జూన్ 11న కొత్త 2020 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 విడుదల; వివరాలు

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ భారత్‌లో మరో కొత్త కారును విడుదల చేయనుంది. ఈమేరకు బిఎమ్‌డబ్ల్యూ ఇండియా తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఓ టీజర్‌ను విడుదల చేసింది. కంపెనీ అందిస్తున్న బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 (BMW X6)లో ఓ నెక్స్ట్-జనరేషన్ వెర్షన్‌ను ఈ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

జూన్ 11న కొత్త 2020 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 విడుదల; వివరాలు

లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 ఎస్‌యూవీ-కూప్ మోడల్‌ను జూన్ 11, 2020 మోడల్‌ను కంపెనీ మార్కెట్లో విడుదల చేయనుంది. వాస్తవానికి ఈ మోడల్ ఎప్పుడో విడుదల కావలసి ఉన్నప్పటికీ, కోవిడ్-19 నేపథ్యంలో విడుదల జాప్యమయ్యింది. గడచిన జనవరి నుంచే ఈ మోడల్‌కు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.

జూన్ 11న కొత్త 2020 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 విడుదల; వివరాలు

ఈ థర్డ్ జనరేషన్ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 గ్లోబల్ మార్కెట్లలో ఏడాది క్రితమే విడుదలైంది. కరోనా మహమ్మారి కారణంగా ఇండియా లాంచ్ ఆలస్యమైంది. ఎస్‌యూవీలోని కంఫర్ట్, కూప్‌లోని స్టయిల్‌ను కలగలిపి డిజైన్ చేసిన కొత్త 2020 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 ఎస్‌యూవీ-కూప్‌ను పూర్తిగా విదేశాల్లో తయారు చేసి సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూపంలో భారత్‌కు దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లలో విక్రయించనున్నారు. ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ కారు రెండు వేరియంట్లలో (xLine, M Sport) లభ్యం కానుంది.

MOST READ: భారత్‌లో డీజిల్ కార్లను నిలిపివేసిన జాగ్వార్, వివరాలు

జూన్ 11న కొత్త 2020 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 విడుదల; వివరాలు

కొత్త తరం బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 కారులో డిజైన్ పరంగా, ఇంటీరయర్ల పరంగా అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి. అన్ని బిఎమ్‌డబ్ల్యూ కార్ల మాదిరిగానే ఉందులో కూడా డబుల్ కిడ్నీ స్టైల్ గ్రిల్ ఉంటుంది. కాకపోతే ఈ గ్రిల్ క్రోమ్ ఫినిష్‌తో చూడటానికి మరింత షార్ప్‌గా కనిపిస్తుంది. కొత్త ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్ డిజైన్, అడాప్టివ్ ఎల్ఈడి టెక్నాలజీతో కూడిన బిఎమ్‌డబ్ల్యూ లేజర్ లైట్స్, ఫాగ్‌ల్యాంప్స్‌ను ఇంటిగ్రేట్ చేసి రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్, ఫ్లోటింగ్ బాడీ లైన్స్ వంటి మార్పులతో మునుపటి వెర్షన్ మరింత షార్ప్ అండ్ స్టయిలిష్‌గా కనబడేలా కొత్త ఎక్స్6 ఎస్‌యూవీని డిజైన్ చేశారు.

జూన్ 11న కొత్త 2020 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 విడుదల; వివరాలు

ఇక ఇంటరీయర్లలో కూడా మరిన్ని కంఫర్ట్ ఫీచర్లతో మరింత లగ్జరీ ఫీల్‌నిచ్చేలా మార్పులు చేశారు. ప్రత్యేకించి వెర్నెస్కా లెథర్‌తో తయారు చేయబడిన సీట్లు మరియు ఇంటీరియర్ అప్‌హోలెస్ట్రీ, మసాజ్ సదుపాయంతో కూడిన పవర్ సీట్స్, ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, గ్లాస్‌తో తయారు చేసిన గేర్ లివర్, పానరోమిక్ సన్‌రూఫ్, బోవర్స్ అండ్ విల్కిన్స్ నుంచి గ్రహించిన ప్రీమియం ఆడియో సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే మరియు బిఎమ్‌డబ్ల్యూ బ్రాండ్ కనెక్టివిటీ సాఫ్ట్‌వేర్‌తో డిజైన్ చేసిన పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వంటి విలాసవంతమైన ఫీచర్లు ఈ కారు సొంతం.

