ఎ-క్లాస్ లిమోసిన్ బుకింగ్స్ ప్రారంభించిన మెర్సిడెస్ బెంజ్

జర్మన్ బ్రాండ్ అయిన మెర్సిడెస్ బెంజ్ భారతదేశంలో అత్యంత విలాసవంతమైన మరియు లగ్జరీ కార్లలో ఒకటి. ఇటీవల కాలంలో ఇండియన్ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ యొక్క ఎ-క్లాస్ సెడాన్ లాంచ్ అయింది. ఇప్పుడు బెంజ్ ఎ-క్లాస్ సెడాన్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త మెర్సిడెస్ బెంజ్ యొక్క ఎ-క్లాస్ లిమోసిన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

ఎ-క్లాస్ లిమోసిన్ బుకింగ్స్ ప్రారంభించిన మెర్సిడెస్ బెంజ్

మెర్సిడెస్ బెంజ్ ఇండియా తమ కొత్త ఎంట్రీ లెవల్ సెడాన్, ఎ-క్లాస్ లిమోసిన్ కోసం మార్కెట్లో బుకింగ్ ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించింది. కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఇప్పుడు దేశంలో రూ. 2 లక్షలకు బుకింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించబడింది.

ఎ-క్లాస్ లిమోసిన్ బుకింగ్స్ ప్రారంభించిన మెర్సిడెస్ బెంజ్

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులో ఉంది. ఇటీవల ముగిసిన ఆటో ఎక్స్‌పో 2020 లో సెడాన్ భారతదేశంలో అడుగుపెట్టింది.

ఎ-క్లాస్ లిమోసిన్ బుకింగ్స్ ప్రారంభించిన మెర్సిడెస్ బెంజ్

కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఇంజిన్ ఆధారంగా మూడు వేరియంట్ పరిధిలో అందించబడుతుంది. ఇందులో ఎఎంజి ట్రిమ్ కూడా ఉంది. ఎ-క్లాస్ లిమోసిన్ లోని మూడు ఇంజన్లు భారతదేశం యొక్క తాజా బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తయారుచేయబడి ఉంటాయి.

ఎ-క్లాస్ లిమోసిన్ బుకింగ్స్ ప్రారంభించిన మెర్సిడెస్ బెంజ్

ఎ - క్లాస్ సెడాన్ వెలుపల మరియు లోపల అనేక ఫీచర్స్ ని కలిగి ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లు, ఎల్‌ఇడి టైల్లైట్స్, వేరియంట్‌ను బట్టి 16 అంగుళాల నుంచి 19 అంగుళాల వరకు ఉండే స్టైలిష్ లుకింగ్ అల్లాయ్ వీల్స్, స్లొపింగ్ కూపే లాంటి రూఫ్‌లైన్ మరియు ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్‌లతో సొగసైన ఓఆర్‌విఎంలు ఇందులో ఉన్నాయి

ఎ-క్లాస్ లిమోసిన్ బుకింగ్స్ ప్రారంభించిన మెర్సిడెస్ బెంజ్

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ లో పుల్లీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రోటర్ లాంటి డిజైన్‌తో సిగ్నేచర్ క్రోమ్ ఎసి వెంట్స్, పియానో-బ్లాక్ ఫినిషింగ్ డాష్‌బోర్డ్ మరియు సెంటర్ కన్సోల్ మరియు మౌంటెడ్ కంట్రోల్స్‌తో లెదర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ ఉన్నాయి.

ఎ-క్లాస్ లిమోసిన్ బుకింగ్స్ ప్రారంభించిన మెర్సిడెస్ బెంజ్

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ భారతీయ మార్కెట్ కోసం జర్మన్ బ్రాండ్ నుంచి వచ్చిన చాలా వాహనాలలో ఇది ఒకటి. రాబోయే 12 నెలల్లో భారతదేశంలో 10 కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ లాంచ్‌లలో మొదటిది గత నెలలో ప్రవేశపెట్టిన జిఎల్‌ఇ ఎల్‌డబ్ల్యుబి ఎస్‌యువి, ఎ-క్లాస్ లిమోసిన్ రెండవ స్థానంలో ఉంది.

ఎ-క్లాస్ లిమోసిన్ బుకింగ్స్ ప్రారంభించిన మెర్సిడెస్ బెంజ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ఇప్పటికే ప్రపంచ మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి. చివరకు 2020 లో భారతదేశంలో అడుగుపెట్టింది. మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ జర్మన్ బ్రాండ్ నుండి వచ్చిన మరో కొత్త సెడాన్.

Most Read Articles

English summary
New Mercedes-Benz A-Class Sedan Bookings Open In India: Launch Expected In The Coming Months. Read in Telugu.
Story first published: Thursday, February 27, 2020, 13:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X