ఇండియన్ మార్కెట్లో మెర్సిడెస్ ఎఎమ్‌జి జిఎల్‌ఇ 53 లాంచ్ : ధర & ఇతర వివరాలు
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ తన కొత్త మెర్సిడెస్ ఎఎమ్‌జి జిఎల్‌ఇ 53 కూపేను భారత మార్కెట్లో విడుదల చేశారు. దీని ధర రూ. 1.20 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త మెర్సిడెస్ ఎఎమ్‌జి జిఎల్‌ఇ 53 కూపే చాలా మంచి ఫీచర్స్ తో పరిచయం చేయబడింది. కంపెనీ ఇప్పటికే ఈ కూపే బుకింగ్స్ ప్రారంభించింది. దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ బెంజ్ కార్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మెర్సిడెస్ ఎఎమ్‌జి జిఎల్‌ఇ 53 కూపే ఎక్స్టీరియర్స్ గమనించినట్లయితే,ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్‌ఈడీ టైల్లైట్, 12 వెర్టికల్ స్లాట్‌లతో 'పనామెరికానా గ్రిల్' సిగ్నేచర్ ఉంది. ఇది కూపే కారు కాబట్టి దీనికి స్లైడింగ్ రూఫ్ కూడా ఉంది. అంతే కాకుండా 21 ఇంచెస్ అల్లాయ్ వీల్ కలిగి ఉంది.

ఈ కారులో ఇంటిగ్రేటెడ్ బూట్ స్పాయిలర్, రియర్ డిఫ్యూజర్, కంపెనీ సిగ్నేచర్ ఎయిర్ డోమ్ మరియు 655 లీటర్ల బూట్ స్పేస్ ఉన్నాయి. కారు లోపల బ్లాక్ అండ్ రెడ్ టోన్‌లో స్పోర్టి సీట్లు ఇవ్వబడ్డాయి. ఇందులో త్రీ స్పోక్ స్పోర్టి స్టీరింగ్ వీల్, అల్యూమినియం ప్యాడిల్స్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి.

ఈ కొత్త లగ్జరీ కూపేలో 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫస్ట్ టైమ్ ఎఎమ్‌బిఎక్స్ సిస్టమ్, వాయిస్ అసిస్టెంట్, 13 స్పీకర్ సౌండ్ సిస్టమ్, క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రిక్ సన్‌బ్లైండ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఉన్నాయి.

మెర్సిడెస్ ఎఎమ్‌జి జిఎల్‌ఇ 53 కూపేలో 12.3 ఇంచెస్ వర్చువల్ కాక్‌పిట్, ఎఎమ్‌జి కూపే నాలుగు వేరియంట్లలో లభ్యం కానుంది. ఇందులో 9 ఎయిర్‌బ్యాగులు, బ్లైండ్ స్పాట్ అసిస్ట్, మ్యాజిక్ విజన్ కంట్రోల్, అడాప్టివ్ బీమ్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి.

జిఎల్‌ఇ 53 కూపేలో 3.0-లీటర్ ఇన్లైన్ ఎఎమ్‌జి ట్యూన్డ్ ఇంజన్ ఉంది. ఇది 429 బిహెచ్‌పి శక్తిని మరియు 520 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ కారు 48-వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. ఇది అవసరమైనప్పుడు అదనంగా 22 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ని అందిస్తుంది.

ఈ ఇంజిన్ టిసిటి 9 జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మరియు ఎఎమ్‌జి బేస్డ్ డ్రైవ్ ప్రోగ్రామ్‌తో అమర్చబడి ఉంటుంది. కూపే ఎస్‌యూవీలో ఎఎమ్‌జి బేస్డ్ డైనమిక్ సెలెక్టర్‌తో సహా ఏడు ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. ఈ కారు యొక్క గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు, ఈ కారు కేవలం 5.3 సెకన్లలో 0-100 కిలోమీటర్లు చేరుకోగలదు.

భారతదేశంలో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 6 మరియు పోర్స్చే కెఎన్ కూపే వంటి వాటికి ఈ మెర్సిడెస్ ఎఎమ్‌జి జిఎల్‌ఇ 53 కూపే ప్రత్యర్థిగా ఉంటుంది. కొత్త ఎఎమ్‌జి జిఎల్‌ఇ 53 కూపే డెలివరీలు త్వరలో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








