భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి విడుదల ఎప్పుడంటే?

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్, భారత మార్కెట్‌లో తమ సరికొత్త పూర్తి ఎలక్ట్రిక్ కారు "ఈక్యూసి"ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా, ఇప్పుడు కంపెనీ తమ మొట్టమొదటి ఫుల్ ఎలక్ట్రిక్ కారు విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.

భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి విడుదల ఎప్పుడంటే?

భారత్‌లో తమ ఆల్-ఎలక్ట్రిక్ ఈక్యూసి వాహనాన్ని అక్టోబర్ 8, 2020వ తేదీన విడుదల చేయనున్నట్లు మెర్సిడెస్ బెంజ్ తెలిపింది. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కంపెనీ తమ పాపులర్ ఈక్యూసి ఆల్-ఎలక్ట్రిక్ కారును దేశీయ మార్కెట్లో విడుదల చేస్తోంది.

భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి విడుదల ఎప్పుడంటే?

వాస్తవానికి మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి ఎలక్ట్రిక్ కారు ఇప్పటికే భారత మార్కెట్లో విడుదల కావల్సి ఉంది. అయితే, దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా దీని విడుదల జాప్యమైంది. మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఇప్పటికే తమ అధీకృత వెబ్‌సైట్‌లోని ప్రోడక్ట్ జాబితాలో ఈక్యూసి మోడల్‌ను చేర్చింది.

MOST READ:సినీతారలను వెంబడించిన మీడియాపై విరుచుకుపడుతున్న పోలీసులు.. ఎందుకో తెలుసా ?

భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి విడుదల ఎప్పుడంటే?

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి భారత మార్కెట్లో విడుదలైనప్పుడు, ఇది దేశంలోనే మొట్టమొదటి లగ్జరీ ఫుల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా నిలుస్తుంది. ఈక్యూసి తన అండర్ పిన్నింగ్‌ను బ్రాండ్ యొక్క జిఎల్‌సి-ఎస్‌యూవీతో పంచుకుంటుంది మరియు అదే విధమైన డిజైన్‌ను కూడా కలిగి ఉంటుంది.

భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి విడుదల ఎప్పుడంటే?

లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలో విడుదల కానున్న ఈక్యూసిలో విశిష్టమైన స్టైలింగ్ డిజైన్స్ ఉంటాయి. ఇందులో ముందువైపు గ్రిల్ మధ్యలో ఉండే ఇల్యుమినేటెడ్ మెర్సిడెస్ బెంజ్ బ్యాడ్జింగ్, రెండు వైపులా ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్స్‌ను కలిపే ఎల్‌ఈడి స్ట్రిప్ మరియు ఎల్ఈడి టెయిల్ లైట్స్‌ వంటి డిజైన్ ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:2020 టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 రివ్యూ : పెర్ఫామెన్స్, ఫీచర్స్ & ఇతర వివరాలు

భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి విడుదల ఎప్పుడంటే?

ఈ కొత్త కారు ఇంటీరియర్‌లలో ఉండబోయే కొన్ని ఫీచర్లు మరియు పరికరాలలో డ్యూయెల్ 10.3 ఇంచ్ డిస్‌ప్లేలు (ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం మరియు మరొకటి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం) ఉండనున్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్ సెటప్ బ్రాండ్ యొక్క సరికొత్త ఎమ్‌బియూఎక్స్ సిస్టమ్‌ను సపోర్ట్ చేయనుంది.

భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి విడుదల ఎప్పుడంటే?

కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి 400 ఎస్‌యూవీలో 80 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్, రెండు ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చబడి ఉంటాయి. ప్రతి యాక్సిల్ వద్ద అమర్చిన రెండు ఎలక్ట్రిక్ మోటార్లు కలిపి గరిష్టంగా 405 బిహెచ్‌పి పవర్‌ని మరియు 765 ఎన్ఎమ్ టార్క్‌‌ని ఉత్పత్తి చేస్తాయి. పూర్తి ఛార్జ్‌పై ఈ కారు గరిష్టంగా 400 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ చెబుతోంది. ఇది ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.

MOST READ:కొత్త కలర్ ఆప్షన్‌లో విడుదల కానున్న కెటిఎం ఆర్‌సి 200 బైక్

భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి విడుదల ఎప్పుడంటే?

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి గరిష్ట వేగాన్ని గంటకు 180 కిలోమీటర్లకు పరిమితం చేయబడి ఉంటుంది. ఇది కేవలం 5.1 సెకన్లలోనే గంటకు 0 - 100 కిమీ వేగాన్ని చేరుకోగలదు. ఇందులో స్టాండర్డ్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఫాస్ట్ ఛార్జర్ సాయంతో కేవలం 40 నిమిషాల్లోనే ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ బ్యాటరీని 0 - 80 శాతం వరకూ ఛార్జ్ చేసుకోవచ్చు.

భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి విడుదల ఎప్పుడంటే?

మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్ కోసం ప్లాన్ చేసిన అనేక వాహనాల్లో ఈక్యూసి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కూడా ఒకటి. ఈ మోడల్‌కు నేరుగా ఎలాంటి ప్రత్యర్థులు ఉండబోరని తెలుస్తోంది. అయితే, ఒకవేళ ఆడి ఇండియా తమ ఈ-ట్రోన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని త్వరలో భారత మార్కెట్లో విడుదల చేసినట్లయితే, ఈ రెండు మోడళ్ల మద్య గట్టి పోటీ ఏర్పడే అవకాశం ఉంది.

MOST READ:భారతదేశంలో దయనీయ స్థితిలో ఉన్న రోల్స్ రాయిస్ లగ్జరీ కార్లు, ఇవే

భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి విడుదల ఎప్పుడంటే?

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి ఎలక్ట్రిక్ కారుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారత మార్కెట్లో గ్రీన్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని మెర్సిడెస్ బెంజ్ కూడా ఈ రంగంలో తమ ఉత్పత్తిని ప్రవేశపెట్టాలని చూస్తోంది. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ భారత ఎలక్ట్రిక్ లగ్జరీ ఎస్‌యూవీ విభాగంలో విడుదల కానుంది కాబట్టి ఈ మోడల్‌కి నేరుగా ఎలాంటి పోటీదారు ఉండరు. కంపెనీ 400 కిలోమీటర్ల రేంజ్‌ను పేర్కొన్నప్పటికీ, వాస్తవ పరిస్థితుల్లో ఇది భిన్నంగా ఉండే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
German automaker, Mercedes-Benz, has announced the launch timeline for its first all-electric vehicle in the Indian market, called the EQC. It is a luxury electric-SUV from the brand that will be going on sale from October 8, 2020. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X