Just In
- 1 hr ago
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- 2 hrs ago
45 లీటర్ల ఇంధన ట్యాంక్‌లో 48 లీటర్ల పెట్రోల్.. దీనితో మొదలైన గొడవ.. చివరికి ఏమైందంటే
- 3 hrs ago
సూపర్ సోకో నుండి మూడు సరికొత్త ఎలక్ట్రిక్ టూవీలర్స్
- 3 hrs ago
చెన్నైలో కొత్త డీలర్షిప్ ప్రారంభించిన వోల్వో.. పూర్తి వివరాలు
Don't Miss
- News
చంద్రబాబు చచ్చిన పాముతో సమానం..ఎక్కడికెళ్ళినా పీకేదేం లేదు: విజయసాయి రెడ్డి ధ్వజం
- Finance
అయిదేళ్లలో 63% పెరగనున్న కుబేరులు, ప్రపంచంలోనే భారత్ టాప్
- Sports
ఇంగ్లండ్ ఓటమిని ఎగతాళి చేసిన ఆ దేశ మహిళా క్రికెటర్.. మండిపడ్డ పురుష క్రికెటర్లు!
- Movies
ఈ సినిమా చేస్తే కొడతారని చెప్పింది.. అందుకే కాజల్‌కు ఫోన్ చేశా: మంచు విష్ణు
- Lifestyle
marriage life: పెద్దలు కుదిర్చిన పెళ్లితో లాభమా.. నష్టమా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కస్టమర్ల కోసం ఆన్‌లైన్ సేల్స్ స్టోర్ ప్రారంభించిన మినీ కార్ బ్రాండ్
బిఎమ్‌డబ్ల్యూకి చెందిన ప్రీమియం కార్ బ్రాండ్ మినీ ఇండియా, భారత మార్కెట్లోని వినియోగదారుల కోసం కొత్తగా ఆన్‌లైన్ రిటైల్ షాప్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. దేశంలో కొనసాగుతున్న కరోనా మహమ్మారి కారణంగా, కస్టమర్ ఇకపై తమ ఇంటి నుంచే సౌకర్యవంతంగా, ఇబ్బందులు లేని కొనుగోలు అనుభవాన్ని అందించేందుకు కొత్త ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది.

కస్టమర్లు Shop.mini.in వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్ కొనుగోలు ప్రక్రియను ప్రారంభించవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా మొత్తం మినీ శ్రేణి మోడళ్లను అన్వేషించడం, వాటి ఫీచర్లు, వివరాలు తెలుసుకోవటం చేయవచ్చు. అంతేకాకుండా, మినీ కార్ల కోసం కంపెనీ అందిస్తున్న వివిధ రకాల యాక్ససరీలతో కస్టమర్లకు తమ కారును తమకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంటుంది.

ఈ ఆన్‌లైన్ రిటైల్ సేల్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా కస్టమర్లు తమ మినీ కార్ల కాన్ఫిగరేషన్‌ను సేవ్ చేయడానికి మరియు వారికి కావలసిన మినీ కారును కొనుగోలు చేయడానికి షాపులో నమోదు చేసుకోవడానికి అనుమతినిస్తుంది. వినియోగదారులు ఏ సమయంలోనైనా లాగిన్ అవ్వవచ్చు మరియు వారి కాన్ఫిగరేషన్ మరియు కొనుగోలు హిస్టరీని చూసుకోవచ్చు.
MOST READ:ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి అక్కడ వాటర్ టాక్సీ సర్వీస్.. ఎక్కడో తెలుసా ?

కస్టమర్ నివసించే ప్రదేశం ఆధారంగా, అందుబాటులో ఉన్న అధీకృత మినీ డీలర్‌ను కూడా ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎంచుకోవచ్చు. మీనీ కార్లను టెస్ట్ డ్రైవ్ చేయాలనుకునే కస్టమర్లకు టెస్ట్ డ్రైవ్ కారును నేరుగా వారి ఇంటి వద్దకే లేదా వారికి అనుకూలంగా ఉన్న స్థలానికి పిలిపించుకోవచ్చు.

