మహీంద్రా నుంచి సరికొత్త థార్ ఎస్‌యూవీ, ఇందులో కొత్తదనం ఏంటంటే..

భారతదేశపు అగ్రగామి యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త తరం 2020 మహీంద్రా థార్‌ను కంపెనీ ఈ నెల 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం నాడు భారత మార్కెట్లో ఆవిష్కరించనుంది. విడుదలకు సిద్ధంగా ఉన్న కొత్త థార్ ఎస్‌యూవీ టెస్టింగ్ ప్రక్రియను కంపెనీ ముమ్మరం చేసింది.

మహీంద్రా నుంచి సరికొత్త థార్ ఎస్‌యూవీ, ఇందులో కొత్తదనం ఏంటంటే..

తాజాగా, మహీంద్రా వివిధ రకాల థార్ వేరియంట్లను టెస్టింగ్ చేస్తుండగా రష్‌లేన్ బృందం తమ కమెరాలో బంధించింది. ఈ చిత్రంలో మూడుకి పైగా థార్ వాహనాలను టెస్టింగ్ చేస్తుండటాన్ని మనం చూడొచ్చు. ఇదివరకటి తరం మహీంద్రా థార్‌తో పోల్చుకుంటే, ఈ కొత్త తరం మహీంద్రా థార్‌లో డిజైన్, ఫీచర్ల పరంగా అనేక మార్పులు చేర్పులు ఉండనున్నాయి.

మహీంద్రా నుంచి సరికొత్త థార్ ఎస్‌యూవీ, ఇందులో కొత్తదనం ఏంటంటే..

తాజాగా లీక్ అయిన ఈ స్పై చిత్రాల్లో ఈ సరికొత్త ఆఫ్-రోడర్ ఎస్‌యూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి. ఈ టెస్టింగ్ వాహనాల్లో కొన్ని హార్డ్ టాప్ వెర్షన్లు, కొన్ని సాఫ్ట్ టాప్ వెర్షన్లు ఉన్నాయి. అన్నీ కూడా త్రీడోర్ కాన్ఫిగరేషన్ (ఇరువైపూలా ఒక్కొక్క డోర్ మరియు వెనుక వైపు ఒక డోర్)లో ఉండటాన్ని చూడొచ్చు.

MOST READ:వర్షంలో ఒకే చోట 8 గంటలు నిలబడిన వృద్ధ మహిళ, ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

మహీంద్రా నుంచి సరికొత్త థార్ ఎస్‌యూవీ, ఇందులో కొత్తదనం ఏంటంటే..

ఈ కొత్త తరం థార్‌లో హిల్ డీసెంట్ కంట్రోల్ (హెచ్‌డిసి) ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (టిసిఎస్) వంటి డ్రైవర్ అసిస్ట్ ఫీచర్లు కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. వీటికి సంబంధించిన బటన్లను మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్‌కు కుడి వైపున అమర్చినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలకు మద్దతు ఇచ్చే పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

మహీంద్రా నుంచి సరికొత్త థార్ ఎస్‌యూవీ, ఇందులో కొత్తదనం ఏంటంటే..

కొత్త థార్‌లో జోడించిన ఇతర ఫీచర్లలో ఫార్వర్డ్ ఫేసింగ్ రియర్ సీట్లు, సెంటర్ కన్సోల్‌లో ఉంచిన ఫోల్డబిల్ కీ ఫాబ్ మరియు పవర్-విండో స్విచ్‌లు, డిజిటల్ డిస్‌ప్లేతో రెండు అనలాగ్ డయల్‌లతో కూడిన కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి మార్పులు ఉన్నాయి. ఇంకా ఇందులో క్లైమేట్ కంట్రోల్, మౌంటెడ్ కంట్రోల్‌తో కూడిన మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్ మరియు కార్బన్-ఫైబర్‌తో తయారు చేసిన గుండ్రటి ఎయిర్ కండిషనింగ్ వెంట్స్, దాని చుట్టూ ఫినిషింగ్ వంటి వివరాలను ఈ చిత్రాలు వెల్లడిస్తున్నాయి.

MOST READ:డీజిల్ కార్ అమ్మకాలకు శాపంగా మారిన బిఎస్ 6 రూల్స్, ఎందుకంటే ?

మహీంద్రా నుంచి సరికొత్త థార్ ఎస్‌యూవీ, ఇందులో కొత్తదనం ఏంటంటే..

