Just In
Don't Miss
- News
దుస్తులు విప్పి చూపించాలని... ఆన్లైన్ క్లాసుల పేరుతో హెడ్ మాస్టర్ లైంగిక వేధింపులు...
- Finance
పేపాల్ గుడ్‌న్యూస్, వెయ్యి ఇంజీనీర్ ఉద్యోగులు: హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఛాన్స్
- Movies
ప్రియాంక చోప్రా నాకు దూరంగా.. ప్రపంచం తలకిందులైనట్టుగా.. నిక్ జోనస్ షాకింగ్ కామెంట్
- Sports
మ్యాక్సీనా మజాకానా.. సిక్స్ కొడితే సీటుకే బొక్క!
- Lifestyle
బెడ్ రూమ్ లో ఈ లోదుస్తులుంటే... రొమాన్స్ లో ఈజీగా రెచ్చిపోవచ్చని తెలుసా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన కొత్త హ్యుందాయ్ ఐ20; త్వరలోనే విడుదల
హ్యుందాయ్ మోటార్ ఇండియా భారత మార్కెట్లో విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఎలైట్ ఐ20లో ఓ సరికొత్త తరం మోడల్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. తాజా సమాచారం ప్రకారం, హ్యుందాయ్ ఇప్పటికే కొత్త 2020 ఎలైట్ ఐ20 మోడల్‌ను తమ డీలర్‌షిప్ కేంద్రాలకు పంపిణీ చేస్తోంది.

కార్‌బైక్‌రివ్యూస్ లీక్ చేసిన చిత్రాల ప్రకారం, కొత్త తరం హ్యుందాయ్ ఐ20 కారు ఓ డీలర్‌షిప్ సెంటర్లో ప్రత్యక్షమైంది. ముందు బంపర్ భాగాన్ని క్యామోఫ్లేజ్ చేసిన ఓ వైట్ కలర్ న్యూ జెన్ ఐ20 కారుని ఈ చిత్రంలో చూడొచ్చు. హ్యుందాయ్ ఇప్పటికే ఈ కొత్త తరం ఐ20 కారుని భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షించింది.

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎలైట్ ఐ20తో పోల్చుకుంటే, సరికొత్త డిజైన్ మరియు అధునాతన ఫీచర్లతో కొత్త తరం ఐ20 అందుబాటులోకి రానుంది. అయితే, ఓవరాల్ ఐ20 సిల్హౌట్ మాత్రం యధావిధిగా ఉండనుంది.
MOST READ:కొత్తగా డ్రైవింగ్ చేస్తున్నారా.. అయితే ఇది మీకోసమే

కొత్త తరం హ్యుందాయ్ ఎలైట్ ఐ20లో కొత్త క్యాస్కేడింగ్ గ్రిల్, మరింత అందగా కనిపించే హెడ్‌ల్యాంప్స్, కొత్త వ్రాప్ అరౌండ్ స్ప్లిట్ టెయిల్ లాంప్స్ మరియు ఈ రెండింటి అనుసంధానించే లైట్ బార్, కొత్త డ్యూయల్-టోన్ అల్లాయ్-వీల్ డిజైన్ వంటి ఫీచర్లతో ఇది ప్రస్తుత తరం ఐ20 కంటే మరింత ప్రీమియంగా కనిపిస్తుంది.

ఇంటీరియర్స్‌లో కూడా కొత్త తరం ఐ20ని ఫూర్తి ఫీచర్లతో లోడ్ చేయనున్నారు. ఇందులో కొత్త డాష్‌బోర్డ్ డిజైన్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం మరియు ఇన్ఫోటైన్‌మెంట్ కోసం రెండు 10.25 ఇంచ్ డిస్‌ప్లేలు మొదలైన ఫీచర్లు ఉన్నాయి.
MOST READ:మీరు ఎప్పుడూ చూడని మోడిఫైడ్ సూరజ్ 325 సిసి బైక్

ఇందులోని కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో పాటుగా బ్రాండ్ యొక్క కనెక్టింగ్ టెక్నాలజీ ‘బ్లూలింక్'ని సపోర్ట్ చేస్తుంది. కొత్త తరం హ్యుందాయ్ ఎలైట్ ఐ20 కారులో హ్యుందాయ్ వెన్యూలో కనిపించే సాంకేతిక పరిజ్ఞాన్ని ఆఫర్ చేయనున్నారు. వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీలో 33 వాయిస్ కమాండ్లతో కూడిన సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది, ఇది కొత్త ఐ20 కారులో కూడా అందుబాటులోకి రానుంది.

ఈ కొత్త కారులో ఉండబోయే కొన్ని ముఖ్యమైన ఫీచర్లలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయెల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఎయిర్ కండిషనింగ్ వెంట్స్ మరియు బోస్ ప్రీమియం ఆడియో సిస్టమ్ మొదలైనవి ఉండొచ్చని సమాచారం. భద్రతా ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో బ్లైండ్ స్పాట్ మోనిటరింగ్, బహుళ ఎయిర్‌బ్యాగులు, ఐఎస్ఓ-ఫిక్స్ మౌంట్‌లు మొదలైనవి ఉండనున్నాయి.
MOST READ:గుడ్ న్యూస్.. త్వరలో రోడ్డుపైకి రానున్న కొత్త హోండా హైనెస్ సిబి350 బైక్

ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, కొత్త తరం హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మూడు ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఇందులో 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌లు ఉండనున్నాయి. ఇవే ఇంజన్లను కియా సెల్టోస్ మోడల్‌లో కూడా ఉపయోగిస్తున్నారు.

ఈ ఇంజన్లన్నీ స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభ్యం కానున్నాయి. అయితే, 1.2-లీటర్ పెట్రోల్‌పై ఆప్షనల్ సివిటి మరియు 1.5-లీటర్ డీజిల్‌పై టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లను ఆఫర్ చేసే అవకాశం ఉంది. అలాగే, ఇందులో శక్తివంతమైన 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను 6-స్పీడ్ ఐఎమ్‌టి (ఇంటెలిజెంట్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) మరియు 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో విడుదల చేయవచ్చని తెలుస్తోంది.
MOST READ:8 నెలల క్రితం పోయింది.. మళ్లీ ఇప్పుడు దొరికింది.. థ్యాంక్యూ పోలీస్..

కొత్త తరం హ్యుందాయ్ ఐ20 హ్యాచ్‌బ్యాక్ డీలర్‌షిప్ కేంద్రాలను చేరుకోవటంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
గడచిన కొన్నేళ్లుగా దేశంలో అమ్మకానికి ఉన్న హ్యుందాయ్ ఎలైట్ ఐ20లో ఇప్పుడు డిజైన్ మరియు ఫీచర్ల పరంగా కీలకమైన మార్పులు ఉండనున్నాయి. ఇది ఈ విభాగంలో మారుతి సుజుకి బాలెనో, టాటా ఆల్ట్రోజ్, ఫోక్స్‌వ్యాగన్ పోలో, టొయోటా గ్లాంజా మరియు హోండా జాజ్ వంటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడళ్లతో పోటీగా నిలుస్తుంది.
Source: Carbikereviews