శానిటైజేషన్ యూనిట్లుగా మారిన ముంబై పోలీస్ వ్యాన్లు

భారతదేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకి భయంకరంగా వ్యాప్తి చెందుతోంది. దాదాపు మన దేశంలో కరోనా రోగుల సంఖ్య 11 వేలకు చేరింది. కరోనా వైరస్ నివారణ కోసం భారత ప్రభుత్వం లాక్ డౌన్ ని మే 3 వరకు పొడిగించినట్లు అధికారిక ప్రకటన చేసింది. కరోనా నివారణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. కరోనా నివారణలో భాగంగా చాల సంస్థలు తమ వంతు మద్దతుని కూడా ప్రకటించాయి.

శానిటైజేషన్ యూనిట్లుగా మారిన ముంబై పోలీస్ వ్యాన్లు

ఈ నేపథ్యంలో హీరో మోటోకార్ప్ సంస్థ 60 బైక్ అంబులెన్సులను విరాళంగా ఇచ్చింది. అంతే కాకుండా చాల ఆటో సంస్థలు కూడా తమ కంపెనీలలో వైద్య పరికరాలను తయారు చేస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ముంబై పోలీసులు తమ పోలీస్ వ్యాన్లను శానిటైజేషన్ యూనిట్లుగా మార్చారు.

శానిటైజేషన్ యూనిట్లుగా మారిన ముంబై పోలీస్ వ్యాన్లు

కరోనా వైరస్ మహమ్మారి నుంచి విముక్తి పొందటానికి భారతీయులు చాలా సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. కరోనా బాధితులకు సేవ చేస్తున్న డాక్టార్లకు కూడా ఈ కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. అంతే కాకుండా వాహనసేవలన్నీ నిలిచిపోవడంతో ప్రజలను బయటికి రాకుండా చర్యలు తీసుకుంటున్న పోలీసులు కూడా ఈ వైరస్ భారిన పడుతున్నారు.

MOST READ: కరోనా ఎఫెక్ట్ : మే 3 వరకు రద్దు చేయబడిన ట్రైన్ సర్వీసులు

శానిటైజేషన్ యూనిట్లుగా మారిన ముంబై పోలీస్ వ్యాన్లు

ఈ విధమైన కరోనా భారినుండి తమను తాము కాపాడు కోవడానికి ముంబై పోలీసు దళాలు ఇప్పుడు విధి నిర్వహణలో ఉన్న తమ సిబ్బందిని సంక్షోభం నుండి తలెత్తే ప్రమాదం లేకుండా చూసుకోవడానికి ఒక ప్రత్యేకమైన పద్దతిని ప్రవేశపెట్టారు.

శానిటైజేషన్ యూనిట్లుగా మారిన ముంబై పోలీస్ వ్యాన్లు

పోలీస్ ఫోర్స్‌కు చెందిన కొన్ని వ్యాన్‌లను ఇప్పుడు శానిటైజేషన్ యూనిట్‌లుగా మార్చారు. నగరంలోని కొన్ని పోలీస్ స్టేషన్లలో శానిటైజేషన్ గదులు కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు తనిఖీలు చేస్తున్న చోట ఈ వ్యాన్లను నగరంలోని పలు పాయింట్లకు తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది.

MOST READ: కరోనా బాధితుల కోసం బైక్ అంబులెన్సులు విరాళంగా ఇచ్చిన హీరో మోటోకార్ప్

శానిటైజేషన్ యూనిట్లుగా మారిన ముంబై పోలీస్ వ్యాన్లు

పోలీసులు తమ విధిలో ఉన్నప్పుడు శానిటైజేషన్ ప్రక్రియ ఉపయోగించుకోవాలి. ఈ వ్యాన్ల కారణంగా పోలీసు సిబ్బంది రోజుకు కనీసం రెండుసార్లు శానిటైజేషన్ ప్రక్రియ ద్వారా వెళుతున్నారు.

శానిటైజేషన్ యూనిట్లుగా మారిన ముంబై పోలీస్ వ్యాన్లు

శానిటైసర్ యూనిట్లను సిద్ధం చేయడంతో పాటు, వాహనాల పరిశుభ్రత ప్రక్రియ ప్రారంభించారు. నగరంలో అవసరమైన చోటుకి ఈ వ్యాన్లను రవాణా చేసే అవకాశం కూడా ఉంది. ఈ వాహనాల డ్రైవర్లకు వారు ఆహారం మరియు ఇతర నిత్యావసరాలను కూడా అందిస్తున్నారు.

MOST READ: అధికారిక వెబ్ సైట్ నుంచి తొలగించబడిన హోండా మోటార్ సైకిల్స్, ఎందుకంటే..?

శానిటైజేషన్ యూనిట్లుగా మారిన ముంబై పోలీస్ వ్యాన్లు

ముంబై పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, మంగళవారం ముంబై సరిహద్దులోని అన్ని పోలీసు చెక్‌పోస్టులలో పనిచేస్తున్న అధికారులు మరియు సిబ్బంది యొక్క ప్రాథమిక వైద్య పరీక్షను కూడా రాష్ట్ర ఆరోగ్య శాఖ నిర్వహించింది.

Most Read Articles

English summary
Coronavirus Pandemic: Mumbai Police Vans Turn Into Sanitisation Units. Read in Telugu.
Story first published: Wednesday, April 15, 2020, 12:07 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X