భారత్‌లో విడుదల కానున్న మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి 400

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ ఇండియా, భారత మార్కెట్ కోసం తమ మొట్టమొదటి ఫుల్ ఎలక్ట్రిక్ కారును పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కంపెనీ తమ పాపులర్ మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి 400 ఆల్-ఎలక్ట్రిక్ కారును మార్కెట్లో విడుదల చేయనుంది.

భారత్‌లో విడుదల కానున్న మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి 400

ఈ మేరకు మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఇప్పటికే తమ అధీకృత వెబ్‌సైట్‌లోని ప్రోడక్ట్ జాబితాలో ఈక్యూసి 400 మోడల్‌ను చేర్చింది. దీన్నిబట్టి చూస్తుంటే రానున్న వారాల్లో ఎప్పుడైనా ఈ బెంజ్ ఎలక్ట్రిక్ కారు భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారత్‌లో విడుదల కానున్న మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి 400

వాస్తవానికి మెర్సిడెస్ బెంజ్ ఇండియా తమ ఈక్యూసి 400 ఎస్‌యూవీ ఈ ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్లో విక్రయించాలని ప్లాన్ చేసింది. అయితే, దేశంలో విజృంభిస్తున్న కోవిడ్-19 మహమ్మారి, దాని ఫలితంగా వచ్చిన లాక్‌డౌన్, స్థంభించిన అంతర్జాతీయ రవాణా వంటి పలు సమస్యల కారణంగా మార్కెట్లో ఈ మోడల్ విడుదల మరింత ఆలస్యమైంది.

భారత్‌లో విడుదల కానున్న మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి 400

మెర్సిడెస్ బెంజ్ ఇండియా వెబ్‌సైట్‌లో ఈ కొత్త ఆల్-ఎలక్ట్రిక్ ఈక్యూసి 400 ఎస్‌యూవీకి సంబంధించిన ఓ చిన్న టీజర్ వీడియోను కంపెనీ విడుదల చేసింది. కూడా ఉంది. లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలో విడుదల కానున్న ఈక్యూసిలో కారుపై బ్యాడ్జింగ్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్‌తో పాటుగా కారులోని కొన్ని ఇంటీరియర్స్ ఫీచర్లను కంపెనీ ఈ టీజర్‌లో లీక్ చేసింది.

ఈ కొత్త కారు ఇంటీరియర్‌లలో ఉండబోయే కొన్ని ఫీచర్లు మరియు పరికరాలలో డ్యూయెల్ 10.3 ఇంచ్ డిస్‌ప్లేలు (ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం మరియు మరొకటి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం) ఉండనున్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్ సెటప్ బ్రాండ్ యొక్క సరికొత్త ఎమ్‌బియూఎక్స్ సిస్టమ్‌ను సపోర్ట్ చేయనుంది.

భారత్‌లో విడుదల కానున్న మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి 400

కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి 400 ఎస్‌యూవీలో 80 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్, రెండు ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చబడి ఉంటాయి. ప్రతి యాక్సిల్ వద్ద అమర్చిన రెండు ఎలక్ట్రిక్ మోటార్లు కలిపి గరిష్టంగా 405 బిహెచ్‌పి పవర్‌ని మరియు 765 ఎన్ఎమ్ టార్క్‌‌ని ఉత్పత్తి చేస్తాయి. పూర్తి ఛార్జ్‌పై ఈ కారు గరిష్టంగా 400 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ చెబుతోంది. ఇది ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.

భారత్‌లో విడుదల కానున్న మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి 400

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి గరిష్ట వేగాన్ని గంటకు 180 కిలోమీటర్లకు పరిమితం చేయబడి ఉంటుంది. ఇది కేవలం 5.1 సెకన్లలోనే గంటకు 0 - 100 కిమీ వేగాన్ని చేరుకోగలదు. ఇందులో స్టాండర్డ్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఫాస్ట్ ఛార్జర్ సాయంతో కేవలం 40 నిమిషాల్లోనే ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ బ్యాటరీని 0 - 80 శాతం వరకూ ఛార్జ్ చేసుకోవచ్చు.

భారత్‌లో విడుదల కానున్న మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి 400

మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్ కోసం ప్లాన్ చేసిన అనేక వాహనాల్లో ఒకటిగా ఈక్యూసి 400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రాబోయే నెలల్లోనే దేశీయ మార్కెట్లోకి ప్రవేశించనుంది. ఈ జర్మన్ బ్రాండ్ 2020 సంవత్సరం కోసం సరికొత్త అమ్మకాల వ్యూహాన్ని ప్రవేశపెట్టింది, ఇందులో భాగంగా కొత్త జిఎల్‌సి, జిఎల్‌ఈ, జిఎల్‌ఎస్ మరియు ఎఎమ్‌జి జిటి-ఆర్ వంటి అనేక ఉత్పత్తులను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. త్వరలోనే కొత్త సెడాన్‌ను కూడా ప్రవేశపెట్టడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

భారత్‌లో విడుదల కానున్న మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి 400

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి 400 ఎలక్ట్రిక్ కారుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి 400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లగ్జరీ ఎస్‌యూవీ విభాగంలో విడుదల కానుంది. కాబట్టి ఈ మోడల్‌కు నేరుగా ఎలాంటి ప్రత్యర్థులు ఉండబోరని తెలుస్తోంది. అయితే, ఒకవేళ ఆడి ఇండియా తమ ఈ-ట్రోన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని త్వరలో భారత మార్కెట్లో విడుదల చేసినట్లయితే, ఈ రెండు మోడళ్ల మద్య గట్టి పోటీ ఏర్పడే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, September 2, 2020, 12:08 [IST]
English summary
Mercedes-Benz is all set to bring in their first fully-electric offering in the Indian market, the EQC 400. Ahead of its launch, the Mercedes-Benz EQC 400 electric SUV has been listed on the company's official website, indicating that its launch will take place in the coming weeks/months. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+