రోడ్ రోలర్ డ్రైవ్ చేసిన మహేంద్ర సింగ్ ధోని [వీడియో]

భారత క్రికెట్ రంగంలో ప్రసిద్ధి చెందిన మహేంద్ర సింగ్ ధోని గురించి అందరికీ తెలుసు. కానీ ధోని ఒక్క క్రికెట్ మాత్రమే కాకుండా యితడు ఆటో మోటివ్ ఔత్సాహికుడు కూడా. ఇటీవల క్రికెట్ పిచ్ పై రోడ్ రోలర్ ని నడిపిన వీడియో ఇంటర్ నెట్ లో వైరల్ అవుతుంది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.. !

రోడ్ రోలర్ డ్రైవ్ చేసిన మహేంద్ర సింగ్ ధోని [వీడియో]

సాధారణంగా క్రికెట్ మైదానంలో రోడ్ రోలర్ మనం చూస్తూ ఉంటాము. క్రికెట్ మైదానంలో పిచ్ ని చదును చేయడానికి ఈ రోలర్ ఉపయోగిస్తారు. కానీ ధోని స్వయంగా రోలర్ నడపడం ఇక్కడ చూడవచ్చు.

రోడ్ రోలర్ డ్రైవ్ చేసిన మహేంద్ర సింగ్ ధోని [వీడియో]

ధోని ఇలాంటి అసాధారణమైన వాహనాలు నడపడం ఇది మొదటి సారి కాదు. కొన్నేళ్ల క్రితం జింబాబ్వేలో పర్యటించినప్పుడు ధోని బాదాస్ పోలీసు బైక్ కూడా నడిపాడు. జింబాబ్వే పోలీసులు తమ మోటార్ సైకిల్ పై ధోని రైడ్ చేయడం వారికి చాలా ఆనందాన్ని కలిగించింది.

రోడ్ రోలర్ డ్రైవ్ చేసిన మహేంద్ర సింగ్ ధోని [వీడియో]

మహేంద్ర సింగ్ ధోని తన గ్యారేజ్ లో చాల విలాసవంతఘమైన కార్లను కలిగి ఉన్నాడు. ఇందులో అత్యంత ఖరీదైన వాహనాలు కూడా ఉన్నాయి.

రోడ్ రోలర్ డ్రైవ్ చేసిన మహేంద్ర సింగ్ ధోని [వీడియో]

చాలా మంది భారతీయ క్రికెట్ ఆటగాళ్లు ఖరీదైన మరియు చాల విలాసవంతమైన స్పోర్టి కార్లను కలిగి ఉన్నారు. ధోని గ్యారేజ్ లో కవాసకి నింజా హెచ్ 2 ని కూడా కలిగి ఉన్నాడు. ఇటీవల కాలంలో ధోని ఈ మోటార్ సైకిల్ పై తిరుగుతున్నట్లు గుర్తించారు. ఈ నింజా హెచ్ 2 ధోని 2015 లో కొనుగోలు చేశారు. అప్పుడు దీని ధర 30 లక్షలు.

రోడ్ రోలర్ డ్రైవ్ చేసిన మహేంద్ర సింగ్ ధోని [వీడియో]

ధోని మోటార్ సైకిల్స్ తో పాటు చాలా కార్లను కూడా కలిగి ఉన్నాడు.భారతదేశంలో అత్యంత వేగవంతమైన జీప్, గ్రాండ్ చెరోకీ ట్రాక్ హాక్ ను కూడా కలిగి ఉన్నాడు. గత నెలలో దీనిని కొనుగోలు చేసినట్లు మనకు తెలుస్తుంది.

రోడ్ రోలర్ డ్రైవ్ చేసిన మహేంద్ర సింగ్ ధోని [వీడియో]

ధోని కొనుగోలు చేసిన ఈ జీప్ గ్రాండ్ చెరోకీ ట్రాక్‌హాక్ 6.4 లీటర్, వి 8 సూపర్ ఛార్జ్ పెట్రోల్ ఇంజిన్‌ని కలిగి ఉంటుంది. ఇది 707 బిహెచ్‌పి మరియు 875 ఎన్‌ఎమ్‌ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది భారతదేశంలో అత్యంత ఖరీదైన జీప్.

Source: MS Dhoni Fans Official/Twitter

Most Read Articles

English summary
MS Dhoni’s latest ride is a Road Roller [Video]. Read in Telugu.
Story first published: Thursday, February 27, 2020, 17:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X