మెర్సిడెస్ బెంజ్ ఫస్టాఫ్ అట్టర్ ఫ్లాప్ మరి సెకండాఫ్ అయినా హిట్ అవుతుందా?

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య నెలల్లో కేవలం 2,948 యూనిట్లను మాత్రమే విక్రయించినట్లు ప్రకటించింది. దేశంలో కొనసాగుతున్న కోవిడ్ -19 పరిస్థితి మరియు అంతకు ముందు విధించిన లాక్‌డౌన్‌ల కారణంగా దేశీయ లగ్జరీ కార్ మార్కెట్ తీవ్రంగా దెబ్బతిందని కంపెనీ పేర్కొంది.

మెర్సిడెస్ బెంజ్ ఫస్టాఫ్ అట్టర్ ఫ్లాప్ మరి సెకండాఫ్ అయినా హిట్ అవుతుందా?

కాగా.. గత ఏడాది ఇదే సమయంలో మెర్సిడెస్ బెంజ్ మొత్తం 9,915 యూనిట్లను విక్రయించగా, 2019 చివరి నాటికి 10,000 యూనిట్లను విక్రయించినట్లు తెలిపింది.

మెర్సిడెస్ బెంజ్ ఫస్టాఫ్ అట్టర్ ఫ్లాప్ మరి సెకండాఫ్ అయినా హిట్ అవుతుందా?

ఈ విషయంపై మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్టిన్ ష్వెంక్ మాట్లాడుతూ, "మహమ్మారి వల్ల ఏర్పడిన మార్కెట్ సవాళ్ళ మధ్య మా అమ్మకాలను క్రమంగా పెంచుకోవడంలో మేము జాగ్రత్తగా వ్యవహరిస్తూ, భవిష్యత్తుపై ఆశాజనకంగా ఉన్నాము. మునుపటి నుండి అమ్మకాల పరంగా నెమ్మదిగా కదలికను చూసినందుకు మాకు సంతోషంగా ఉంది. ఈ పరిస్థితి ఇదివరకటిలా మారడానికి మరికొద్ది రోజుల సమయం పట్టే ఆస్కారం ఉంద"ని అన్నారు.

మెర్సిడెస్ బెంజ్ ఫస్టాఫ్ అట్టర్ ఫ్లాప్ మరి సెకండాఫ్ అయినా హిట్ అవుతుందా?

"అయితే, ప్రస్తుతం ఈ మహమ్మారి పరిస్థితుల నుండి రికవరీ నెమ్మదిగా ఉంటుంది మరియు మార్కెట్ పరిస్థితులు సవాలుగా కొనసాగుతున్నప్పటికీ కస్టమర్ల మనోభావాలు పుంజుకుంటాయని మేము ఆశిస్తున్నాము. హెచ్1లో కొన్ని కీలకమైన బిఎస్4 వాల్యూమ్ మోడళ్లు మార్కెట్ నుండి రన్-అవుట్ కావటం మరియు కోవిడ్-19 సంబంధిత పరిమితులు అమ్మకాల సవాళ్లకు దారితీశాయని" ఆయన చెప్పారు.

మెర్సిడెస్ బెంజ్ ఫస్టాఫ్ అట్టర్ ఫ్లాప్ మరి సెకండాఫ్ అయినా హిట్ అవుతుందా?

ఈ ఏడాది జూన్ నెలలో మొత్తం అమ్మకాల్లో 57 శాతం ఎస్‌యూవీలు ఉన్నాయని, ఇటీవల విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎస్ మొత్తం అమ్మకాలలో 22 శాతం వాటాను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది.

మెర్సిడెస్ బెంజ్ ఫస్టాఫ్ అట్టర్ ఫ్లాప్ మరి సెకండాఫ్ అయినా హిట్ అవుతుందా?

ఇకపోతే మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్, ఇ-క్లాస్ మరియు జిఎల్‌సి మోడళ్లు దేశంలో కీలకమైన వాల్యూమ్‌ని డ్రైవ్ చేసే మోడళ్లను కంపెనీ తెలిపింది, ఈ బ్రాండ్ కొత్త జిఎల్‌ఎ మరియు ఎ-క్లాస్ లిమోసిన్‌ వాహనాలను దేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. వీటి ద్వారా వాహనాల అమ్మకాల సంఖ్య పెరగవచ్చని కంపెనీ ఆశిస్తోంది.

మెర్సిడెస్ బెంజ్ ఫస్టాఫ్ అట్టర్ ఫ్లాప్ మరి సెకండాఫ్ అయినా హిట్ అవుతుందా?

ఇక మెర్సిడెస్ బెంజ్‌కి సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, ఈ బ్రాండ్ యొక్క ఎస్-క్లాస్ మోడల్‌ను రానున్న సెప్టెంబర్ నాటికి మార్కెట్లో విడుదల చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ మోడల్‌లో ఇప్పుడు గరిష్టంగా 12.8 ఇంచ్ పూర్తి టచ్‌స్క్రీన్‌తో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చనున్నారు.

మెర్సిడెస్ బెంజ్ ఫస్టాఫ్ అట్టర్ ఫ్లాప్ మరి సెకండాఫ్ అయినా హిట్ అవుతుందా?

ఈ కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ క్రింది భాగంలో క్లైమేట్ కండిషనింగ్ సిస్టమ్ కోసం శాశ్వతమైన టచ్ కంట్రోల్స్ ఉంటాయి. ఈ కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో మెర్సిడెస్ బెంజ్ మునపటి మోడళ్లతో పోలిస్తే వాటి కన్నా 27 తక్కువ కంట్రోల్స్ మరియు స్విచ్‌లను ఇది కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.

మెర్సిడెస్ బెంజ్ ఫస్టాఫ్ అట్టర్ ఫ్లాప్ మరి సెకండాఫ్ అయినా హిట్ అవుతుందా?

మెర్సిడెస్ బెంజ్ 2020 సేల్స్ రిపోర్ట్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కోవిడ్ -19 మహమ్మారిని పరిగణనలోకి తీసుకుంటే ఈ సంవత్సరం ప్రథమార్థంలో దాదాపు అన్ని కంపెనీలు కూడా తక్కువ సంఖ్యలోనే అమ్మకాలను నమోదు చేయనున్నాయి. మెర్సిడెస్ బెంజ్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. అయితే, కరోనా వైరస్ భయంతో కొనుగోలుదారుల సెంటిమెంట్ బలపడటంతో రానున్న రోజుల్లో కార్ల అమ్మకాలు జోరందుకునే అకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Article Published On: Sunday, July 12, 2020, 7:45 [IST]
English summary
German luxury car manufacturer, Mercedes-Benz has announced that it has witnessed sales of just 2,948 units for the months between January and June this year. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+