బెంగళూరులో షర్మీలా మాండ్రేకి యాక్సిడెంట్

కరోనా వైరస్ ప్రభావం వల్ల భారత్ మొత్తం లాక్ డౌన్ లో ఉంది. లాక్ డౌన్ నిబంధనల ప్రకారం ఎవరు అత్యవసర సమయాల్లో తప్పా బయట తిరగకూడదని అధికారులు తెలిపారు. కానీ కొంతమంది ఈ లాక్ డౌన్ లో కూడా నిబంధనలకు వ్యతిరేఖంగా రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఈ లాక్ డౌన్ సమయంలో కన్నడ నటి షర్మిల మాండ్రే బెంగుళూరులో యాక్సిడెంట్ జరిగింది. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.. !

బెంగళూరులో షర్మీలా మాండ్రేకి యాక్సిడెంట్

భారతదేశం మొత్తం లాక్ డౌన్ లో ఉన్న సమయంలో శనివారం తెల్లవారుజామున బెంగళూరులో జరిగిన ప్రమాదంలో నటి షర్మిలా మాండ్రే, ఆమె స్నేహితుడు లోకేష్ వసంత్ తీవ్ర గాయాలపాలయ్యారు. మాండ్రేకు ఆమె ముఖం మరియు చేతికి గాయాలు అయ్యాయని, ఆమె స్నేహితుడు లోకేష్ చేతికి కూడా గాయం అయిందని హై గ్రౌండ్స్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

బెంగళూరులో షర్మీలా మాండ్రేకి యాక్సిడెంట్

సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (సిబిడి) లోని వసంత్ నగర్ అండర్ బ్రిడ్జిలో జరిగిన ప్రమాదం గురించి తెల్లవారుజామున 3 గంటల సమయంలో పోలీసు కంట్రోల్ రూం నుంచి తమకు సమాచారం అందిందని ట్రాఫిక్ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

బెంగళూరులో షర్మీలా మాండ్రేకి యాక్సిడెంట్

హై గ్రౌండ్స్ ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నప్పుడు స్వచ్చందంగా ఒక వ్యక్తి ముందుకు వచ్చాడని కానీ అతడు పోలీసులకు సహకరించలేదు. అతను తన స్నేహితుడి వివరాలను పంచుకోవడానికి నిరాకరించాడు మరియు ఎటువంటి కేసు నమోదు చేయకుండా వారిని విడిచిపెట్టమని పోలీసులతో వాదించాడు.

బెంగళూరులో షర్మీలా మాండ్రేకి యాక్సిడెంట్

ఈ యాక్సిడెంట్ లో రైల్వే అండర్ బ్రిడ్జ్ స్తంభం దెబ్బతినడం మరియు కారు లోపల ఉన్న వ్యక్తులు గాయపడటం మరియు వారు కేసు లేకుండా వారిని వెళ్లనివ్వడం ఇది తీవ్రమైన నేరం అని పోలీసులు అతనికి వివరించారు. తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినందుకు అతన్ని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెప్పారు.

బెంగళూరులో షర్మీలా మాండ్రేకి యాక్సిడెంట్

సౌత్ బెంగళూరులోని జెపి నగర్ లో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్లో నటి షర్మిలా మాండ్రే (33), లోకేశ్ వసంత్ (35) అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. యాక్సిడెంట్ తరువాత వీరిద్దరూ హాస్పిటల్ కి తరలించబడ్డారు.

బెంగళూరులో షర్మీలా మాండ్రేకి యాక్సిడెంట్

పోలీసుల కథనం మేరకు వీరిద్దరి నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి మరియు కేసును మరింత దర్యాప్తు చేయడానికి మేము వైద్యుల అనుమతి కోసం ఎదురు చూస్తున్నాము అని అధికారి తెలిపారు. వీరి నుంచి ఎలాంటి సమాచారం బయటికి రాలేదు.

బెంగళూరులో షర్మీలా మాండ్రేకి యాక్సిడెంట్

కోనా లాక్ డౌన్ సమయంలో ఎవరూ బయటికి రాకూడదు, ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో బయటికి రావాలంటే పాస్ ఉండాలి. కానీ వీరికి ఎటువంటి పాస్ లేకుండా బయటికి వచ్చారు. ఆ సమయంలో ప్రమాదం జరిగింది అనింపొలీసులు తెలిపారు. లాక్ డౌన్ నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ వారు ఎటువంటి పాస్ లేకుండా జాలీ డ్రైవ్‌లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

బెంగళూరులో షర్మీలా మాండ్రేకి యాక్సిడెంట్

హై గ్రౌండ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో వీరిపై కేసు నమోదైంది. ఈ యాక్సిడెంట్ లో ప్రమాదానికి గురైన కారు రిజిస్ట్రేషన్ నంబర్ KA-51-MJ-2481 ను కలిగి ఉన్న జాగ్వార్ కారును స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఏది ఏమైనా లాక్ డౌన్ ని ఉల్లంఘించి బయటికి రావడం కారణంగా వీరిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

More from DriveSpark

Article Published On: Sunday, April 5, 2020, 9:28 [IST]
English summary
Actress Sharmeila Mandre injured in accident in Bengaluru. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+