MOST READ: బిఎండబ్ల్యూ ఎం5 రివ్యూ

జూన్ 11న కొత్త 2020 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 విడుదల; వివరాలు

అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించబడుతున్న బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 మొత్తం నాలుగు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తోంది. అయితే, భారత్‌లో మాత్రం ఇది ఒకే ఇంజన్ ఆప్షన్‌తో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కంపెనీ నుంచి పాపులర్ అయిన అత్యంత పవర్‌ఫుల్ 'xDrive40i' 3-లీటర్, సిక్స్-సిలిండర్, టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఈ కారులో ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 340 హెచ్‌పిల శక్తిని, 450 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇది ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభిస్తుంది.

జూన్ 11న కొత్త 2020 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 విడుదల; వివరాలు

గ్లోబల్ వెర్షన్ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 మోడల్‌లో 'M50i' 4.4 లీటర్ వి8 పెట్రోల్ ఇంజన్ (530 బిహెచ్‌పి పవర్), 'M50d' 3-లీటర్ సిక్స్-సిలిండర్ డీజిల్ ఇంజన్ (400 బిహెచ్‌పి పవర్) మరియు 'xDrive30d' 3-లీటర్ సిక్స్-సిలిండర్ డీజిల్ ఇంజన్ (265 బిహెచ్‌పి పవర్) ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఒకవేళ బిఎమ్‌డబ్ల్యూకి అన్ని సజావుగా సాగితే కంపెనీ ఇందులో 'xDrive30d' 3-లీటర్ సిక్స్-సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను కూడా ఇండియన్ మార్కెట్‌కు పరిచయం చేసే అవకాశం ఉంది.

MOST READ: బిఎమ్‌డబ్ల్యూ 8 సిరీస్ గ్రాన్ కూపే & ఎం 8 కూపే మోడల్స్ : ధర & ఇతర వివరాలు

జూన్ 11న కొత్త 2020 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 విడుదల; వివరాలు

కొత్త 2020 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 ఇండియన్ మార్కెట్లో విడుదలైతే ఇది ఈ సెగ్మెంట్లోని మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఈ కూప్ మరియు ఆడి క్యూ8 వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుంది. మార్కెట్లో దీని ధర సుమారు రూ.90 లక్షల నుంచి రూ.1 కోటి (ఎక్స్-షోరూమ్) వరకూ ఉండొచ్చని అంచనా.

జూన్ 11న కొత్త 2020 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 విడుదల; వివరాలు

సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 2020 మోడల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఆల్ట్రా లగ్జరీ కార్ సెగ్మెంట్లో విడుదల కానున్న కొత్త 2020 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 చూడటానికి మునుపటి వెర్షన్ కన్నా మరింత లగ్జరీగా అనిపిస్తుంది. శక్తివంతమైన ఇంజన్ పెర్ఫార్మెన్స్, ఆల్ట్రా లగ్జరీ కంఫర్టీ ఫీచర్లతో ఇది ఈ సెగ్మెంట్ కస్టమర్లు ఖచ్చితంగా మొదటి చూపులోనే ఆకట్టుకుంటుంది అనడంలో ఆశ్చర్యం లేదు.

Most Read Articles

English summary
BMW India has officially teased the new-gen X6 on its website ahead of its launch in the country. The third-generation SUV-coupe is expected to go on sale in India on June 11, 2020. Bookings for the 2020 X6 began in January. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X