మెర్సిడెస్ బెంజ్ నుంచి రానున్న మరో కొత్త కార్.. ఇదే

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ అయిన మెర్సిడెస్ బెంజ్ భారతదేశంలో ఇప్పటికే చాలా వాహనాలను విడుదల చేసింది. ఇప్పుడు బెంజ్ సంస్థ తన బ్రాండ్ నుంచి రాబోయే కొత్త కార్ యొక్క టీసర్ ని విడుదల చేసింది. 2020 లో రాబోయే ఈ కొత్త బెంజ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. !

మెర్సిడెస్ బెంజ్ నుంచి రానున్న మరో కొత్త కార్.. ఇదే

మెర్సిడెస్ బెంజ్ రాబోయే బెంజ్ ఇ క్లాస్ యొక్క టీజర్‌ను విడుదల చేసింది. ఈ కొత్త బెంజ్ చాలా అప్డేటెడ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ కొత్త మెర్సిడెస్ బెంజ్ ఇ క్లాస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్లో షార్పర్ హెడ్‌ల్యాంప్స్, ఐబ్రో షేప్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌ కలిగి ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ నుంచి రానున్న మరో కొత్త కార్.. ఇదే

వాహనం యొక్క సైడ్ ప్రొఫైల్ మునుపటి మోడల్ లాగనే ఉంటుందని భావిస్తున్నారు. వాహనం వెనుక భాగంలో పునఃరూపకల్పన చేసిన ఎల్‌ఇడి టెయిల్ లాంప్స్ ఉన్నాయి, ఇవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ నుంచి రానున్న మరో కొత్త కార్.. ఇదే

కొత్త బెంజ్ కారు యొక్క ఇంటీరియర్స్ గురించి కంపెనీ ఎటువంటి సమాచారం వెల్లడించలేదు, అయితే ఇది ప్రస్తుత తరం మోడళ్ల ట్విన్ స్క్రీన్ లేఅవుట్ లాగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ నుంచి రానున్న మరో కొత్త కార్.. ఇదే

మెర్సిడెస్ బెంజ్ ఇ క్లాస్‌లో ఎమ్‌బియుఎక్స్ టెక్నాలజీ ఉండే అవకాశం ఉంటుంది. ఈ కొత్త మోడల్లో ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో చాలా అనుకూలంగా ఉంటాయి. అంతే కాకుండా 4 జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ మరియు హీటెడ్ సీట్లు మరియు ఎయిర్ సస్పెన్షన్ వంటివి కూడా ఉంటాయి.

మెర్సిడెస్ బెంజ్ నుంచి రానున్న మరో కొత్త కార్.. ఇదే

కొత్త మెర్సిడెస్ బెంజ్ లో భద్రత లక్షణాలను గమనించినట్లైతే ఇందులో ఎనిమిది ఎయిర్‌బ్యాగులు, ఎబిడి విత్ ఇబిడి, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, 360-డిగ్రీ కెమెరా మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ నుంచి రానున్న మరో కొత్త కార్.. ఇదే

మెర్సిడెస్ బెంజ్ ఇ క్లాస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్స్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలతో లభించనున్నాయి. ఈ రెండు ఇంజిన్లు హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో అందించబడతాయి. ప్రస్తుత తరం మెర్సిడెస్ ఇ క్లాస్ మోడల్స్ ఎక్కువగా అమ్ముడైన వాహనం. వీటి ధర రూ. 59.08 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల వరకు ఉంది.

మెర్సిడెస్ బెంజ్ నుంచి రానున్న మరో కొత్త కార్.. ఇదే

కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈ ఏడాది చివరికి భారతదేశంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. దీని ధర గురించి స్పష్టమైన సమాచారం లేనప్పటికీ, ఇ క్లాస్ మోడళ్ల ధర రూ. 66 లక్షల నుంచి 1.8 కోట్ల మధ్య ఉంటుందని ఆశించవచ్చు.

మెర్సిడెస్ బెంజ్ నుంచి రానున్న మరో కొత్త కార్.. ఇదే

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లోకి రానున్న కొత్త బెంచ్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మునుపటి మోడల్స్ కంటే కూడా ఇది చాలా అప్డేటెడ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ కొత్త బెంజ్ మునుపటి మోడల్స్ కంటే కూడా మంచి అమ్మకాలను సాదిస్తుందని ఆశించవచ్చు. ఎట్టకేలకు ఈ సంవత్సరం ఈ కార్ లాంచ్ అవుతున్నది కంపెనీ వర్గాలు తెలిపాయి.

Most Read Articles

English summary
Mercedes-Benz E Class Facelift Models To Launch In India This Year: Details And Expected Price. Read in Telugu.
Story first published: Monday, March 2, 2020, 10:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X