Just In
Don't Miss
- Sports
బీసీసీఐ ఫిట్నెస్ టెస్ట్ విఫలమైన రాహుల్ తెవాటియా.. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు డౌటే!
- News
దుస్తులు విప్పి చూపించాలని... ఆన్లైన్ క్లాసుల పేరుతో హెడ్ మాస్టర్ లైంగిక వేధింపులు...
- Finance
పేపాల్ గుడ్‌న్యూస్, వెయ్యి ఇంజీనీర్ ఉద్యోగులు: హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఛాన్స్
- Movies
ప్రియాంక చోప్రా నాకు దూరంగా.. ప్రపంచం తలకిందులైనట్టుగా.. నిక్ జోనస్ షాకింగ్ కామెంట్
- Lifestyle
బెడ్ రూమ్ లో ఈ లోదుస్తులుంటే... రొమాన్స్ లో ఈజీగా రెచ్చిపోవచ్చని తెలుసా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అక్టోబర్ నెలాఖరు నాటికి భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ లాంచ్
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ ఇండియా, ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో తం ఎంట్రీ లెవల్ సెడాన్ మోడల్ "ఏ-క్లాస్ లిమోసిన్" ను ప్రదర్శించిన సంగతి తెలిసినదే. ఎక్స్‌పోలో షోకేస్ చేసిన వెంటనే భారతీయ మార్కెట్లో ఈ కొత్త మోడల్ విడుదల అవుతుందని భావించారు.

అయితే, దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా భారత మార్కెట్లోకి ఏ-క్లాస్ లిమోసిన్ రావడం ఆలస్యం అయింది. తాజాగా, ఆటోకార్ ఇండియా నుండి వచ్చిన నివేదిక ప్రకారం, మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఇప్పుడు అక్టోబర్ 2020 చివరి నాటికి దేశంలో తమ ఏ-క్లాస్ సెడాన్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ ముందుగా తమ ఫ్లాగ్‌షిప్ ఏఎమ్‌జి ఎ35 సెడాన్ వేరియంట్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఆ తర్వాతి సమయంలో ఇందులో స్టాండర్డ్ పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లను విడుదల చేసే అవకాశం ఉంది.
MOST READ:అమేజింగ్.. ఒకే బస్సుని 10 లక్షల కి.మీ డ్రైవ్ చేసిన డ్రైవర్

స్టాండర్డ్ మోడళ్లతో పోలిస్తే, మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ ఏఎమ్‌జి ఏ35 మోడళ్లలో అగ్రెసివ్‌గా కనిపించే ఫ్రంట్ బంపర్, పెద్ద సైడ్ స్కర్ట్స్, పెద్ద అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఇతర మార్పుల చేర్పులలో బూట్-లిప్ స్పాయిలర్, రియర్ డిఫ్యూజర్ మరియు క్రోమ్ ఎగ్జాస్ట్ టిప్స్ ఉన్నాయి.

ఇంటీరియర్స్‌లో, ఏఎమ్‌జి సిగ్నేచర్ థీమ్‌తో కూడిన బకెట్ సీట్స్, మౌంటెడ్ కంట్రోల్స్ మరియు పాడిల్ షిఫ్టర్లతో కూడిన స్పోర్టీ స్టీరింగ్ వీల్, పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ మరియు క్యాబిన్ అంతటా బ్లాక్-అవుట్ కలర్ స్కీమ్‌ను కలిగి ఉంటుంది.
MOST READ:జరభద్రం గురూ.. కారులో ఇలా చేసారంటే ప్రాణాలే పోవచ్చు.. కావాలంటే ఇది చూడండి

ఏఎమ్‌జి మోడల్‌లో ప్రీమియం బర్మెస్టర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, ఎల్ఈడి యాంబియంట్ లైటింగ్, పెద్ద సన్‌రూఫ్, ఇన్ఫోటైన్‌మెంట్ మరియు ఇన్‌స్ట్రుమెంటేషన్ కోసం రెండు 10.25 ఇంచ్ స్క్రీన్‌లు కూడా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో మెర్సిడెస్ బెంజ్ యొక్క ఎమ్‌బియూఎక్స్ ఏఐ అసిస్టెన్స్‌తో కూడా లేటెస్ట్ కనెక్టెడ్ టెక్నాలజీ కూడా ఉంటుంది.

ఏఎమ్‌జి ఏ35 కారులో శక్తివంతమైన 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 304 బిహెచ్‌పి పవర్‌ను మరియు 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ డ్యూయెల్-క్లచ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది, ఇది ఇంజన్ ద్వారా విడుదలయ్యే శక్తిని ముందు చక్రాలకు పంపిణీ చేస్తుంది.
MOST READ:వావ్.. హైవేపై అద్భుతం.. డ్రైవర్ లేకుండా నడుస్తున్న కార్ [వీడియో]

స్టాండర్డ్ పెట్రోల్ మరియు డీజిల్ మోడళ్లలో కనిపించే అన్ని ఫీచర్లు కూడా ఏఎమ్‌జి వెర్షన్‌లో కూడా కనిపిస్తాయి. అయితే, స్టాండర్డ్ వెర్షన్లను ఏఎమ్‌జి వెర్షన్ కన్నా తక్కువ అగ్రెసివ్ ఎక్స్‌టీరియర్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. అలాగే, వాటి చక్రాల సైజ్ కూడా చిన్నగా ఉంటుంది. ఇంటీరియర్స్‌లో కూడా స్పోర్టీ బకెట్-స్టైల్ సీట్లకు బదులుగా సాధారణ సీటింగ్ ఉంటుంది.

ఇంజన్ విషయానికి వస్తే, స్టాండర్డ్ ఏ-క్లాస్ సెడాన్ రెండు ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఇందులో మొదటిది 162 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేసే 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ వేరియంట్ ‘ఎ 200' మరియు రెండవది 115 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేసే 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ వేరియంట్ ‘ఎ 180 డి'. ఈ రెండు ఇంజన్లు సిక్స్-స్పీడ్ మాన్యువల్ లేదా సెవన్-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి.
MOST READ:ఈ స్టార్ కపుల్స్ పెళ్లి రోజు కొన్న కారు ధర రూ. 2.65 కోట్లు.. ఇంతకీ వారు ఎవరో తెలుసా ?

భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ భారత మార్కెట్లో ఈ బ్రాండ్‌కు ఎంట్రీ లెవల్ మోడల్‌గా రానుంది. దేశీయ విపణిలో అత్యంత సరసమైన ధరకే ఈ కారు విడుదలయ్యే అవకాశం ఉంది. మార్కెట్లో విడుదలైన తర్వాత ఏ-క్లాస్ లిమోసిన్ ఈ విభాగంలో ఇటీవలే విడుదలైన బిఎమ్‌డబ్ల్యూ 2-సిరీస్ గ్రాన్ కూపే మరియు రాబోయే ఆడి ఏ2 మోడళ్లతో పోటీ పడనుంది.