, ఇది కారుకి మరింత ప్రీమియం లుక్ అండ్ ఫీల్‌ని ఆఫర్ చేయనుంది.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త 2020 మారుతి సుజుకి ఎస్-క్రాస్

2020 మారుతి సుజుకి ఎస్-క్రాస్ బిఎస్6 క్రాసోవర్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కొత్తగా వస్తున్న అధునాతన పెట్రోల్ ఇంజన్‌తో మారుతి సుజుకి ఎస్-క్రాస్ మరింత ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించే అవకాశం ఉంది. మారుతి సుజుకి తమ బిఎస్4 వెర్షన్ ఎస్-క్రాస్ కారును రూ.8.80 లక్షల నుండి రూ.11.43 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్యలో విక్రయించింది. ఈ నేపథ్యంలో, కొత్త బిఎస్6 ఎస్-క్రాస్ ధరలు కూడా అదే రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

Source: Gaadiwaadi

More from DriveSpark

Article Published On: Tuesday, August 4, 2020, 11:58 [IST]
English summary
Maruti Suzuki's premium dealership chain, Nexa, will be receiving a new model soon in the market. It will be the BS6 iteration of the S-Cross crossover hatchback that is expected to launch in the coming days. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+