Just In
- 18 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 1 day ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 1 day ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 1 day ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
జనసేన-బీజేపీ అభ్యర్థులను మద్దతివ్వండి, ఇక వైసీపీ దాష్టీకానికి ముగింపే: పవన్ కళ్యాణ్
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Movies
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కొత్త 2022 హోండా సివిక్ ప్రోటోటైప్ ఆవిష్కరణ; ఇది భారత్‌కు వచ్చేనా?
జపనీస్ కార్ బ్రాండ్ హోండా, అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న పాపులర్ ఎంట్రీ లెవల్ సెడాన్ సివిక్‌లో కంపెనీ ఓ కొత్త 'ప్రోటోటైప్' వెర్షన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. కొత్త (2022) హోండా సివిక్ ప్రోటోటైప్ ఇప్పుడు రిఫ్రెష్ డిజైన్ మరియు స్టైలింగ్ ఎలిమెంట్స్‌తో రూపుదిద్దుకుంది. ఇది మునుపటి కంటే మరింత ఆధునికంగా కనిపిస్తుంది.

కొత్త 2022 హోండా సివిక్ ఇప్పుడు మరింత పరిణతి చెందిన మరియు క్లాస్సి డిజైన్‌తో తయారైంది. ఈ సెడాన్ ఇప్పుడు తక్కువ కర్స్ మరియు క్రీజులతో మినలిస్టిక్ స్టైలింగ్‌ను కలిగి ఉంటుంది. ఇది సెడాన్‌కు మరింత ఆధునిక రూపాన్ని జోడిస్తుంది. సివిక్‌లో ఇది 11వ తరం మోడల్‌గా రానుంది.

కొత్త హోండా సివిక్ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లు (డేటైమ్ రన్నింగ్ లైట్స్), మధ్యలో పియానో-బ్లాక్ ఫినిష్డ్ గ్రిల్ మరియు ఫ్రంట్ బంపర్‌పై పెద్ద ఎయిర్ డ్యామ్‌లతో కూడిన షార్ప్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్ సెటప్‌ను కలిగి ఉంది.
MOST READ:సాధారణ ట్రక్కులకంటే మరింత శక్తివంతమైన ఇన్‌ఫ్రా ప్రైమ్ ఎలక్ట్రిక్ ట్రక్కులు.. చూసారా !

క్రొత్త 11వ తరం హోండా సివిక్ సైడ్ ప్రొఫైల్ కూడా మినిమలిస్ట్ స్టైలింగ్‌ను ముందుకు తీసుకువెళుతుంది, అన్ని వక్ర క్రీజుల స్థానంలో సెడాన్ పొడవు అంతటా ఒకే లైన్ కనిపిస్తుంది. ఇందులో కొత్తగా 19 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను జోడించారు. అలాగే సైడ్ మిర్రర్లపై ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్‌లను జోడించారు, ఇవి పియానో బ్లాక్ కలర్‌లో ఫినిష్ చేశారు. బి-పిల్లర్ మరియు సి-పిల్లర్‌లను కూడా బ్లాక్ కలర్‌లో ఫినిషి చేశారు.

ఈ కారు వెనుక భాగంలో బంపర్‌కు స్పోర్టి డ్యూయెల్ ఎగ్జాస్ట్ పైపులు ఉంటాయి. అలాగే, వెనుక భాగంలో స్మోక్డ్ టెయిల్ లైట్లు ఉంటాయి. వెనుక భాగం పియానో-బ్లాక్ ఎలిమెంట్స్‌తో వస్తుంది, ఇది మొత్తం స్టైలింగ్‌ను పూర్తి చేస్తుంది.
MOST READ:భారత్‌లో జీప్ రాంగ్లర్ రూబికాన్ 392 ఎస్‌యూవీ లాంచ్ ఎప్పుడో తెలుసా?

ఇందులో గమనించదగ్గ ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, సెడాన్‌లో ఎక్కడా క్రోమ్ టచ్ కనిపించదు. అయితే, ఫైనల్ ప్రొడక్షన్ వెర్షన్ మోడల్‌లో ఇది మారే అవకాశం ఉంది. కొత్త (2022) హోండా సివిక్ కొత్త సోలార్ ఫ్లేర్ పెరల్ పెయింట్ స్కీమ్‌లో ప్రదర్శించారు. ఇది బ్లాక్ యాక్సెంట్స్‌తో మరింత స్పోర్టిగా మరియు అగ్రెసివ్‌గా కనిపిస్తుంది.

హోండా తమ కొత్త 2022 సివిక్ సెడాన్ ఇంటీరియర్స్ ఇంకా విడుదల చేయనప్పటికీ, ఇందుకు సంబంధించిన రెండరింగ్స్‌ను మాత్రం విడుదల చేసింది. ఈ రెండర్ ప్రకారం, కొత్త సివిక్ ఇంటీరియర్స్ దాని ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే పూర్తిగా మారిపోయినట్లు తెలుస్తోంది.
MOST READ:విడుదలకు సిద్దమైన కొత్త ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ ; వివరాలు

క్యాబిన్‌లో కూడా హోండా మినిమాలిస్టిక్ డిజైన్ థీమ్‌ను ముందుకు తీసుకువెళుతున్నట్లు అనిపిస్తుంది. చాలా తక్కువ సంఖ్యలో ఫిజికల్ బటన్లు ఉన్నాయి, డాష్‌బోర్డ్ కూడా సింపుల్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో పెద్ద ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన కొత్త స్టీరింగ్ వీల్ వంటి వాటిని ఇందులో ఊహించవచ్చు.

కొత్త 11 వ తరం సివిక్ సెడాన్ వివిధ రకాల బాడీ టైప్స్‌లో లభిస్తుందని హోండా ధృవీకరించింది. ఇందులో సెడాన్ మరియు హ్యాచ్‌బ్యాక్ బాడీ టైప్స్ ఉన్నాయి. అలాగే, ఇందులో హై-పెర్ఫార్మెన్స్ ‘టైప్-ఆర్' మోడల్ కూడా లభిస్తుందని అంచనా.
కొత్త 2022 హోండా హోండా సివిక్ యొక్క ఫైనల్ ప్రొడక్షన్ వెర్షన్‌ను దాని అంతర్జాతీయ ప్రయోగానికి దగ్గరలో ప్రదర్శించే అవకాశం ఉంది. అంటే, 2021 మధ్య భాగం నాటికి ఈ ప్రోటోటైప్ ఆధారంగా తయారు చేసిన కొత్త సివిక్‌ను చూసే అవకాశం లభిస్తుందని అంచనా.
MOST READ:పబ్‌జి ప్రేమికుల కోసం తయారైన కొత్త హెల్మెట్స్.. చూసారా !

కొత్త 2021 హోండా సివిక్ కారుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
హోండా తమ 11వ తరం సివిక్ సెడాన్‌ను భారత మార్కెట్‌కు పరిచయం చేయటంపై ప్రస్తుతానికి ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అయితే, భారత్‌లో హ్యుందాయ్ ఎలంట్రా మరియు టొయోటా కరోలా వంటి మోడళ్లకు హోండా పోటీ ఇవ్వాలంటే ఈ కొత్త సివిక్ మోడల్‌ను మార్కెట్లో పరిచయం చేయాల్సిన అవసరం ఉంది.