మెర్సిడెస్ బెంజ్ కస్టమర్ల కోసం కొత్త సర్వీస్ స్కీమ్ ప్రారంభం - డీటేల్స్

మెర్సిడెస్ బెంజ్ ఇండియా, తమ వినియోగదారుల కోసం రెండు కొత్త వినూత్న డిజిటల్ సర్వీస్ సొల్యూషన్స్‌ని ప్రారంభించింది. 'డిఎస్‌డినెక్స్ట్ (డిజిటల్ సర్వీస్ డ్రైవ్ నెక్స్ట్)' మరియు 'పే ఎట్ యువర్ కన్వీనెన్స్' పేరిట ఈ రెండు సర్వీస్ క్యాంపైన్‌లను కంపెనీ ప్రారంభించింది. భారత లగ్జరీ కార్ మార్కెట్లో విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి మరియు ఇబ్బందులు లేని యాజమాన్య అనుభవాన్ని అందించేందుకు ఇవి ఉపయోపడుతాయని కంపెనీ తెలిపింది.

మెర్సిడెస్ బెంజ్ కస్టమర్ల కోసం కొత్త సర్వీస్ స్కీమ్ ప్రారంభం - డీటేల్స్

ఇందులో మొట్టమొదటి రకమైన స్మార్ట్ ఫైనాన్షియల్ సొల్యూషన్ ‘పే ఎట్ యువర్ కన్వీనెన్స్' అనేది వినియోగదారులకు ఆర్థిక సౌలభ్యాన్ని అందించడానికి రూపొందించబడింది. కాగా, రెండవది డిఎస్‌డి నెక్స్ట్ కీలకమైన డిజిటల్ సర్వీస్ సొల్యూషన్స్‌ను ఆఫర్ చేయటం కోసం రూపొందించబడినది. ఇవి రెండూ సురక్షితమైన మరియు ఇబ్బంది లేని యాజమాన్య అనుభవాన్ని అందిస్తాయని కంపెనీ పేర్కొంది.

మెర్సిడెస్ బెంజ్ కస్టమర్ల కోసం కొత్త సర్వీస్ స్కీమ్ ప్రారంభం - డీటేల్స్

మరోవైపు, వినియోగదారులకు వారి వాహన సర్వీస్ అవసరాల కోసం సులభంగా చెల్లింపును చేసేలా కంపెనీ ఇండస్ట్రీ-ఫస్ట్ సర్వీస్ బిల్ ఫైనాన్స్‌ను రూపొందించింది. 13 వేర్వేరు క్రెడిట్ కార్డ్ బ్యాంకుల ద్వారా ఈ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ పథకం క్రింద లభించే కొన్ని ఫీచర్లలో 12 నెలల వరకూ క్రెడిట్ కార్డ్ ఈఎమ్ఐ, 3 నెలల వరకూ జీరో-కాస్ట్ ఈఎమ్ఐ, ప్రివెంటివ్ మెయింటినెన్స్ మరియు సాధారణ మరమ్మతులు రెండింటికీ వన్ స్వైప్ ఈఎమ్ఐ ఈజీ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి.

MOST READ:దేశీయ మార్కెట్లో రివాల్ట్ ఎలక్ట్రిక్ బైక్స్ డెలివరీ షురూ..

మెర్సిడెస్ బెంజ్ కస్టమర్ల కోసం కొత్త సర్వీస్ స్కీమ్ ప్రారంభం - డీటేల్స్

వెహికల్ డిజిటల్ రిసెప్షన్ సిస్టమ్ (విడిఆర్ఎస్) ద్వారా వినియోగదారులు తమ ఇంటి వద్ద నుండే వాహన సర్వీస్ సమయంలో కనెక్ట్ అయి ఉండేలా రూపొందించారు. దీని సాయంతో వినియోగదారులకు ‘సర్వీస్ వెబ్ చెక్-ఇన్ పాస్' యొక్క లింక్ పంపిస్తారు. ఈ లింక్ ద్వారా వినియోగదారులు ఎప్పటికప్పుడు తమ వాహనానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ కస్టమర్ల కోసం కొత్త సర్వీస్ స్కీమ్ ప్రారంభం - డీటేల్స్