ఈ సరికొత్త ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా కొనుగోలుదారులు కొటేషన్ కోసం అభ్యర్థించవచ్చు మరియు కాన్ఫిగర్ చేయబడిన మినీ కారు ఈఎమ్ఐను కూడా లెక్కించవచ్చు. ఇది కేవలం కొత్త కార్ల కొనుగోలుకు సహాయం చేయడం మాత్రమే కాకుండా, ఈ ప్లాట్‌ఫామ్ సాయంతో కొనుగోలుదారులకు కొత్త మినీ కారు కోసం తమ ప్రస్తుత కార్లను కూడా ఎక్సేంజ్ చేసుకోవచ్చు.
MOST READ:సాధారణ ఇన్నోవా డ్రైవర్ని సన్మానించిన టయోటా డీలర్.. ఎందుకో తెలుసా ?

కస్టమర్లకు తమకు నచ్చిన డీలర్‌ను ఎంచుకున్న తర్వాత, సదరు అధీకృత డీలర్ కస్టమర్‌కు కాల్ చేసిన వారు ఎంచుకున్న ఉత్పత్తికి సంబంధించిన మరింత అదనపు సమాచారాన్ని మరియు వివిధ రకాల ఫైనాన్స్ ఆప్షన్లకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. కస్టమర్లు మినీ కారును కొనుగోలు చేయడానికి సిద్ధమైన తర్వాత, బుక్ ఆన్‌లైన్ ఎంపికను క్లిక్ చేసి, అందులోని దశలను అనుసరించి బుకింగ్‌ను ధృవీకరించవచ్చు. సురక్షితమైన చెల్లింపుల కోసం ఆన్‌లైన్ స్టోర్‌లో అందుబాటులో ఉన్న వివిధ రకాల పేమెంట్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు.

దేశంలో కొనసాగుతున్న కరోనా మహమ్మారి సమయంలో వినియోగదారులకు సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన యాజమాన్య అనుభవాన్ని అందించడానికి ప్రతి మినీ కారు పూర్తి పరిశుభ్రత ప్రక్రియకు లోనవుతుందని కంపెనీ తెలిపింది. ఇలా శానిటైజ్ చేసిన కార్లను కస్టమర్ అంగీకరించిన తేదీ, సమయం ప్రకారం వాటిని నేరుగా కస్టమర్ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది.

మినీ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించే కస్టమర్లు ‘Buy a MINI' పై క్లిక్ చేయటం ద్వారా కొత్తగా ప్రారంభించిన ఆన్‌లైన్ రిటైల్ ప్లాట్‌ఫామ్‌కు మళ్ళించబడతారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా, కస్టమర్లు తమ అభిమాన మినీ కారును కాన్ఫిగర్ చేయడానికి బ్రాండ్ యొక్క వెబ్‌సైట్‌లో తమ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు, ఈ పోస్ట్‌ను వారు అలానే ఆన్‌లైన్ షాపుకు బదిలీ చేస్తారు.

మినీ కార్ బ్రాండ్ ఆన్‌లైన్ స్టోర్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి డిజిటల్ యుగానికి నాంది పలికిందని చెప్పాలి. దేశంలోని ఆటోమొబైల్ కంపెనీలు తమ అమ్మకాల ప్రక్రియను ఆన్‌లైన్‌కి మార్చడంతో కస్టమర్ల వాహన కొనుగోలు ప్రక్రియ మరింత సౌకర్యంగా మారింది. ఈ కొత్త ఆన్‌లైన్ సేల్స్ ప్లాట్‌ఫామ్ దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల కోసం కాంటాక్ట్‌లెస్ సేవలను అందించనుంది.
MOST READ:బిఎండబ్ల్యు సూపర్ బైక్ డిజైన్ కాపీ కొట్టిన చైనా.. ఈ బైక్ ఎలా ఉందో మీరే చూడండి