కొత్త 2020 థార్ ఎక్స్‌టీరియర్ ఫీచర్లను గమనిస్తే, ఇందులో పెద్ద వెర్టికల్-స్లాట్ గ్రిల్, కొత్త హెడ్‌ల్యాంప్స్ మరియు రెండు చివర్లలో రీడిజైన్ చేసిన కొత్త బంపర్‌లతో ఇది కొత్త ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంటుంది. అంతే కాకుండా, ఇది ఆప్షనల్ ఫ్యాక్టరీ ఫిట్టెడ్ హార్డ్-టాప్‌తో లభ్యం కానుంది. మెరుగైన ఆఫ్-రోడింగ్ సామర్థ్యం కోసం ఇందులో ఆల్-టెర్రైన్ టైర్లతో కొత్త ఫైవ్-స్పోక్ 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను అమర్చారు.

మహీంద్రా నుంచి సరికొత్త థార్ ఎస్‌యూవీ, ఇందులో కొత్తదనం ఏంటంటే..

నెక్స్ట్-జెనరేషన్ మహీంద్రా థార్‌ను పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌పై తయారు చేయనున్నారు. ఇదే ప్లాట్‌ఫామ్‌పై ప్రస్తుతం మహీంద్రా బ్రాండ్ లైనప్‌లో టియువి300 ప్లస్ మరియు స్కార్పియో మోడళ్లను తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త థార్ ఎస్‌యూవీ కూడా ప్రస్తుత-తరం మోడల్‌తో పోలిస్తే పెద్ద ఫుట్‌ప్రింట్‌ను కలిగి ఉంటుంది తెలుస్తోంది.

MOST READ:జూలై నెలలో కొత్త రికార్డు సృష్టించిన ఫాస్ట్ ట్యాగ్ ట్రాన్సక్షన్స్ , ఎంతో తెలుసా ?

మహీంద్రా నుంచి సరికొత్త థార్ ఎస్‌యూవీ, ఇందులో కొత్తదనం ఏంటంటే..

దీని కారణంగా కొత్త థార్‌లో విశాలమైన ఇంటీరియర్ క్యాబిన్ ఉండే అవకాశం ఉంది. మునుపటి-తరం మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త మోడల్‌లోని ఇంటీరియర్స్ మరింత ప్రీమియం లుక్ అండ్ ఫీల్‌ను అందిస్తుందని సమాచారం. ఇంటీరియర్ క్యాబిన్ అంతటా సాఫ్ట్-టచ్ మెటీరియల్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

మహీంద్రా నుంచి సరికొత్త థార్ ఎస్‌యూవీ, ఇందులో కొత్తదనం ఏంటంటే..

ఈ కొత్త మోడల్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానున్నట్లు సమాచారం. ఇందులోని 2.2-లీటర్, బిఎస్6 కంప్లైంట్ టర్బో డీజిల్ ఇంజన్ సుమారుగా 140 బిహెచ్‌పి శక్తిని మరియు 300 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేయవచ్చని తెలుస్తోంది.

MOST READ:రాజ్‌కోట్‌లోని మహిళా పోలీసుతో గొడవపడిన రవీంద్ర జడేజా ; ఎందుకో తెలుసా ?

మహీంద్రా నుంచి సరికొత్త థార్ ఎస్‌యూవీ, ఇందులో కొత్తదనం ఏంటంటే..

ఇకపోతే ఇందులోని కొత్త 2.0-లీటర్ ‘టిజిడి ఎమ్‌స్టాలియన్' టర్బో-పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 187 బిహెచ్‌పి శక్తిని మరియు 380 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు తక్కువ-నిష్పత్తి గల గేర్‌బాక్స్‌తో స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌కు జతచేయబడి ఉంటాయి. ఆప్షనల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది.

మహీంద్రా నుంచి సరికొత్త థార్ ఎస్‌యూవీ, ఇందులో కొత్తదనం ఏంటంటే..

కొత్త 2020 మహీంద్రా థార్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కొత్తతరం 2020 మహీంద్రా థార్‌ను విడుదల చేసేందుకు కంపెనీ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎంచుకుంది. భారత్‌లో జీప్ స్టైల్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త థార్‌ను మునుపటి కన్నా మెరుగైన క్యాబిన్ మరియు కంఫర్ట్ ఫీచర్లతో తయారు చేయనున్నారు. కేవలం ఆఫ్-రోడ్ వినియోగదారులనే కాకుండా నిత్యం వాడుకునే రెగ్యులర్ ఎస్‌యూవీలా కూడా ఈ ఈ మోడల్‌ను తీర్చిదిద్దనున్నారు.

Source: Rushlane

Most Read Articles

English summary
Mahindra will unveil the 2020 Thar on August 15 to the world. The company has finally decided to pull the covers on the next-generation off-road SUV. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X