ఈ సర్వీస్ క్యాంపైన్‌ని ప్రారంభించిన సందర్భంగా, మెర్సిడెస్ బెంజ్ ఇండియా యొక్క మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ మార్టిన్ ష్వెంక్ మాట్లాడుతూ, "మా వ్యూహంలోని ప్రతి అంశం కస్టమర్ చుట్టూ తిరుగుతుంది. మెర్సిడెస్ బెంజ్ వద్ద, మేము డిజిటల్ భవిష్యత్తును రూపొందిస్తున్నాము మరియు మారుతున్న కస్టమర్ అంచనాలకు అనుగుణంగా ప్రతిస్పందిస్తున్నాము. డిజిటలైజేషన్ కస్టమర్-సెంట్రిక్ బ్రాండ్‌గా, డిజైన్ మరియు అభివృద్ధి నుండి ఉత్పత్తి వరకు, అలాగే సేల్స్ నుండి సర్వీస్ వరకూ పూర్తిగా డిజిటల్ టెక్నాలజీతో ఏకీకృతం చేయటాన్ని మేము విశ్వసిస్తున్నాము. ఈ వ్యూహంలో భాగంగానే మేము మా డిజిటల్ ప్రోగ్రామ్ డిఎస్‌డినెక్స్ట్, వెహికల్ డిజిటల్ రిసెప్షన్ సిస్టమ్ (విడిఆర్ఎస్) మరియు వ్యాపారం కోసం వాట్సాప్ కస్టమర్ సేవా కార్యక్రమాలను ప్రారంభించాం. ఈ కార్యక్రమాలు మా వినియోగదారులకు రియల్ టైమ్ సర్వీస్ అప్‌డేట్స్‌ను రిమోట్‌గా అందిస్తాయి, ఇది చాలా సౌలభ్యంగా ఉంటుద"ని అన్నారు.

MOST READ:బహుశా ఇది దేశంలో మొదటి రిమోట్ కంట్రోల్ బోట్.. చూసారా ?

మెర్సిడెస్ బెంజ్ కస్టమర్ల కోసం కొత్త సర్వీస్ స్కీమ్ ప్రారంభం - డీటేల్స్

"మార్కెట్ లీడర్‌గా, కస్టమర్లను శక్తివంతం చేసే మరియు ఈ విభాగంలో వారి విశ్వాసాన్ని బలోపేతం చేసే పరిష్కారాలను తీసుకురావల్సిన బాధ్యత మాపై ఉంది. స్మార్ట్ ఫైనాన్సింగ్ పరిష్కారం"పే ఎట్ యువర్ కన్వీనెస్స్" అనేది కస్టమర్ల సమతుల్యతకు తోడ్పడే అత్యంత సరళమైన ఫైనాన్సింగ్ స్కీమ్. ఈ రకమైన మొదటి పరిష్కారంతో, కస్టమర్ విశ్వాసాన్ని తిరిగి దక్కించుకోవటం మరియు ‘ఉత్తమ కస్టమర్ అనుభవాన్ని' అందించడాన్ని మేము లక్ష్యంగా పెట్టుకున్నామ"ని ఆయన చెప్పారు.

మెర్సిడెస్ బెంజ్ కస్టమర్ల కోసం కొత్త సర్వీస్ స్కీమ్ ప్రారంభం - డీటేల్స్

మెర్సిడెస్ బెంజ్ కొత్త సర్వీస్ క్యాంపైన్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మెర్సిడెస్ బెంజ్ కస్టమర్లు ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని, తమ వాహన సర్వీస్‌కు సంబంధించిన రియల్ టైమ్ అప్‌డేట్స్‌ను తెలుసుకోవటం సులభం అవుతుంది. ఇది సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, కోవిడ్-19 సంక్షోభం కారణంగా సామాజిక దూర ప్రమాణాలను అనుసరించడానికి కూడా సహాయపడుతుంది.

MOST READ:స్కూటర్లో గూడు కట్టిన పిచ్చుక ; 3 నెలలుగా స్కూటర్ తాకని లాయర్

Most Read Articles

English summary
Mercedes-Benz India has launched two new innovative digital service solutions: the 'DSDNxt (Digital Service Drive Next)' and 'Pay at your convenience'. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X